స్నేక్ గ్యాంగ్ దస్ బస్హైదరాబాద్ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఒంటరి మహిళలను, నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగే జంటలను టార్గెట్ చేసుకుని.. పాములతో భయపెట్టి అత్యాచారాలు చేసే నీచమైన ముఠా.. స్నేక్ గ్యాంగ్! ఇదొక్కటే కాదు... హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఆ గ్యాంగ్‌లాంటివే మరో పది ముఠాలు అరాచకం సృష్టిస్తున్నాయి. భూకబ్జాలు.. సెటిల్‌మెంట్లు.. భయపెట్టి బలవంతపు వసూళ్లు.. ఇదే వీరి పని! ఈ విషయం పోలీసులకు తెలియనిది కాదు. తెలిసినా.. చర్యలు తీసుకుందామన్నా.. ఈ గ్యాంగ్‌లు పోలీసులనే బెదిరించే స్థాయికి ఎదిగాయి. ఉదాహరణకు.. పదేళ్ల క్రితం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఒక ఎస్‌ఐకి ఒక గ్యాంగ్ మందు, విందు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆయన గదిలోకి ఇద్దరు మహిళలను పంపి వీడియోలో రికార్డ్ చేశారు. దాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందజేసి ఆ ఎస్‌ఐని ఇంటికి పంపించారు. ఇటీవల బయటపడ్డ దయాని గ్యాంగ్ పాములతో తిరుగుతుంటే.. కొన్ని గ్యాంగ్‌లు గుర్రాలపై బస్తీల్లోనే స్వారీ చేస్తున్నాయి. ఎదురుతిరిగిన వారిని ఆయుధాలతో బెదిరిస్తున్నాయి. వేళాపాళా లేకుండా బస్తీల్లో ముఖ్యంగా పిల్లలు ఆడుకునే ప్రాంతాల్లో వీరు వేగంగా గుర్రాలపై తిరుగుతారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు అందినా పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయా బస్తీల వాసులు ఆరోపిస్తున్నారు. పహాడీషరీఫ్ ప్రాంతంలో ఇలా అల్లరి మూకల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకపోవడానికి పోలీసుల సహకారం పుష్కలంగా ఉండడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ఎస్‌ఐ అండదండలతో ఈ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయని సమాచారం. పహాడీషరీఫ్ ప్రాంతంలోని కొత్తపేట, ఎర్రకుంట, సాడర్‌నగర్, టూర్ కాలనీ, బిస్మిల్లా కాలనీ, ఖుబా కాలనీ, మహ్మద్ నగర్, ఇస్మాయిల్ నగర్, మీనార్ కాలనీ, ఉస్మాన్‌నగర్ ప్రాంతాల్లో ఈ గ్యాంగ్‌ల ఆగడాలు మరీ ఎక్కువగా సాగుతున్నాయి. పోలీసుల ‘అవసరాలను’ తీర్చి తమ జోలికి రాకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. కొడుకు స్నేహితులను దాచిన తండ్రి.. స్నేక్‌గ్యాంగ్ అకృత్యాల విషయంలో ఒక కొత్త విషయం బయటపడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన ఖాదర్ బారక్‌బ తండ్రి అలీ బారక్‌బ.. తన కొడుకు స్నేహితులైన ముగ్గురు నిందితులకు ఆశ్రయం కల్పించాడు. ఖాదర్, అతడి స్నేహితులు.. నిస్సహాయ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని తెలిసినా చాటుగా దాచిపెట్టి, పోలీసుల కంటపడకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేలా చేశాడు. జూలై 31న హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో మహిళపై దయానీ బృందం అత్యాచారం చేసిన తర్వాత నిందితులు సలామా, ఎండీ పర్వేజ్, ఎండీ ఇబ్రహీం, ఖాదర్ బారక్‌బ, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్ పరారయ్యారు. వీరిలో సలామా, పర్వేజ్, ఇబ్రహీంలను ఖాదర్ బారక్‌బ తండ్రి ఆలీ బారక్‌బ ఏడో తేదీన కోర్టులో లొంగిపోయేలా చేశాడు. వారికి ఆశ్రయం కల్పించి రహస్యంగా కోర్టుకు తీసుకెళ్లాడు. ఇక ఈ దయాని గ్యాంగ్ గురించి తవ్వేకొద్దీ నేరాల చిట్టా బయట పడుతోంది. మహిళలపై అఘాయిత్యాలే కాకుండా వీరు భూకబ్జాలకూ పాల్పడుతున్నారు. ఇందుకోసం వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద గుమస్తాలుగా పనిచేస్తున్నారు. ఖాళీగా భూమి కనిపిస్తే చాలు.. అందుల్లో గద్దల్లా వాలిపోతారు. ఈ భూకబ్జాలకు సంబంధించి అనేకమంది బాధితులు ఫిర్యాదు చేసినా పహాడీషరీఫ్ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఫాంహౌస్‌లో అత్యాచారాన్ని కప్పిపుచ్చడానికి కూడా ప్రయత్నాలు జరిగాయని.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ముగ్గుర్ని కస్టడీలోకి తీసుకుని విచారించినప్పటికీ ఆ వ్యవహారాన్ని పైపైనే ముగించి మమ అనిపించారని పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. పాములతో వాహనాల్లో సంచారం పహాడీషరీఫ్ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఇక్కడ చెట్లు, పొదల నుంచి పాములు ఖాళీ ప్రదేశాల్లోకి వస్తుంటాయి. జిమ్ కోచ్, స్నేక్ గ్యాంగ్ లీడర్ అయిన ఫైసల్ దయాని.. అతడితోపాటు ఖాదర్ బారక్‌బ ఆ పాములను పట్టుకుని వాటి కోరలను తీసేస్తారు. తర్వాత వాటిని భద్రపరిచి రాత్రిపూట బయటకు తీస్తారు. సాలం హందీ, ఫైసల్ దయాని భూకబ్జాల్లో బాగా డబ్బు సంపాదించిన నేపథ్యంలో ఆ పాములను దగ్గర పెట్టుకుని ఖరీదైన వాహనాల్లో తిరుగుతుంటారు. వీరితోపాటు ఖాదర్ కూడా ఉంటాడు. ఎవరినైనా టార్గెట్ చేసిన తర్వాత వీరు.. సలామా, పర్వేజ్, ఇబ్రహీంలకు ఫోన్‌లో సమాచారమిస్తారు. జూలై 31న వీరిలో ఒకడు ఇదే రీతిలో తిరుగుతూ.. ఫాంహౌస్‌లో కాబోయే భార్యాభర్తలు ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. తర్వాత మిగిలిన వారికి సమాచారమివ్వడంతో దయాని, సాలం హందీ పామును వెంటబెట్టుకుని ఫాంహౌస్‌లోకి ప్రవేశించి దుర్మార్గానికి పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూన్న స్నేక్ గ్యాంగ్ అరెస్టు .
హైదరాబాద్: నగరంలో స్నేక్ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. పాములతో బెదిరించి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళల నగ్న చిత్రాలను సెల్ లో తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఏడుమందితో ఉన్న గ్యాంగ్ ఆటోలో తిరుగుతూ రోడ్డుపైన వెలుతున్న ఆడ పిల్లలను వివస్త్రలను చేసి… వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ ఆ చిత్రాలను సెల్ లో తీస్తూ వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
అంతేకాకుండా పార్కులోని ప్రేమ జంటలను పాములతో బెదిరించి…వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. భూ కబ్జాలే లక్ష్యంగా స్నేక్ గ్యాంగ్ పని చేస్తోంది. అయితే పోలీసుల కన్నుసన్నల్లోనే ఈ తంతు జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పహాడీ షరీఫ్ పోలీసులు వారి అఘాయిత్యాలపై స్పందించలేదని ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో పోలీసులు ఆ గ్యాంగ్ కు చెందిన 9 మందిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తే…నిజాలు నిగ్గు తేలుతున్నాయి.
మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతోన్న స్నేక్ గ్యాంగ్ అరెస్టు
17:39 - August 24, 2014
హైదరాబాద్: నగరంలో స్నేక్ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. పాములతో బెదిరించి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళల నగ్న చిత్రాలను సెల్ లో తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఏడుమందితో ఉన్న గ్యాంగ్ ఆటోలో తిరుగుతూ రోడ్డుపైన వెలుతున్న ఆడ పిల్లలను వివస్త్రలను చేసి... వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ ఆ చిత్రాలను సెల్ లో తీస్తూ వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా పార్కులోని ప్రేమ జంటలను పాములతో బెదిరించి...వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. భూ కబ్జాలే లక్ష్యంగా స్నేక్ గ్యాంగ్ పని చేస్తోంది. అయితే పోలీసుల కన్నుసన్నల్లోనే ఈ తంతు జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పహాడీ షరీఫ్ పోలీసులు వారి అఘాయిత్యాలపై స్పందించలేదని ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో పోలీసులు ఆ గ్యాంగ్ కు చెందిన 9 మందిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తే...నిజాలు నిగ్గు తేలుతున్నాయి.
అత్యాచారాల స్నేక్ బ్యాచ్!
Sakshi | Updated: August 24, 2014 18:59 (IST)
హైదరాబాద్: హైదరాబాద్ పహాడీ షరీఫ్‌లో యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన స్నేక్‌బ్యాచ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాతబస్తీలో కాబోయే భర్త ఎదుటే యువతిపై అత్యాచారం చేసిన ఈ స్నేక్ బ్యాచ్ ఇలాంటి ఎన్నో నేరాలకు పాల్పడిందని పోలీసులు విచారణలో తెలిసింది. అత్యాచారాలే కాకుండా ఈ బ్యాచ్ పాములతో బెదిరించి అనేక సెటిల్‌మెంట్‌లు కూడా చేసినట్లు తేలింది. ఈ బ్యాచ్ గతంలో కూడా ఎన్నో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
|
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.
Sunday, 24 August 2014
Snake Gang - Pahadi Shariff
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment