బీసీలను విద్యకు దూరం చేసేందుకే..‘ఫాస్ట్’ కేసీఆర్‌ను తరిమికొడతాం : ఆర్.కృష్ణయ్య కవాడిగూడ/హైదరాబాద్, ఆగస్టు 24 : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని, ఆ పథకాన్ని రద్దు చేసినా, హాస్టల్స్‌ను ఎత్తేసినా బీసీలందరూ టెర్రరిస్టులై ఉద్యమిస్తారని, సీఎం ఇంటితోపాటు గ్రామాల్లో ఉన్న దొరలను తరిమికొడతారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజు బకాయిలను చెల్లించాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘‘బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎత్తివేస్తున్నారు. ఫాస్ట్ పథకం తెస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే సీఎం కేసీ ఆర్ మైకాన్ని దించుతాం. ప్రభుత్వ పీఠాన్ని కది లిస్తాం’’ అని తీవ్రస్వరంతో అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర విద్యార్థులకు చెల్లించకున్నా ముందు తెలంగాణ విద్యార్థులకైనా బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ సదస్సులో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాస్‌గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పాల్గొన్నారు. |
|
No comments:
Post a Comment