Monday 18 August 2014

మూడు పరీక్షలకు ఒకటే పరికరం

మూడు పరీక్షలకు ఒకటే పరికరం

Published at: 18-08-2014 07:11 AM
-  షుగర్‌, మలేరియా, నీటి కాలుష్యం..
-   ఈ పరీక్షలన్నీ మన అర చేతిలోనే

వాషింగ్టన్‌, ఆగస్టు 17: షుగర్‌ లెవెల్స్‌ కొలవడానికి ఒక పరీక్ష, మలేరియా ఉందేమోనని అనుమానం వస్తే.. ఉందో లేదో కనుగొనడానికి మరో పరీక్ష. తాగే నీరు కాలుష్యం లేకుండా ఉందో లేదోనని అనుమానంగా ఉంటే మరో పరీక్ష. ఇలాంటి పరీక్షలు మన సమయాన్ని, ధనాన్ని తినేస్తుంటాయి. సమీప భవిష్యత్‌లో అలాంటి సమస్య లేకుండా మీకు డయాబెటిస్‌ ఉంటే గ్లూకోజ్‌ లెవెల్స్‌ కొలతకు, మలేరియా అనుమానం ఉంటే వెంటనే తీర్చడానికి, మీ ఇంట్లో నీటి కాలుష్యాన్ని అంచనా వేయడానికి అర చేతిలో పట్లే ఒక 100 గ్రాముల పరికరం అందుబాటులోకి రానుంది. పైన చెప్పిన మూడు పరీక్షలను కలిపి ఒకే చోట చేసేలా, ఒక చిన్న పరికరాన్ని హార్వర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు తయారు చేశారు. వాటిలో ఐడు యూనిట్లను భారత్‌లో పరీక్షిస్తున్నారు. ప్రయోగాలు సఫలమైతే ఒక్కో పరికరం 25 డాలర్లు (సుమారు 1500 రూపాయలు) ఖరీదుకే దొరుకుతుంది. ఒక పెద్ద సిగరెట్‌ ప్యాక్‌ పరిమాణంలో ఉండే దీని బరువు 100 గ్రాముల కంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం శరీరంలో షుగర్‌ స్థాయి కొలిచే పరికరం ఆధారంగా దీన్ని తయారు చేశారు. దీనిలో రెండు బటన్స్‌ ఉంటాయి. ఏ పరీక్ష చేయాలనుకున్నారో దాన్ని ఎంపిక చేసుకుని, ‘గో’ అని ప్రెస్‌ చేస్తే కావలసిన విలువ వచ్చేస్తుంది.

No comments:

Post a Comment