Thursday, 28 August 2014

అందిరితో చర్చించాకే రాజధానిపై నిర్ణయం కమిటీ నివేదికపై సోమవారం కేబినెట్‌లో చర్చ : నారాయణ

అందిరితో చర్చించాకే రాజధానిపై నిర్ణయం
కమిటీ నివేదికపై సోమవారం కేబినెట్‌లో చర్చ : నారాయణ

హైదరాబాద్‌, ఆగష్టు 28 : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రాజధాని సలహా కమిటీ చైర్మన్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలోని అంశాలపై వచ్చే సోమవారం కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు.
 
రైతాంగానికి నష్టం జరగకుండా కమిటీ సూచనలు చేసిందని నారాయణ అన్నారు. దేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ర్టాల రాజధానులను సెప్టెంబర్‌ 10 తర్వాత కమిటీ పరిశీలిస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
 
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని ఉండే అవకాశం ఉందని ఇంతకు ముందే ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని, శివరామకృష్ణ కమిటీ సూచలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. కమిటీపై మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందని లేని పక్షంలో అనేక అభిప్రాయాలతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
 
రాజధానిపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకే కమిటీ ఏర్పాటు అయిందని, ఏపీ రాజధానిని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment