శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తాత్కాలిక రాజధాని ప్రకటన అర్థరహితం : బొత్స
హైదరాబాద్, ఆగష్టు 14 : శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం అర్థరహితమని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ నివేదిక వచ్చాక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉంటున్ననదే తాత్కాలిక రాజధాని అని మరో తాత్కాలిక రాజధాని అవసరం లేదని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతాయని, ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారి గురించి ఆలోచించకుండా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment