రాజధానిగా విజయవాడను వ్యతిరేకించడం లేదు, బడ్జెట్‌లో రాజధాని ఊసే ఎత్తలేదు : విరుచుకుపడిన జగన్
హైదరాబాద్, ఆగస్టు 20 : ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో ఏర్పాటుపై నేను వ్యతిరేకించడంలేదని, రాజధానికి 35వేల ఎకరాల భూమి అవసరమన్నది తన వాదనని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బడ్జెల్‌లో రాజ«ధాని ఊసే ఎత్తలేదని అన్నారు.
విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తే నేను ఆహ్వానిస్తానని... అయితే తనకు ఒకే అభ్యంతరం ఉందని 35వేల ఎకరాల స్థలం ఎక్కడ ఉందో అక్కడ రాజధాని పెడితే మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాని విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అనలేదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో 35 వేల ఎకరాలు సేకరించి రాజ«ధాని ఏర్పాటు చేస్తే స్వాగతిస్తానని జగన్ చెప్పారు. బడ్జెట్‌లో మాత్రం రాజధానికి సంబంధించి కేటాయింపులు లేకపోవడం తనను బాధపెడుతుందని జగన్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment