Sunday, 24 August 2014

Bullets in Manikonda

మణి‘కొండంత’ భయం భయం


- తమవి కానే కాదంటున్న సైన్యం
- బిక్కు బిక్కు మంటున్న స్థానికులు
- పదేళ్లుగా ఇదే తంతు
- ఒక్క బుల్లెట్‌ గుట్టూ తేల్చని పోలీసులు
 
హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంఽధ్రజ్యోతి సిటీ): నిన్న చంద్రకళ... నేడు శ్రీనివాసాచారి... మనుషులు వేర్వేరు... ప్రాంతాలు వేర్వేరు... ఇద్దరూ తూటాల బాధితులే! ఆర్మీ, పోలీసు సిబ్బంది..... శిక్షణలో ఉపయోగిస్తున్న తూటాలు......హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం శివ్వం గ్రామంలో చంద్రకళ అనే ఒక స్థానిక మహిళ తలలోకి....... సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా తూటా దూసుకుపోయింది. అది జరిగిన రెండు రోజులకు శనివారం మణికొండ పాంతంలో కార్పెంటర్‌ శ్రీనివాసాచారి చేతిలో మరో తూటా దూసుకుపోయింది. మణి కొండలో నివాస ప్రాంతాల్లోకి తూటాలు దూసుకురావడం ఇదే మొదటిసారి కాదు. గత పదేళ్ల నుంచి జరుగుతోంది. ఆదివారం అదే ప్రాంతంలో కేశవచారి ఇంటి వద్ద మరో బుల్లెట్‌ కనిపించింది. ఆయన భార్య ఉదయం వాకిలి ఊడుస్తుండగా ఈ బుల్లెట్‌ కనిపించింది. వరుసగా ఇలా బుల్లెట్లు దూసుకురావడంతో మణికొండ ప్రాంతంలోని స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.
రహస్యంగా శిక్షణ?
మణికొండలో జనావాసాల మధ్యకు దూసుకొస్తున్న బుల్లెట్లు ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి వస్తున్నాయా? లేక ఇక్కడ ఎవరైనా రహస్యంగా షూటింగ్‌ సాఽధన చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా బుల్లెట్లు వచ్చి పడుతుండడంతో మణి కొండలో నివసిస్తున్న ప్రముఖులు, సెలబ్రిటీల్లో కూడా ఆందోళన మెదలైంది. సినీ హీరో వెంకటేష్‌ ఇంటికి పావు కిలోమీటరు దూరంలోనే శ్రీనివాసాచారికి బుల్లెట్‌ తగిలింది. మణికొండలో ఉన్న బీసీ క్వార్టర్స్‌ ప్రాంతంలో పదేళ్లుగా బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంది. 2001లో బుల్లెట్‌ దూసుకురాడంతో ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత మరొకరి ఇంట్లోకి బుల్లెట్‌ దూసుకొచ్చింది. సెక్రటేరియట్‌ కాలనీలో బ్యాడ్మింటన్‌ కోర్టులోకి సైతం ఒకసారి బుల్లెట్‌ దూసుకొచ్చింది. ఆ సమయంలో కొందరు బ్యాడ్మింటన్‌ ఆడుతున్నా అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అలాగే గ్రామసర్పంచ్‌ కె.నరేందర్‌రెడ్డికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలోనూ ఒకపుడు బుల్లెట్లు వచ్చి పడ్డాయి.
మా బుల్లెట్లు కాదన్న సైన్యం 
అప్పట్లో ఈ బుల్లెట్లను పరిశీలించిన సైన్యాధికారులు......ఈ బుల్లెట్లు తమవి కాదని ఒక్క మాటలో తేల్చేశారు. స్థానికులు మాత్రం సమీపంలోని ఫైరింగ్‌ రేంజ్‌లో సైనికులు కాల్పులు ప్రాక్టీస్‌ చేసే సమయంలోనే ఈ తూటాలు వస్తున్నాయంటున్నారు. సంఘటన జరిగినపుడు నానా హడావుడి చేసే అఽధికారులు..... ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు. పదేళ్లుగా తూటాలు వచ్చి పడుతున్నా అవి ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విషయాన్ని ఇప్పటి వరకు తేల్చలేక పోయారు. అందుకోసం పోలీసులు ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు.

No comments:

Post a Comment