Saturday 31 May 2014

జయ జయహే తెలంగాణ..

జయ జయహే తెలంగాణ..

Published at: 31-05-2014 04:44 AM
తెలంగాణ తల్లికి మాలిక.. నాలుగు చరణాల గీతిక!
రాష్ట్ర గీతంగా అందెశ్రీ పాట.. కొన్ని మార్పులు చేసిన కేసీఆర్
జూన్ 2 నుంచి అమల్లోకి.. టీ-స్కూళ్లలో నిత్య పారాయణం
హైదరాబాద్, మే 30 : ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ రచించిన 'జయ జయహే' గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికయింది. తెలంగాణ స్కూళ్లలో ఉదయ గీతంలా ఇప్పటికే ప్రసిద్ధమయిన ఈ పాట.. జూన్ రెండు నుంచి తెలంగాణ ప్రభుత్వ అధికారిక గేయంగా ప్రతి గొంతులో పలకనుంది. తెలంగాణ చరిత్ర, వర్తమానాలను బొమ్మగట్టి.. భవిష్యత్తుపై అంతులేని ఆశ్వాసాన్ని ప్రకటించిన ఈ గీతం 11 చరణాలతో రూపొందింది. ఇందులోని నాలుగు చరణాలను ఎంచుకొని రాష్ట్ర గీతంగా పాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీ ఆర్ స్వతహాగా సాహిత్యాభిలాషి కావడంతో, ఆయన పర్యవేక్షణలోనే ఈ గీతానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మారిన పరిస్థితుల్లో ఆయన కొన్ని సవరణలను చేశారు. అందెశ్రీ రాసిన నాటికి తెలంగాణ పది జిల్లాలతో ఉంది. అయితే, ఆ సంఖ్యను 24 జిల్లాలకు పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. దానికి అనుగుణంగా గేయంలో మార్పు చేశారు. ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ గీతంతోనే సంబురాలు మొదలు కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర గీతం
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది (24) జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
జానపద జ నజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పాట పలికిందిలా..
మలిదశ తెలంగాణ ఉద్యమానికి 14 ఏళ్లు నిండిన సందర్భంగా 2012లో తెలంగాణ అంతటా కళా జాతాలు సాగాయి. రసమయి బాలకిషన్ సారథ్యంలో పల్లెపల్లె ఉద్యమ గీతాలతో పరవశించింది. ఉద్యమ కేంద్రాలు, వేదికలు పాటలతో పదునెక్కాయి. ఈ క్రమంలోనే అందెశ్రీ 'జయ జయహే' గీతం రచించారు. రసమయి 'ధూంధాం' కార్యక్రమం కోసం ఆయన ఈ పాటనను 2012 సెప్టెంబర్ 30న పాడారు. తెలంగాణ రచయితల వేదిక సభల్లో ఇది పతాక గీతంగా మారింది. అప్పటినుంచీ అనధికారికంగా తెలంగాణలోని ప్రతి బడిలోనూ ఉదయంపూట ఈ పాటని ఆలపిస్తున్నారు.
ఆ గౌరవం ఉద్యమానికే : అందె శ్రీ
"తెలంగాణ రాష్ట్ర గీతంగా నా పాటకు గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. నిజానికి, నా కన్నా ముందుగా తొలుత ఉద్యమానికి, ఆ తరువాత ఉద్యమ శక్తులకు, నా పాటను రోజూ పాడే బడి పిల్లలకు, ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు, జయశంకర్‌కు ఈ గౌరవం దక్కుతుంది. చివరిగా నాకు చెందుతుంది. ఈ పాట పూర్తి చేయడానికి నాకు ఏడేళ్లు పట్టింది. 10 వేల సంవత్సరాల చరిత్రని చెప్పే ప్రయత్నం చేశాను. ఇదొక చారిత్రక గీతం!''
'ఆం«ధ్రజ్యోతి'లో తొలి ముద్ర
తెలంగాణ గీతంగా 'జయ జయహే తెలంగాణ' చాలాకాలంగా ప్రజల నాలుకలపై నర్తిస్తోంది. 11 చరణాల ఈ గీతాన్ని మొట్టమొదటిసారిగా 'ఆంధ్రజ్యోతి' పత్రికే 2009 డిసెంబర్ 6న ప్రచురించింది.

Friday 30 May 2014

పొగాకు వ్యాధుల చికిత్సకు లక్ష కోట్ల ఖర్చు

Published at: 30-05-2014 05:01 AM
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల వాడకం, తద్వారా వచ్చే వ్యాధుల చికిత్స కోసం భారీ మొత్తాలను వెచ్చించాల్సి వస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధుల చికిత్స కోసం 2011లో ఆర్థిక వ్యవస్థపై పడిన భారం 1.04 లక్షల కోట్లు. ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రజారోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వ్యయం చేసే మొత్తానికి ఇది చాలా ఎక్కువ. ఓ వైపు వ్యాధి చికిత్స కోసం భారీ మొత్తాలను వెచ్చించడం.. మరోవైపు ఉత్పాదక శక్తి తగ్గిపోవడం.. రెండూ భారత్‌కు పెనుభారంగా పరిణమించాయి. ఈ మేరకు ఈ నెల 31 (శనివారం)న పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు సంబంధిత వ్యాధులు- భారత ఆర్థిక వ్యవస్థపై వాటి భారం పేరుతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఓ నివేదిక వెల్లడించారు. పొగాకు వినియోగం వల్ల దేశ ఆర్థిక, ఉత్పాదక రంగాలపై పడే భారాన్ని ఇందులో వివరించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల తలెత్తే శ్వాసకోస సంబంధిత వ్యాధులు, క్షయ, హృద్రోగాలతో పాటు వివిధ రకాల కేన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఆయా వ్యాధుల చికిత్సకు వైద్య సహాయం, మందులపై వెచ్చించే మొత్తం 16800 కోట్లు కాగా, రోగ వ్యాప్తిని అరికట్టేందుకు పరోక్షంగా 14700 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోందని నిపుణులు పేర్కొన్నారు. అదేసమయంలో అకాల మరణాల కారణంగా అయ్యే వ్యయం 73 వేల కోట్లని తెలిపారు. ఈ మొత్తాలు దేశ స్థూల జాతీయోత్పత్తిలో 1.16 శాతం కాగా, 2011లో ప్రజారోగ్య సంరక్షణ కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన మొత్తానికి 12 శాతం ఎక్కువ. దేశ ఆర్థిక, ఉత్పాదక రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతూ దేశ పురోభివృద్ధికి ఆటంకం కలిగిస్తోన్న పొగాకు వినియోగాన్ని దూరం చేసుకునేలా ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు. దీనికోసం అన్ని రంగాల ప్రజలు సంఘటితమై పొగాకు ఉత్పత్తులు వాడుతున్న వారికి దాని వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి ఆ అలవాటు నుంచి తప్పించాలని అన్నారు.

కొండంత మంపు!

కొండంత మంపు!

Published at: 31-05-2014 04:52 AM
కొండరెడ్లకు జల'గండం'!
వేగంగా అంతరించిపోతున్న జాతి
ఇప్పుడు పోలవరంలోకి మునక
పూర్తిగా మునగనున్న కొండ అవాసాలు
ప్రాజె క్టు పూర్తయితే.. బతుకు ఛిద్రమే
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాలకు సమానంగా ఊగిన భూమి. సమైక్య, విభజన హోరులో ఊయలలూగిన నేల. అటూ ఇటూ జరిగిన ఆత్మహత్యలకు కన్నీరు కార్చి..నిరాహార, నిరసన దీక్షలకు జైకొట్టిన ప్రాంతం. ఇప్పుడా ఉద్యమాలన్నీ చల్లబడ్డాయి. ఈ గోదావరి ఒడ్డు ప్రాంతాన్ని ఎవరికి వారు వదిలేసి పంపకాల వేటలో పడ్డారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని అమాయక ఆదివాసీలను 'వేట'గా చేసుకొని వాటాలు సరిచేసుకుంటుకొన్నారు. పోలవరం కోసం ఒకరు.. హైదరాబాద్ కోసం మరొకరు.. పట్టుబట్టిమరీ ఈ ప్రాంతాన్ని 'ముంపు'లోకి తోస్తున్నారు. మందు సరిపడితే రోగం కుదురుతుంది. లేదంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ, 'విభజన-పోలవరం' వ్యవహారంలో ప్రయోజనం సీమాంధ్ర, తెలంగాణలకు గాక, దాని సైడ్ ఎఫెక్ట్‌ని మాత్రం భద్రాచలం వాసులు అనుభవించాల్సి వస్తున్నది. ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాను తెలంగాణ పటంలో చూపించిన నేతలు.. ఇప్పుడు దాన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పటానికి బదలాయించేస్తున్నారు.
భద్రాచలం, మే 30 : ప్రకృతి ఆశీర్వదించిన పుత్రులు వాళ్లు. కొండలూ కోనలూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటాయి. గలగలపారే సెలయేర్లను చూసి నడక నేర్చుకున్నారు. ఆకాశంలో రెక్కలు విప్పే పక్షుల్లా స్వేచ్ఛా జీవనం చేస్తూ.. అటవీ సంపదని చంటిబిడ్డలా కాపాడుకుంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు వారికీ, ఆ వన సీమలకూ 'ముంపు' వచ్చింది. ఒకసారి అభివృద్ధి పేరుతో, మరోసారి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో వీరిని కొండ దించేందుకు ప్రయత్నాలు జరగాయి. చెట్టేక్కిన బేతాళుడిని చెట్టు నుంచి విడిపించలేని విక్రమార్కుడిలా..కొండ దిగిన వీరికి అండని ఇవ్వడంలో ప్రతిసారీ అధికారులు విఫలమయ్యారు. ఇప్పుడు ఏకంగా 'ముంచేస్తున్నారు'.
కొండరెడ్లు..ఓ ఆదిమ తెగ. అంతేకాదు..అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతుల్లో వీరూ ఒకరు. కొండలే వీరి జీవన క్షేత్రం. ఈ కారణంగానే ఈ తెగకు కొండరెడ్లనే పేరు వచ్చింది. కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, వేలేరుపాడు మండలాల్లోని 66 గ్రామాల్లో మొత్తం పదివేలమంది కొండరెడ్ల జనాభా ఉంది. ఇప్పుడీ ప్రాంతమంతా పోలవరం కింద మునిగిపోనుంది. వీరి జీవన శైలికి తగినట్టే భాష,ఆహార్యం కూడా వేరు. పురుషులు గోచీతో నడుముకు చాకత్తి ధరిస్తారు. విల్లంబులు వారి శరీరంలో భాగంలా కలిసిపోతాయి. కొండరెడ్లు సంప్రదాయప్రియులు, పర్యావరణ ప్రియులు. సహజ జల సంపద పుష్కలంగా ఉన్నా.. నీటిని ఎంతమాత్రం వృథాపరచరు. గొంతు తడుపుకోడానికి, పంటలు పండించడానికే వాటిని వినియోగిస్తారు. వీరు బాహ్య ప్రపంచంతో అస్సలు కలవరు. తాము కొండ దిగి మైదానంలోకి అడుగుపెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి, జొన్న, సజ్జ పండిస్తారు. ఇప్పుడు వీరిలో ఎక్కువమంది అటవీ ఉత్పత్తుల సేకరిస్తూనో, కూలీలుగానో జీవిస్తున్నారు. అటవీ జంతువులను వేటాడటం, మద్యపానం చేయడం వీరికి ఇష్టమైన వ్యాపకాలు. నిజానికి, వీరిని కిందికి దించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అవి కొంతవరకు ఫలించాయి కూడా. అయితే, హామీలంత ఘనంగా పనులు లేకపోవడంతో వీరిలో చాలామంది తిరగి కొండెక్కేశారు. ఇది వారిలో మైదానాల పట్ల ప్రతికూల భావనని కలిగించింది. ఈ నేపథ్యంలో కూనవరం, చింతూరు మండలాల్లోని 14 గ్రామాలకు చెందిన కొండరెడ్లు.. గుట్ట దిగడమే లేదు. రోగాలు,రొష్టులు వస్తే ఆకు పసరు వైద్యం చేసుకొంటున్నారు తప్ప మైదాన ప్రాంత సాయం ఆశించడం లేదు. నాగరికులను నమ్మేది లేదని కొండరెడ్ల నాయకులు తేల్చిచెబుతున్నారు. "గతంలో అభివృద్ధి చేస్తామని కొండల మీద నుంచి కిందకు దించారు. కానీ, మాటలంత తియ్యగా పనులు లేవు'' అని వారు ఆరోపిస్తున్నారు.
ముంపు ఇలా..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సాధారణ రోజుల్లోనే 43 అడుగులు ఉంటుంది. అది మొదటి ప్రమాద హెచ్చరిక. 365 రోజులూ ఈ ప్రాంతంలో ఇదే నీటిమట్టం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఇది మరింతగా పెరిగి తుది ప్రమాద హెచ్చరిక 53 అడుగులు చేరితే, కొండలు, గుట్టల చుట్టూ పెద్దఎత్తున నీరు చేరుతుంది. చుట్టూ నీరు.. మధ్యలో కొండరెడ్ల ఆవాసాలతో చిన్నసైజు ద్వీపకల్పాన్ని ఈ ప్రాంతాన్ని తలపిస్తుంది.
మరోసారీ..
ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యకలాపాలు 29 మండలాలతో పాటు రెండు మాడా మండలాల్లో విస్తరించింది. ఇందులో గ్రామాలు 904. కాగా, టీఎస్పీ (గిరిజన ఉప ప్రణాళిక) పరిధిలో 12,175 చదరపు కిలోమీటర్ల భూభాగముంది. ఇక మాడా (మోడిఫైడ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) మండలాలు మూడు కాగా, గ్రామాలు: 14. పీటీజీ (ప్రిలిమినరీ ట్రైబల్ గ్రూప్) మండలాలు ఆరు ఉండగా, గ్రామాలు 66 ఉన్నాయి. కాగా, వరసగా నాలుగో సారి ఈ సంస్థ స్థానచలనానికి గురవుతున్నట్టు సమాచారం. తొలుత ఖమ్మం కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థని, తరువాత పాల్వాంచకు, అక్కడ నుంచి భద్రాచలానికి మా ర్చారు. ప్రస్తుతం పోలవరం ముంపు ప్రాంతాల్లోనే ప్రధానంగా పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ముంపు ప్రాంతాలతో పాటు.. ఐటీడీఏ కూడా సీమాంధ్ర ప్రాం తానికి తరతిపోతుందని సమాచారం.
ఖమ్మం జిల్లాలో గిరిజన జనాభా : 6.83 లక్షలు
గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతంలో : 5.61 లక్షలు
కోయ : 3.14 లక్షలు
కొండరెడ్లు : 0.10
బంజారాలు : 3.29
ఎరకలు : 0.20
యానాది : 0.007
ఇతరులు : 0.003

పోలవరంపై ఎందుకీ రచ్చ?

పోలవరంపై ఎందుకీ రచ్చ? -టి. లక్ష్మీనారాయణ

Published at: 30-05-2014 00:52 AM
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 'షాక్' ఇచ్చింది. పోలవరంపై నిప్పు పెట్టి, లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు తాపత్రయపడడం తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాలకు అత్యంత హానికరం. గోదావరి పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ మూడు వేల టీఎంసీల నికరజలాలు లభిస్తాయని అంచనా కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1480 టీఎంసీలను కేటాయిస్తూ 1980లో ప్రకటించింది. ఇప్పటి వరకు మనం దాదాపు 800 టీఎంసీలను మాత్రమే ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకున్నాం. ఇంకా 700 టీఎంసీల నికర జలాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఫలితంగా ప్రతి ఏడాదీ వరద నీటితో కలిపి సగటున 3వేల టీఎంసీల నీరు సముద్ర గర్భంలో వృధాగా కలిసిపోతున్నది. వరదలొచ్చినప్పుడు లక్షలాది ఎకరాలలో పంటలు నీటిపాలైపోతున్నాయి. ప్రాణనష్టం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వరదల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించవచ్చు. సమృద్ధిగా ఉన్న నీటిని కరువు పీడిత ప్రాంతాలకు తరలించడం ద్వారా తెలుగు జాతి సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుంది. దేశ ఆహార భద్రతకు ఉపకరిస్తుంది.
ఈ లక్ష్యాలకు అనుగుణంగా నిర్మించ తలపెట్టిన ఇందిరాసాగర్ (పోలవరం) బహుళార్థ సాధక ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం అంటే జాతి ప్రయోజనాలకు విఘాతం కల్గించడమే. ప్రజల ఏడు దశాబ్దాల చిరకాల వాంఛ పోలవరం. ఈ ప్రాజెక్టు ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరుతాయి. ధాన్యాగారమైన కృష్ణ, గోదావరి డెల్టాకు సాగునీటి సరఫరాలో తరచూ ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. వర్షా కాలంలో ఉధృతంగా ప్రవహించే గోదావరి నదిలో తరువాత కాలంలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ధవళేశ్వరం, విజ్ఞేశ్వరం ఆనకట్టలు 10.50 లక్షల ఎకరాలున్న గోదావరి ఆయకట్టుకు పంట కాలం మొత్తానికి నీరందించలేని దుస్థితి నెలకొన్నది. పోలవరం వంటి పెద్ద రిజర్వాయరు నిర్మాణం ద్వారా మాత్రమే ఆయకట్టుకు రక్షణ కల్పించవచ్చు. ప్రాజెక్టు నమూనాలో మార్పులు చేసి, జలాశయం ఎత్తును తగ్గించడం ద్వారా ముంపు ప్రాంతాలను తగ్గించాలని ప్రాజెక్టును వ్యతిరేకించే శక్తులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. నమూనాలో మార్పులు చేస్తే ప్రాజెక్టు మౌలిక లక్ష్యాలే దెబ్బతింటాయి. ప్రస్తుత ప్రాజెక్టు నమూనానే అత్యుత్తమమైనదని నిపుణుల కమిటీ, అలాగే కేంద్ర జల సంఘం వేరువేరుగా లోతైన అధ్యయనం చేసి నివేదికలిచ్చాయి. సుప్రీం కోర్టు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగానే ఉన్నదని చెప్పింది.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలలో 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ప్రస్తుతం కృష్ణా నదీ జలాల ఆధారంగా సాగులో ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టుకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 80 టీఎంసీల గోదావరి నీటిని సరఫరా చేసి, కర్ణాటక, మహారాష్ట్రల వాటా 35 టీఎంసీలు పోను మిగిలిన 45 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకొనే అవకాశం ఇచ్చింది. నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా, తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ (29), హంద్రీ-నీవా (40), గాలేరు-నగరి()38), వెలుగొండ (43.5), నెట్టెంపాడు (20 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు), యస్.యల్.బి.సి. (30 టీఎంసీలు) ప్రాజెక్టులకు కావలసిన మొత్తం 225.5 టీఎంసీల నీటి అవసరాలలో కొంతమేరకైనా నికర జలాలను కేటాయించి సద్వినియోగం చేసుకోవచ్చు. తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో చౌకగా 960 మెగావాట్ల జల విద్యుదుత్పాదన చేసుకోవచ్చు. విశాఖపట్నానికి మంచినీరు, ఉక్కు పరిశ్రమ అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయాలని కూడా నిర్దేశించుకోవడం జరిగింది. వీటన్నింటినీ ప్రాంతీయ కోణం నుంచి పాక్షిక దృష్టితో చూసి, వ్యతిరేకించడం ఏమాత్రం సమంజసం కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డడం తెలుగు జాతి ప్రయోజనాలకు హాని కల్పించడమే అవుతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 38,186 హెక్టార్లు, ఛత్తీస్‌గఢ్‌లో 1,637 హెక్టార్లు, ఒడిశాలో 1,182 హెక్టార్ల భూములు, వాటిలో భాగంగా 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు, 34,143 కుటుంబాలకు చెందిన 1,40,275 మంది జనాభా, పశ్చిమగోదావరి జిల్లాలో 42 గ్రామాలు, 6,959 కుటుంబాలు, 25,026 మంది జనాభా, తూర్పుగోదావరి జిల్లాలో 29 గ్రామాలు, 3,472 కుటుంబాలు, 11,874 మంది జనాభా నిర్వాసితులవుతారని అంచనా వేశారు. వీరిలో 45 శాతానికి పైగా గిరిజనులే కావడం గమనార్హం. అందువల్ల ప్రత్యేక దృష్టితో మెరుగైన సహాయ, పునరావాస పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ద్వారా సమకూరే ప్రయోజనాలను అనుభవించడంలో నిర్వాసితులే మొదటి లబ్ధిదారులు కావాలి. ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతం పరిధిలోనే చట్టబద్ధంగా ముంపు ప్రాంతాలుంటే నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించడంలోను, మెరుగైన సహాయ, పునారావాస కార్యక్రమాలను చేపట్టడానికి సౌలభ్యంగా ఉంటుంది. అప్పుడే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవరోధాలు ఉండవు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఈ పూర్వరంగంలో తెలుగు నాట ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకాలు మోపాలనే దురుద్దేశాలున్న పేచీకోరులకు ఆ అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం స్వాగతించదగ్గ చర్య. అలాగే ప్రాజెక్టు నిర్మాణం మూలంగా నిర్వాసితులయ్యే ప్రజానీకానికి, ప్రత్యేకించి సామాజికంగా వెనుకబడ్డ గిరిజనులకు ముందుగానే మెరుగైన సహాయ, పునరావాస పథకాన్ని నిబద్ధతతో అమలుచేయడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు మార్గాన్ని సుగమం చేయాలి.
గిరిజనుల నామస్మరణ చేస్తూ పోలవరాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలను 2009, 2014 ఎన్నికల్లో ముంపు ప్రాంతాల ప్రజలు ఆదరించలేదనే విషయాన్ని కూడా గమనించాలి. దాన్ని బట్టి గిరిజనులు ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, పేదరికంలో మగ్గిపోతూ అనాగరికులుగా బ్రతుకువెళ్ళదీస్తున్న గిరిజనులు మెరుగైన జీవనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో వారి నివాస ప్రాంతాలున్నాయి, ఎవరి పాలనలో ఉన్నామన్న దానికంటే వారి భవిష్యత్తుపైన ఆందోళన చెందుతున్నారు. ఆ మౌలిక సమస్యను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. భూములు కోల్పోయిన వారికి ప్రాజెక్టు ఆయకట్టు క్రిందనే భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించడం ద్వారా వారి జీవనోపాధికి భంగం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. చేతి వృత్తుల వారికి, గ్రామీణ సేవారంగంలో ఉపాధి పొందుతున్న అసంఘటిత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. విద్య, వైద్య, రహదారులు, రక్షిత మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజనుల చరిత్ర, సాంప్రదాయాల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయబద్ధమైన కోర్కెల సాధన కోసం ఎవరైనా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించి, ప్రజల విస్తృత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడాలి.
-టి. లక్ష్మీనారాయణ

పెద్దలు' తారుమారు!

పెద్దలు' తారుమారు!

Published at: 31-05-2014 04:33 AM
కేకే ఆంధ్రకు.. కేవీపీ తెలంగాణకు!..
సీఎం రమేశ్ తెలంగాణకు
దేవేందర్ ఆంధ్రక.. రాజ్యసభ లాటరీ విచిత్రాలు
నేదురుమల్లి సీటు ఆంధ్ర కోటాకే..
ఈసారి టీడీపీ ఖాతాలో మరొకటి
రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత కేకే ఆంధ్రప్రదేశ్ నుంచి పదవీ విరమణ చేస్తారు! సీమాంధ్రకు చెందిన కేవీపీ తన రాజ్యసభ సభ్యత్వానికి తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తారు! పార్లమెంటులో సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన సీఎం రమేశ్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు! తెలంగాణ బిడ్డను అని చెప్పుకొన్న రేణుకా చౌదరి సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తారు! రాజ్యసభ లాటరీలో విచిత్రాలివి!
ఆంధ్రప్రదేశ్...
నేదురుమల్లి, జైరాం రమేశ్, చిరంజీవి, సుజనా చౌదరి, రేణుకా చౌదరి, దేవేందర్‌గౌడ్, ఎంఏ ఖాన్, కేకే, టి.సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, తోట సీతారామలక్ష్మి
తెలంగాణ...
కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్, గరికపాటి మోహనరావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనంద్ భాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, గుండు సుధారాణి
న్యూఢిల్లీ, మే 30 : ఊహించినట్లే.. రాజ్యసభ లాటరీలో నేతలు తారుమారు అయ్యారు! రాజ్యసభలో రాష్ట్రానికి చెందిన సభ్యుల్లో ఎవరు ఏ రాష్ట్రం నుంచి పదవీ విరమణ చేస్తారో తేలిపోయింది. తెలంగాణకు చెందిన కేకే, దేవేందర్ గౌడ్, ఎంఏ ఖాన్, రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేవీపీ రామచందర్ రావు, సీఎం రమేశ్ తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తారని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం లాటరీ ప్రక్రియ ద్వారా తేల్చేశారు. దాని ప్రకారం.. 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి; ఏడుగురు తెలంగాణ నుంచి పదవీ విరమణ చేయాలని అన్సారీ నిర్ణయించారు. దివంగత ఎంపీ నేదురుమల్లి జనార్దన రెడ్డితోపాటు జైరాం రమేశ్, చిరంజీవి, సుజనా చౌదరి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, ఎంఏ ఖాన్, కే.కేశవరావు, టి. సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, తోట సీతారామలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు; సీఎం రమేశ్, గరికిపాటి మోహన్ రావు, కేవీపీ రామచందర్ రావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, గుండు సుధారాణి తెలంగాణకు చెందుతారు. నేదురుమల్లి ఆంధ్రప్రదేశ్ కోటాకే వస్తారని కూడా తేలిపోవడంతో ఇప్పుడు ఈ సీటు టీడీపీకి దక్కడం ఖాయమైంది. నేదురుమల్లి స్థానానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే జూన్ 19న ఉప ఎన్నిక ప్రకటించిన విషయం తెలిసిందే.
నేదురుమల్లి పదవీ కాలం 2016 జూన్ 21 వరకు ఉన్న నేపథ్యంలో, ఆయన స్థానంలో ఎంపికయ్యే వ్యక్తి అప్పటి వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం రాజ్యసభలో రాష్ట్ర ఎంపీల బలం 18 కాగా.. నేదురుమల్లి మరణంతో అది కాస్తా 17కు పడిపోయింది. వీరిలో టీడీపీ బలం ఆరు కాగా జూన్ 21 తర్వాత ఇది ఏడుకు పెరుగుతుంది. ఇక, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు ఏయే రాష్ట్రానికి చెందుతారనే విషయాన్ని నిర్ణయించే లాటరీ పద్ధతిని ఎంపీలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయినా.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగేలోపు ఎవరు ఏ రాష్ట్రం నుంచి పదవీ విరమణ చేస్తారో తేల్చాల్సి ఉండడంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం సాయంత్రం లాటరీ నిర్వహించారు. ఊహించిన విధంగానే కొందరు తెలంగాణ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, కొందరు ఆంధ్రప్రదేశ్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి పదవీ విర మణ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీని ప్రకారం.. తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఎం రమేశ్ తెలంగాణ నుంచి, తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్ ఆంధ్రప్రదేశ్ నుంచీ పదవీ విరమణ చేస్తారు. ఇక తెలుగుదేశంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుండు సుధారాణి, గరికిపాటి మోహన రావు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుజనాచౌదరి తమ తమ రాష్ట్రాల నుంచే పదవీ విరమణ చేస్తారు.
కాగా, తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు, తెలంగాణ బిడ్డగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ ఎంఏ ఖాన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందుతారని, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచందర్ రావు తెలంగాణకు చెందుతారని అన్సారీ లాటరీ ద్వారా నిర్ణయించారు. రాజ్యసభలో టీఆర్ఎస్‌కు కేకే ఏకైక సభ్యుడు కాగా ఆయన తన పార్టీ ఉనికిలో కూడా లేని ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగిలిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ సభ్యులు చిరంజీవి, జైరాం రమేశ్, టి.సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, తెలంగాణ సభ్యులు ఆనంద్ భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తమ తమ రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహిస్తారు. హమీద్ అన్సారీ లాటరీ నిర్వహిస్తున్నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్, కే.కేశవరావు, సీఎం రమేశ్, సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, సుజనా చౌదరి, గుండు సుధారాణి, గరికపాటి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
చట్ట సవరణ ద్వారా రాష్ట్రం మార్చుకోవచ్చు: జవదేకర్
ఎంపీలు తమ రాష్ట్రాలను పరస్పరం మార్చుకునే వీలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే విషయం పరిశీలిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కొంతమంది సభ్యులు తమ రాష్ట్రాలను పరస్పరం మార్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారని, అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కూడా ఇలాంటి సమస్య వచ్చిందని, అప్పట్లో చట్టంలో సవరణ చేశామని గుర్తు చేశారు. తమకు కేటాయించిన రాష్ట్రంతో నిమిత్తం లేకుండా తమ ప్రాంతాల్లో ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు పెట్టుకునేందుకు, నోడల్ జిల్లాను నిర్ణయించుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వీలు కల్పించవచ్చునని చెప్పారు. కాగా తాను, దేవేందర్ గౌడ్ పరస్పరం తమ రాష్ట్రాలను మార్చుకుంటామని సీఎం రమేశ్ చెప్పారు.
ఉన్న ఒక్కడినీ సీమాంధ్రకా?
హైదరాబాద్, మే 30 : టీఆర్ఎస్‌కి ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు లాటరీ ప్రక్రియలో సీమాంధ్రకు పోవడంతో టీఆర్ఎస్ వర్గాలు కంగుతిన్నాయి. ఇటీవల రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తమకు సరిపోను ఎమ్మెల్యేల బలం లేకపోయినా టీఆర్ఎస్ నాయకత్వం కేకేను బరిలో నిలిపింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అదనపు అభ్యర్థిని పోటీకి దించకపోవటంతో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో కేకే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్న ఒక్క సభ్యుడిని సీమాంధ్రకు కేటాయించటాన్ని టీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆయన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటం కొంత ఇబ్బందికరమని ఆవేదన చెందుతున్నాయి.

Wednesday 28 May 2014

మొదటిసారి గెలవని పార్టీకి మరుగడ ప్రశ్నార్థకమే!

మొదటిసారి గెలవని పార్టీకి మరుగడ ప్రశ్నార్థకమే!

Published at: 28-05-2014 05:37 AM
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): మంగళవారం ఇక్కడ మొదలైన మహానాడు సమావేశాల్లో తొలి రోజు ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షు డు చంద్రబాబు నాయుడు పంచ్ డైలాగులతో సభికులను ఆకట్టుకొన్నారు. మచ్చుకు కొన్ని...
- పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లో అధికారంలోకి రాలేని పార్టీ మనుగడ సాధించలేదు. ప్రజారాజ్యం, ఆప్ పార్టీలే దీనికి ఉదాహరణ. మిగిలిన పార్టీల గతి కూడా ఇంతే.
- పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా సుస్థిర పాలన ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కింది. ఆయనను కాపీ కొట్టాలని ప్రయత్నించి చాలా మంది చరిత్రలో కలిసిపోయారు. ప్రజల కోసం కాకుండా స్వార్ధంతో పెడితే ఇదే గతి.
- 1984లో ఎన్టీఆర్‌ను అక్రమంగా పదవీచ్యుతుడిని చేయడం మొదలుకొని ఇటీవలి రాష్ట్ర విభజన వరకూ కాంగ్రెస్ పార్టీ టీడీపీపై అనేక కుట్రలు చేస్తూనే వచ్చింది. కుట్రలు పన్నిన పార్టీ భూస్థాపితం అయింది. మనకేమీ కాలేదు.
- ఎన్టీ రామారావుతో...టీడీపీతో పెట్టుకొన్న నాటి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయి ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని దుర్గతికి దిగజారింది. ఇక ఆ పార్టీ మనుగడ సాధించడం కల్ల.
- గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ తదితర అక్రమ ప్రాజెక్టులు ఆపకపోతే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని మేం పోరాడాం. అవి కేవలం మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన చిన్న చిన్న ప్రాజెక్టులని టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో మహారాష్ట్రను వెనకేసుకొని వచ్చిం ది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో పోరాడగలుగుతుంది?
- ఇంకా ఇంతవరకూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా హామీల అమలు గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడాలో తెలియని స్థితిలో వారు పడిపోయారు.
- కాంగ్రెస్ హయాంలో ఎర్ర చందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. అడవులకు అడవులే ఖాళీ చేసి చివరకు వెంకటేశ్వర స్వామి చుట్టూ ఉన్న అటవీ సంపదను కూడా దోచుకొని పోయారు. వెంకన్నకు కోపం వచ్చి కన్ను తెరిచారు. అందుకే కాంగ్రెస్ భూస్థాపితం అయ్యి టీడీపీ గెలిచింది.
- రాష్ట్ర విభజన చేసిన తీరు సీమాంధ్ర ప్రజల మనసులను తీవ్రంగా గాయపర్చింది. అక్కడ ఆవేశం హద్దులు దాటకూడదని నేను బాధ్యత తీసుకొ న్నాను. హైదరాబాద్‌కు ధీటైన నగరాలు ఒకటి కాదు...మూడు నాలుగు నిర్మిస్తానని భరోసా ఇచ్చాను. వెన్ను తట్టి నడిపించాను. దానివల్ల అభద్రత పోయి ఆశ వచ్చింది. ఆ ఆశను చిగురింపచేసిన ఘనత టీడీపీదే.
- ఎంత మంది నాయకులు పోయినా...ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు కొండంత అండగా నిలిచిన ఘనత కార్యకర్తలదే. వారు నాకు కుడి భుజం మాదిరిగా నిలబడ్డారు. శక్తిని ఇచ్చారు. ఇవాళ కొండంత భారాన్ని నేను ఎత్తుకొని నిలబడటానికి వారు ఇచ్చిన స్ఫూర్తే కారణం.
- హైదరాబాద్ వంటి రాజధాని నగరం నిర్మించాలంటే రూ. నాలుగైదు లక్షల కోట్లు కావాలి. సీమాంధ్ర రాష్ట్రానికి ఆదాయం లేదు. జీతాలు చెల్లించా లి. వడ్డీలు కట్టాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రాజధాని కట్టాలి. ఇవన్నీ చేయడానికి ఆ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆలోచన కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా విభజన చేసింది. అప్పులు జనాభా ప్రాతిపదికన పంచి ఆదాయం మాత్రం ఏ ప్రాంతంలో వచ్చేది అక్కడే ఉంచేశారు.
- నేను పెద్ద రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను. చిన్న రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉందని కొందరు నన్ను అడిగారు. రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా వారి ఇబ్బందులు తీర్చాలి. నన్ను ఆదరించిన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కోసం నిలబడడం నా బాధ్యత. నేను ఢిల్లీ వెళ్తే అక్కడివారు నన్ను గౌరవించడానికి ఇక్కడి ప్రజలు కారణం. వారి రుణం తీర్చుకోకుండా ఎలా ఉండగలను?

ముస్లింలు మైనారిటీలు కారు

ముస్లింలు మైనారిటీలు కారు

Published at: 28-05-2014 05:41 AM
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 13.4 శాతమున్న ముస్లింలు మైనారిటీలు ఎలా అవుతారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ప్రశ్నించారు. అతి తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలే నిజమైన మైనారిటీలని ఆమె వ్యాఖ్యానించారు. మైనారిటీ వ్యవహారాల శాఖ అంటే ముస్లింలకు ఒక్కరికే సంబంధించిన శాఖ కాదని మొత్తం మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషిచేసే శాఖ అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కల్పించడమనేది ముస్లింల అభివృద్ధికి పరిష్కారం కాదని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలకు విద్యావకాశాలను మెరుగుపరచడంపై ప్రత్యేకదృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. తాము ముస్లింలకు రిజర్వేషన్లిస్తామని ఎప్పుడూ చెప్పలేదని.. అది కాంగ్రెస్ ప్రభుత్వమిచ్చిన హామీ అని చెప్పారు. రిజర్వేషనల్లేవి ముస్లింల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని వ్యాఖ్యానించారు. మైనారిటీల ఆర్థిక, సాంఘిక అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముస్లింల అభివృద్ధికోసం ఏం చర్యలు తీసుకుంటారన్న విలేకరుల ప్రశ్నకు హెప్తుల్లా సూటిగా సమాధానమిచ్చారు. "ముస్లింలకు మాత్రమే ఎందుకు? ఇది ముస్లింల సంక్షేమ శాఖ కాదు. అన్ని రకాల మైనారిటీల సంక్షేమ శాఖ ఇది''అని తేల్చి చెప్పారు. అసలు ముస్లింలు మైనారిటీలేకాదని హెప్తుల్లా తేల్చి చెప్పారు." 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 13.80 కోట్ల మంది ముస్లింలున్నారు. ఇది దేశ జనాభాలో 13.4శాతం. మరి అటువంటప్పుడు ముస్లింలు ఎలా మైనారిటీలు అవుతారు. అసలు ప్రస్తుతం పార్శీలు మైనారిటీలు. వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అటువంటి వారికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి'' అని హెప్తుల్లా అభిప్రాయపడ్డారు. సచార్ కమిటీ సూచనలను అమలు చేస్తారా అన్న ప్రశ్నకు ఆ కమిటీ సూచించిన అన్ని సూచనలూ అమలు చేయాలని ఏమీ లేదని స్పష్టంచేశారు.

Smriti Irani's Educational Qualifications

Congress pounces on disparity in HRD minister Smriti Irani's 2004, 2014 Lok Sabha affidavits


TNN | May 29, 2014, 01.57 AM IST


NEW DELHI: HRD minister Smriti Irani found herself at the centre of an ugly row over inconsistencies relating to her educational qualifications in affidavits she filed in 2004, 2011 and 2014, with the later ones indicating she did not complete graduation.

While the affidavit filed by Irani when she contested the 2004 Lok Sabha polls said she had completed a BA from Delhi university's school of correspondence in 1996, the 2011 submission for her Rajya Sabha elections under the head "highest qualification" stated that she did B Com part I, again from DU's school of correspondence, in 1994.

The claim of B Com part I was also made in her declaration when she contested the recent elections against Rahul Gandhi from Amethi.

READ ALSO: What Smriti Irani is looking at — IITs in every state

If her affidavits are taken at face value, Irani completed her BA degree in 1996, but chose not to mention this in her affidavits filed after 2004. Instead she cited B Com part I, which is basically one year of the three-year B Com degree course, in the 2011 and 2014 affidavits. Completing part I is no qualification and does not constitute a degree.

Seizing on the discrepancy, Congress spokesperson Abhishek Singhvi said, "In the 2004 affidavit, she has claimed to be graduate - BA of 1996. In the 2014 affidavit, it is specified that it is only BCom part I and that only means one year and not a full degree. We do not know whether 2014 is a mis-statement or 2004 is a mis-statement, but both cannot be true."


About the importance of educational qualifications in a ministerial appointment, Singhvi said, "We are not interested in personal issues. What we have said is the appropriateness, the context of this education ministry matching with the optics (of an intermediate as minister). It cannot also be forgotten that this august ministry has been headed by names like Maulana Azad, Fakhruddin Ahmed, Prof Nurul Hasan, VKRV Rao, Siddhartha Shankar Ray, Karan Singh, K C Pant, V P Singh, Murli Manohar Joshi."

READ ALSO: Row over Smriti's educational qualifications, it's Cong vs Cong now

A senior EC official said the EC was not in the picture now that the polls were over. Under the new norms, any aggrieved person may directly approach the courts against a false affidavit.

Earlier in the day, AICC general secretary Digvijay Singh said "Educational qualification of a minister/PM is not the issue...But (that) Modi chose Smriti Irani over Dr Murli Manohar Joshi is the issue." Manish Tewari, on the other hand, insisted that criticism of the government should be policy-based rather than personality centric.

Irani's ministerial colleague, water resources minister Uma Bharti, defended the HRD minister, questioning Congress chief Sonia Gandhi's educational credentials. "I want to ask Sonia Gandhi what is her qualification because she was heading the UPA government, she was giving directions to the government. I want to see her certificate," asked Bharti.

Irani did not speak to the media about the controversy and repeated attempts to reach her did not yield any results.

READ ALSO: Madhu Kishwar continues tweet-attack on Smriti Irani

BJP leader Mukhtar Abbas Naqvi said Congress leaders should shed their "arrogance" after the party's defeat in the Lok Sabha polls and do introspection. "Congress should respect the mandate of the people," he said.

Meanwhile, women rights activist Madhu Kishwar, who sparked the controversy with her tweets critical of PM Narendra Modi's decision to make Irani the HRD minister, was unsparing, saying education and research in India was in a shambles and something urgent was needed to be done to lift standards in the system. "Somebody with a vision was needed for the job", said Kishwar, a self-professed Modi supporter.

ఎన్టీఆర్‌కు భారతరత్న!

Published at: 29-05-2014 03:36 AM
మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
జాతీయ పార్టీగా తెలుగుదేశం
భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
రాజకీయ, విదేశాంగ తీర్మానాలకు ఆమోదం
హైదరాబాద్, మే 28 : చరిత్ర ఉన్నంత వరకూ తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా గుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయనకుభారత రత్న ప్రకటించాలని మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మహానాడు సందర్భంగా మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఇందులో టీడీపీని జాతీయ పార్టీగా ఆమోదిస్తూ రాజకీయ తీర్మానం కూడా చేశారు.
జాతీయ పార్టీగా తెలుగుదేశం
టీడీపీ ఇక జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనుంది. రాష్ట్ర స్థాయి సమస్యలతోపాటు జాతీయ సమస్యలపైనా పోరాటం చేయనుంది. ఇందులో భాగంగా, పార్టీని జాతీయ స్థాయికి తీసుకు పోవాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు మహానాడు ముగింపు సందర్భంగా టీడీపీని జాతీయ పార్టీగా ఆమోదిస్తూ బుధవారం తీర్మానం చేశారు. దీనిని పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావమే జాతీయ సమగ్రత, పేదల సంక్షేమం అన్న ప్రధాన లక్ష్యాలతో జరిగిందని, మొదట్నుంచీ జాతీయ భావాలున్న ప్రాంతీయ పార్టీ టీడీపీ అని వివరించారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో పార్టీని నడిపి, దేశం పట్ల మరింత బాధ్యతాయుతంగా పార్టీని తీర్చిదిద్దుతామని చెప్పారు. జాతీయ భావాలున్న కారణంగానే అంతర్జాతీయ విధానాలు, విదేశాంగ విధానంలో ముందు నుంచి స్పష్టమైన అవగాహనతో పని చేస్తోందని తెలిపారు. జాతీయ పార్టీకి ఉండాల్సిన అన్ని రకాల సాధన సంపత్తి, బలం, బలగం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పారు. జాతీయ పార్టీగా గుర్తింపునకు కావాల్సిన ఓట్ల శాతాన్ని సాధించగల సామర్థ్యం టీడీపీకి ఉందన్నారు.
విదేశాంగ విధానం.. తెలుగుదేశం పాత్ర!
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ స్పష్టం చేసింది. దేశ సంక్షేమంతోపాటు రాష్ట్ర సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు మహానాడు 'విదేశాంగ విధానం - తెలుగుదేశం పాత్ర' అనే తీర్మానాన్ని ఆమోదించింది.
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు!
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరు పెట్టిస్తామని మహానాడు వేదికగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలోనే శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసిందని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు మార్పిస్తామని స్పష్టం చేశారు. వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు అంతకు ముందు మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేలా కేంద్ర మంత్రిగా నియమితులైన అశోక్ గజపతి రాజు చొరవ తీసుకోవాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు. ఆయన వినతికి ప్రతిస్పందనగా తప్పకుండా కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత శంషాబాద్ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్రం పరిధిలోకి వస్తున్న సంగతి తెలిసిందే. సీమాంధ్రలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం పేరును మార్పిస్తామని అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరంపై ఆర్డినెన్స్

పోలవరంపై ఆర్డినెన్స్

Published at: 29-05-2014 03:20 AM
మంగళవారమే మోదీ కేబినెట్ ఆమోదం.. మరుసటి రోజు రాష్ట్రపతి సంతకం
ఆ 7 మండలాలూ సీమాంధ్రకే
కొన్ని గ్రామాలకు మినహాయింపు
భద్రాచలం పట్టణం తెలంగాణలోనే
ఆర్డినెన్స్‌పై బాబుకు గుర్తు చేసిన జైరాం
వెంటనే రంగంలోకి అశోక్ గజపతి
ప్రణబ్ వద్దకు వెళ్లిన వెంకయ్య
న్యూఢిల్లీ, మే 28 : పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు ముంపు ప్రభావిత మండలాలను... సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ వెలువడింది. యూపీఏ ప్రభుత్వపు 'చివరి' రోజుల్లో నిలిచిపోయిన ఆర్డినెన్స్... ప్రధానిగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన మూడో రోజునే జారీ అయ్యింది. ఏడు మండలాల్లోని కొన్ని రెవెన్యూ గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 3కు సవరణ చేశారు. నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం ఏడు మండలాలను సీమాంధ్రలో కలపాలని విభజన సమయంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ దీనిపై హామీ ఇచ్చారు. అయితే... మరికొన్ని రోజుల్లో దిగిపోతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం తగదంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఆర్డినెన్స్‌పై ఆమోద ముద్ర వేసేందుకు నిరాకరించారు. జూన్ 2న రాష్ట్ర విభజన అమలులోకి వస్తున్న నేపథ్యంలో... నరేంద్ర మోదీ సర్కార్ దీనిపై సత్వరం నిర్ణయం తీసుకుంది.
నిజానికి... ఈ విషయంపై మాజీ మంత్రి జైరాం రమేశ్ ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం చంద్రబాబును అప్రమత్తం చేసినట్లు తెలిసింది. పోలవరంపై జూన్ 2లోపు ఆర్డినెన్స్ జారీ చేయకపోతే రాష్ట్ర విభజన తర్వాత సమస్యలు ఏర్పడతాయని ఇటీవల ఢిల్లీలో చంద్రబాబును కలిసి తెలిపారు. దీనిపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడాల్సిందిగా పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావులను చంద్రబాబు ఆదేశించారు. వారు రాజ్‌నాథ్‌ను కలిసి వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరాన్ని వివరించారు. మరోవైపు సీమాంధ్ర ప్రయోజనాలకోసం రాజ్యసభలో గట్టిగా పట్టుపట్టిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోలవరంపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. రాజ్‌నాథ్‌తో మాట్లాడారు. ఆర్డినెన్స్ జారీకి సమయం సరిపోదంటూ హోంశాఖ అదనపు కార్యదర్శి, తెలంగాణకు కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పేర్కొన్నప్పటికీ... వెంకయ్య తన పట్టు వీడలేదు. చివరకు ఈ ఆర్డినెన్స్‌ను మంగళవారం కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకొచ్చారు. కేబినెట్ సమావేశంలో వెంకయ్యే చొరవ తీసుకుని పోలవరం పూర్వాపరాలను, రాజ్యసభలో జరిగిన చర్చను, మన్మోహన్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. ఆర్డినెన్స్‌పై కేబినెట్ ఆమోదముద్ర పొందారు. దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే... ఈ విషయాలేవీ మీడియాకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం ఉదయం వెంకయ్యనాయుడు రాష్ట్రపతిని స్వ యంగా కలుసుకుని... ఆర్డినెన్స్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనా లు ముడిపడి ఉన్నాయని, దానిపై సంతకం చేయాలని అభ్యర్థించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. ఈ పరిణామాలను రాజీవ్ శర్మ ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు తెలియజేసినట్లు సమాచారం.
సీమాంధ్రలో కలిసే మండలాలివే..
పోలవరంపై ఆర్డినెన్స్ ద్వారా... కొన్ని గ్రామాలు మినహా కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, భద్రాచలం మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేస్తారు. భద్రాచలం రెవెన్యూ గ్రామం తెలంగాణలోనే ఉంటుంది. అలాగే... భద్రాచలానికి దారితీసే జాతీయ రహదారి-221 మార్గంలో ఉన్న బూర్గంపాడు మండలంలోని పినపాక, మొరంపల్లిబంజరు, బూర్గపాడు, నగినేనిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సరపాక, ఇరివెండి, మొతెపట్టినగర్, నక్రిపేట, సోంపల్లి గ్రామాలు కూడా తెలంగాణలోనే ఉంటాయి. తొలు త రాష్ట్ర ప్రభుత్వ జీవో 111లో గుర్తించిన దాదాపు 130 ముంపు గ్రామాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలనుకున్నారు. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ముంపు గ్రామాలున్న మండలాలను కూడా చేర్చాలని నిర్ణయించారు.
ఆర్డినెన్స్ ఘనత మాదే
అప్పుడు కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు: జైరాం
పోలవరంపై ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ... ఆ ఘనత మాత్రం యూపీయే ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర మాజీ మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాంరమేశ్ 'ఆంధ్రజ్యోతి'తో అన్నారు. ఆర్డినెన్స్ జారీ చేయాలని గత కేబినెట్ నిర్ణయం తీసుకుందని... అయితే దాన్ని కొత్త ప్రభుత్వానికే వదిలేయాలన్న రాష్ట్రపతి సూచన మేరకు పెండింగ్‌లో ఉందన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ ఇచ్చిన హామీ మేరకే ఈ ఆర్డినెన్స్ జారీ అయిందన్నారు. అప్పట్లో కేసీఆర్ దీనిపై ఏమీ మాట్లాడలేదని కూడా గుర్తు చేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తయ్యాకే ప్రాజెక్టును చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 50వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని చెప్పారు. కేంద్రం సహాయ పునరావాస ప్యాకేజీని సమర్థవంతంగా పూర్తి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో విలీనం కానున్న మండలాల వివరాలు(గణాంకాలు సుమారుగా)
వ.నెం. మండలం......... గ్రామాలు.......... గ్రామ పంచాయితీలు........... జనాభా............... విస్తీర్ణం (చ.కిమీ)
1. భద్రాచలం(పట్టణం మినహా) 117.... 21........... 35,000........... 350
2. కూనవరం 65 16 24,597 204
3. చింతూరు 108 15 36,763 955
4. వరరామచంద్రపురం 73 12 23,411 475
5. వేలూర్‌పాడు 65 10 21,474 415
6. కుక్కనూరు 59 12 25,759 271
7. బూర్గంపాడు 37 09 40,000 250
(12 గ్రామాలు మినహా)
మొత్తం 7 మండలాలు 524 95 2,07,004 2920

సంకేతాల కన్నా ఫలితాలు ప్రధానం

సంకేతాల కన్నా ఫలితాలు ప్రధానం(ఇండియా గేట్)- ఎ. కృష్ణారావు

Published at: 28-05-2014 00:44 AM


మోదీ పంపించిన సంకేతాలు, వాటి ద్వారా ఏర్పర్చిన సదభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. కానీ ఈ సంకేతాలు ఫలితాలుగా మారడంపైనే, సదభిప్రాయాలు నిలుపుకోవడంపైనే మోదీ విజయం ఆధారపడి ఉన్నది.... ప్రజాభిప్రాయాలకు, పౌర సమాజానికి విలువ ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన సార్థకత. తనకు ప్రస్తుతం ఉన్న సానుకూల పవనాలను స్థిరంగా మార్చుకోవడం మోదీ చేతిలోనే ఉన్న పని.
యూపీఏ హయాంలో మంత్రివర్గంలో మార్పులు జరుగుతున్నాయంటే చాలా పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగేది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టిలో పడితే చాలు మంత్రిపదవులు దక్కే అవకాశాలు ఎక్కువయ్యేవి. వీరు కాక సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా మంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించేవారు. ఆయన కటాక్ష వీక్షణాల కోసం ఆరాటపడేవారు. అందుకు ఆయన చుట్టూ తిరిగేవారు. అహ్మద్‌పటేల్ కటాక్షం కోల్పోయారంటే మంత్రిపదవి కోల్పోయినట్లే లెక్క. పార్టీ నిధుల చెల్లింపుల్లోనో, వ్యక్తిగత చెల్లింపుల్లోనో ఎక్కడో ఒక చోట తేడా వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ పాత్ర మంత్రుల ఎంపికలో దాదాపు లేదనే చెప్పాలి. అసలు ఏ మంత్రిని మన్మోహన్ సింగ్ స్వయంగా నియమించారో చెప్పడం కష్టం. అదే పి.వి. నరసింహారావు మన్మోహన్ సింగ్‌ను మంత్రిగా నియమించే ముందు చాలా పేర్లను పరిశీలించి చివరకు స్వతంత్ర నిర్ణయం తీసుకున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులతో మన్మోహన్ సింగ్ సంబంధాల ఆధారంగా ఆయనను ఆర్థిక మంత్రిగా నియమించారు.
ఆయన శిష్యుడైన మన్మోహన్ సింగ్ మాత్రం గురువును ఏమాత్రం అనుసరించలేదు. పదవిలో ఉన్నంతకాలం స్వతంత్రత అన్న పదానికి అర్థం తెలియనట్లే మన్మోహన్ దాదాపు వ్యవహరించారు. విచిత్రమేమంటే మంత్రుల ఎంపికలో చాలామంది లాబీయిస్టులు కీలక పాత్ర పోషించేవారు. ప్రముఖ లాబీయిస్టు నీరారాడియాకూ సీనియర్ జర్నలిస్టులు కొందరికీ జరిగిన సంభాషణల్లో ఎవరెవరిని మంత్రిపదవుల్లో నియమించాలో, ఏఏ విధాన నిర్ణయాలు తీసుకోవాలో అన్న అంశాలపై చర్చలు జరిగేవి. టి.ఆర్. బాలూ, దయానిధి మారన్, కనిమొళి తదితరుల కోసం లాబీయింగ్ జరిగినట్లు ఆ సంభాషణల్లో తేలింది. చాలా అలవోకగా జరిగే సంభాషణల్లో ఏఏ కాంగ్రెస్ నేతలకు ఏఏ సందేశం చేర్చాలో, ఏఏ పార్టీ విందుల్లో ఎవరెవర్ని ముగ్గులోకి లాగాలో అన్న అంశాలు ప్రస్తావనకు వచ్చేవి. పారిశ్రామికవేత్తల అభీష్టాల ప్రకారం మంత్రుల నియామకాలు, ఉద్వాసనలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఆ అవసరం లేదు. సాధారణ మధ్యతరగతి ప్రపంచమే కాదు, మొత్తం పారిశ్రామిక ప్రపంచం మోదీ నియామకం తర్వాత ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుదుపు వస్తుందని ఆశిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు 20వేల కోట్ల మేరకు వివిధ ప్రాజెక్టులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ధరలు తగ్గించేందుకు, ఉపాధి కల్పనను పెంచేందుకు మోదీ ఏ చర్యలు తీసుకుంటారా అని అనేకమంది ఎదురు చూస్తున్నారు. తాను ప్రభుత్వంకన్నా పాలనపైనే దృష్టి కేంద్రీకరిస్తానని మోదీ స్పష్టం చేశారు. పనులు వేగవంతంగా జరిగేందుకు మంత్రిత్వ శాఖలను విలీనం చేశారు. నిజానికి మోదీ మంత్రివర్గంలో ఎవరెవరు మంత్రులుంటారన్న విషయంలో చాలా మంది పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. మోదీ ఏర్పాటు చేసిన మంత్రివర్గంపై కొంతమేరకు రణగొణ ధ్వనులు వినిపించినప్పటికీ జనానికి ఈ విషయంలో ఆసక్తి లేదని, మోదీ పాలన ఎలా ఉంటుందా అన్న విషయంపైనే అందరి దృష్టి నిమగ్నం కావడంతో వాటికి ఎవరూ ప్రచార రూపం కూడా కల్పించలేదు. ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, శాంతా కుమార్, సుమిత్రా మహాజన్ లాంటి వారిని ఎందుకు ప్రక్కనపెట్టారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం కావడం లేదు. 75 సంవత్సరాలు దాటిన వారిని మంత్రివర్గంలో నియమించకూడదని మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదేనని హర్షం వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. మన్మోహన్ సింగ్ సర్కార్‌కూ మోదీ సర్కార్‌కూ తేడా ఎంతో ఉన్నది. అప్పుడు ప్రధానమంత్రికి అస్తిత్వం లేదు. ఇక్కడ ప్రధానమంత్రికే ప్రధాన అస్తిత్వం. మన్మోహన్ సింగ్ సర్కార్ ఎదుర్కొన్నట్లుగా ఇక్కడ సంకీర్ణ రాజకీయాల ఒత్తిడి అసలు లేనే లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎన్డీఏ సర్కార్ లేదా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న సర్కార్. అయినప్పటికీ అది మోదీ సర్కార్‌గానే ఎక్కువ గుర్తింపు పొందింది.
మోదీ తన కేబినెట్‌లో సమర్థులైన వారిని మంత్రివర్గంలో నియమించుకున్నప్పటికీ వారు తీసుకునే నిర్ణయాల ఘనత కూడా మోదీకే దక్కుతుంది. మోదీని మెప్పించడం, తమ సమర్థత ప్రదర్శించడంపైనే వారికి బాధ్యతలు అప్పగించడం ఆధారపడి ఉన్నది. ఇక ఐఐటి, ఐఐఎం, యూజీసీ, ఎన్‌సీఆర్‌టీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వంటి ఉన్నత విద్యాసంస్థలతో వ్యవహరించే, దేశ విద్యావిధానం రూపురేఖలు మార్చగల ప్రతిష్టాత్మకమైన మానవవనరుల శాఖను నిన్నటివరకూ టీవీ సీరియల్స్‌లో నటించి, పెద్దగా చదువుకోని స్మృతి ఇరానీ వంటి నేతకు అప్పగించినప్పటికీ ఎవరూ పట్టించుకోని స్థితి. నిర్ణయాలు తీసుకునేది ప్రధానమంత్రి మోదీ కనుక ఆయన ఎవరితోనైనా పనిచేయించగలరనే ఒక అభిప్రాయం నెలకొనడం ఇందుకు కారణం. అయినా ఓటు వేసిన వారి వేలుపై సిరా గుర్తు ఆరనే లేదు. అఖండ మెజారిటీ సాధించిన మోదీని ఇప్పుడెవరైనా ప్రశ్నించే సాహ సం ఎలా చేయగలరు? రెండు సీట్లు సాధించిన మిత్రపక్షానికీ, 16 సీట్లు సాధించిన మిత్రపక్షానికీ ఒకేస్థాయిలో కేబినెట్‌లో స్థానం కల్పించవచ్చు. అడిగే నిర్మొహమాటం ఎవరికి ఉన్నది? ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సీట్ల ఆధారంగానూ మంత్రివర్గ కేటాయింపులు జరగలేదు. బీజేపీని మొత్తం ఒకే ఒక పార్టీగా గుర్తించారు కానీ రాష్ట్రాల వారీగా ఆ పార్టీకి కేబినెట్ శాఖలు కేటాయించాలని మోదీ అనుకోనే లేదు. లోక్‌సభ అభ్యర్థులకే ప్రాధాన్యతనీయాలనీ ఆయన భావించలేదు. సమర్థత, విధేయత ఆధారంగా ఆయన రాజ్యసభ సభ్యులకూ ముఖ్యమైన శాఖలు కేటాయించారు. ఇందుకు మోదీ తర్కం మోదీకి ఉన్నది. అయినా ఆయన పదవులు, రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తున్నానని, అభివృద్ది, పేదరిక నిర్మూలనం, మహిళలకు ప్రాధాన్యతపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాన ని చెప్పిన తర్వాత ఎవరైనా ఇతర ఆలోచనలనన్నిటినీ మౌనంగా అణిచిపెట్టుకోవాల్సిందే. మోదీ ఆలోచనా విధానానికే ప్రాధాన్యత నీయాలి.
ఎవరేమన్నా సరే.. ఇప్పుడు మోదీ ఏం చేసినా హర్షిస్తున్నారు. వాటికి కొత్త తాత్విక దృక్పథాలు కల్పిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ వారణాసికి వెళ్లి విభూతి దాల్చి గంగా హారతిలో పాల్గొనడం చూసి పులకరించిన వారెందరో ఉన్నారు. మోదీ తల్లి ఆటోలో వెళ్లి ఓటు వేసినందుకు ఎంత సామాన్య కుటుంబం ఆయనది.. అని చర్చించిన వారెందరో ఉన్నారు. ఆ తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మోదీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని సంతోషించిన వారు చాలామంది ఉన్నారు. మోదీ తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతూ మెట్ల వద్ద ఆగి మెట్లకు నమస్కరించి లోపలికి అడుగుపెట్టడాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో అపూర్వ దృశ్యంగా అభివర్ణించిన వారు అనేకులు. చాయ్‌వాలా ప్రధాని అయ్యారని సంతోషించేవారు ఒకరైతే, చీపురుతో హెగ్డేవార్ భవన్ నేలను తుడిచారని చెప్పుకుంటూ ఆ ఫోటోలను ఒకరికి మరొకరు పంపించుకునేవారు ఎంతోమంది. మోదీ గురించి చెప్పుకోవడమే, ఆయన గురించిన సమాచారాన్ని పంచుకోవడమే ఇప్పుడు నలుగురి మధ్య సంభాషణల్లో ప్రధానాంశమైంది. దృశ్యమాధ్యమాలు ఈచర్చను మరింత పురికొల్పాయి.
సంకేతాల ద్వారానే మోదీ తన సందేశాలను పంపిస్తున్నారన్న విషయం ఈ పరిణామాలతో స్పష్టం అవుతున్నది. ప్రధానమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారు. ఇప్పటివరకూ ఇలా ఏ నేతా నిర్ణయం తీసుకోకపోవడంతో విదేశాంగ శాఖ అధికారులకు ఏమి చేయాలో తోచలేదు. దీనితో నరేంద్రమోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా విదేశాంగ శాఖకు ఆదేశాలను పంపించాల్సి వచ్చింది. భారత దేశంలో బలమైన ప్రజా మద్దతుతో తాను అధికారంలోకి వచ్చానని చెప్పడం కోసమే మోదీ వారిని ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్య పాలన అంతగా లేని సార్క్ దేశాల అధినేతలకు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ఇది ఉపకరించింది. అంతేకాక సార్క్ దేశాధినేతలతో, ముఖ్యంగా పాకిస్థాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకునేందుకు సిద్దంగా ఉన్నానని, తన సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన పాక్ వ్యతిరేక వైఖరి ఏర్పర్చుకోవాలనుకోవడం లేదని కూడా మోదీ సంకేతాలు పంపించారు. తమిళ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించడం ద్వారా విదేశాంగ విధానం విషయంలో ఒత్తిళ్లకు లొంగబోనని స్పష్టీకరించారు. మరో వైపు మోదీ పార్లమెంట్ మెట్లకు ప్రణామం చేయడం కూడా ప్రజాస్వామ్య మందిరంగా పార్లమెంట్ స్థాయిని పెంచేందుకు దోహదం చేసిందని విశ్లేషించేవారు ఉన్నారు. ఇక తొలి కేబినెట్ సమావేశంలోనే నల్లధనంపై ఉన్నతస్థాయి సంఘం ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఆయన తన ప్రాధాన్యతల గురించి సంకేతాలు అందజేశారు.
మోదీ పంపించిన సంకేతాలు, వాటి ద్వారా ఏర్పర్చిన సదభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. కానీ ఈ సంకేతాలు ఫలితాలుగా మారడంపైనే, సదభిప్రాయాలు నిలుపుకోవడంపైనే మోదీ విజయం ఆధారపడి ఉన్నది. పాక్‌తో సర్కార్ శాశ్వత స్నేహం కోరుకుంటుందా లేక పాకిస్థాన్‌తో వైషమ్యాలను భారతీయ ప్రజల మనోభావాలను పురికొల్పేందుకు, తన రాజకీయ ప్రయోజనాలకు కాపాడుకునేందుకు ఉపయోగించుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఉపఖండంలో శాంతి నెలకొంటే కానీ దేశంలో పరిపాలనపై దృష్టి కేంద్రీకరించలేమన్న విషయం మోదీకి తెలియనిది కాదు. ఇక పార్లమెంట్ ప్రమాణాలు పెరగడం అనేది అందులో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై చర్చించడం, వాటికి సమర్థవంతమైన పరిష్కార మార్గాలను సూచించడంపై ఆధారపడి ఉన్నది. మెజారిటీ ఉన్నందువల్ల మోదీకి పార్లమెంట్‌ను ప్రజాస్వామ్యానికి నిజమైన వేదికగా మార్చడం పెద్ద కష్టం కాదు. అంతేకాదు పార్లమెంట్ వెలుపల ఉన్న ప్రజాభిప్రాయాలకు, పౌర సమాజానికి విలువ ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన సార్థకత. తనకు ప్రస్తుతం ఉన్న సానుకూల పవనాలను స్థిరంగా మార్చుకోవడం మోదీ చేతిలోనే ఉన్న పని.
- ఎ. కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Tuesday 27 May 2014

Rayalseema looks back in regret

Rayalseema looks back in regret
Remembering the region’s lost opportunities
The Statesman19 Sep 2013


Stanley Theodore
stanley_theodore@yahoo.com

Hyderabad, 18 September
Rayalaseema is ruing its history, circumstances and fate even as the region fears its future when the state is bifurcated.

The region comprising four districts in south Andhra Pradesh is heavily drought prone. Due to this the British in 1937 had conceived the 300 thousand million cubic feet (TMC) Krishna-Pennar Project on River Krishna through which the region would get 170 TMC and Tamil Nadu, Madras city, would get 130 TMC. Then Rayalaseema was part of the Madras Presidency.
But Rayalaseema lost the project when the basics of Andhra state were being worked out. “Had this project gone ahead we would have been better off than the rice bowl districts of east and west Godavari, Krishna and Guntur,” state Twenty Point Programme chairman Tulasi Reddy told The Statesman.

The region saw it as a boon when the state’s first capital was based in Kurnool. Very quickly this changed with leaders finding the "twin cities" a far better option as it already had the necessary infrastructure for a capital, thanks to the Nizam operating from here.
“Now looking at the development of Hyderabad it is certain that Kurnool would have witnessed at least 50 per cent of this development had we not given up our claims over the capital. The other three districts would have benefited as well,” AP Road Transport Corporation Employees union president, Mr C Chandrashekar Reddy, said.
What hurt them equally was losing Bellary to Karnataka when the state was reorganised in the 1950s. “We lost Thungabhadra Dam, which would have compensated us to a large extent for the loss of the Krishna-Pennar project,” Mr Reddy said.
The loss of Bellary also meant that Rayalaseema lost the district which has 25 per cent of the nation’s iron ore deposits. The mining scam by the Reddy brothers threw open to the world the mineral wealth in the region.
“No matter which way you look at it, we have lost. And to make things worse successive governments neglected this region. Even the Justice Srikrishna Committee report has made it clear that we are more backward than Telangana. And now with the bifurcation we are being asked to leave Hyderabad,” Mr Tulasi Reddy said.

పోలవరం ముంపు ప్రాంతాల్ని ఏపీలో కలపడం సరికాదు : కేసీఆర్

పోలవరం ముంపు ప్రాంతాల్ని ఏపీలో కలపడం సరికాదు : కేసీఆర్

Published at: 27-05-2014 16:16 PM
న్యూ ఢిల్లీ, మే 27 : తెలంగాణ బిల్లుకు (గతంలో పాసైన బిల్లు) విరుద్ధంగా ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు తనకు తెలిసిందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించి హోంశాఖలో ఆర్డినెన్స్ తయారు చేస్తున్నట్లు కూడా తనకు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు. దీనిపై ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులకు ఫోన్ చేసి ఇలా చేయడం సరికాదని తెలిపినట్లు కేసీఆర్ చెప్పారు.
మంగళవారం ఢిల్లీలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని మోదీ మొట్టమొదటి కేబినెట్‌లో తీసుకోవడం దారుణమని, ఇది మంచిదికాదని అన్నారు. చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఇప్పుడు అపాయింటెడ్ డే ఒక్కటే ఉందని అదికూడా జూన్ 2న ప్రకటన జరగనుందని, చట్టాన్ని మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం జరగాలని, ఆర్డినెన్స్ ద్వారా చేసే చట్టం కాదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి తన మాటను మన్నిస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బిల్లులో పొందుపరిచిన అంశాలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని కేంద్రం యత్నిస్తోందని, పొలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపొద్దని కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలంటే రెండు రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పొలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకంకాదని, ముంపు ప్రాంతాలు తగ్గించేలా డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ముంపును తగ్గించండి... నీళ్లను తీసుకువెళ్లండని ఆయన అన్నారు.
దేశంలో 11 భూకంప ప్రమాదాల్లో పొలవరం రెండోదని కేసీఆర్ తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దూకుడుగా వెళ్లి ఆర్డినెన్స్ తెస్తే ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వార్‌రూమ్‌కు వస్తే స్వాగతిస్తామని కేసీఆర్ అన్నారు.

Monday 26 May 2014

Byreddy among 3 booked for murder

Byreddy among 3 booked for murder
TNN | Mar 17, 2014, 02.11 AM IST

KURNOOL: Kurnool rural police on Sunday registered a case against three persons, including Rayalaseema leader Byreddy Rajasekhar Reddy, in connection with the murder of Nandikotkur market yard vice-chairman Sai Eswar.

Sai Eswar, 50, was waylaid and murdered by unidentified people in Kurnool on Saturday evening. He was walking in Revenue Colony when the assailants, who came in an autorickshaw, pounced on him with deadly weapons and hacked him to death. Besides Rajasekhar Reddy, the police also named Seshasena Reddy and Siddharth Reddy as accused. The motive behind the murder is not known. Sai Eswar was involved in some police cases. The police had opened a rowdy sheet against Eswar.

25 జిల్లాలతో నవ్యాంధ్ర!

25 జిల్లాలతో నవ్యాంధ్ర!

Published at: 26-05-2014 04:25 AM
ప్రతి లోక్‌సభ నియోజకవర్గం.. ఓ జిల్లా
పార్టీ ఎంపీలతో బాబు టాస్క్
టీడీపీపీ భేటీకి ఎస్పీవై రెడ్డి హాజరు..
న్యూఢిల్లీ, మే 25 : కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 25కు పెంచేందుకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. దీనికోసం సీమాంధ్రలో గల 25 పార్లమెంటు స్థానాలను.. 25 జిల్లాలుగా మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఏపీ భవన్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశంపై ఎంపీలందరి అభి ప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొత్త రాష్ట్రానికి, కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు సాధించేందుకు, రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ఎంపీలను ఆయన కార్యోన్ముఖుల్ని చేశారు. పార్టీకి చెందిన 22 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను నాలుగైదు బృందాలుగా ఏర్పాటు చేస్తానని, వీరికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గాను ఒక్కో అధికారుల టీమ్‌ను జత చేస్తానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖల వారీగా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి కావల్సిన నిధులను రాబట్టాల్సి ఉంటుందని, సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రతి వారం తాను బృంద ప్రగతిని సమీక్షిస్తానని వెల్లడించారు. వారంలో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోను, రెండు రోజులు హైదరాబాద్‌లోను, మిగతా రెండు రోజులు ఢిల్లీలోనూ ఉంటానని ఆయన ఎంపీలకు చెప్పారు. అంతా ఐకమత్యంగా పని చేసి కొత్త రాష్ట్రానికి వీలైనన్ని నిధులు రాబట్టుకోవాలని హితవు పలికారు. ఆదివారం రాత్రి ఏపీ భవన్‌లోని గురజాడ హాలులో చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీపీ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. ఆదివారమే పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రస్తుతానికి ఒక్క కేబినెట్ పదవిని మాత్రమే టీడీపీకి ఇచ్చినందున దానిని అశోక్ గజపతిరాజుకు కేటాయిస్తున్నట్లు అధినేత చెప్పారన్నారు. రాబోయే కాలంలో మరిన్ని పదవులు వచ్చే అవ కాశముందని, అప్పుడు మళ్లీ ఎంపీలందరినీ సంప్రదించి వాటిని ఎవరికి కేటాయించాలో నిర్ణయిస్తానని తెలిపారన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని పార్టీని గెలిపించారని, కాబట్టి వారి ఆశలకు సరిసమానమైన రీతిలో అంతా కష్టపడి పని చేయాలని ఆదేశించారని చెప్పారు.
ప్రజల సంతృప్త స్థాయి 80 శాతం ఉండేలా ఎంపీలు పనిచేయాలని కోరారన్నారు. ఏఏ పథకాలకు ఏఏ రకంగా నిధులు తీసుకురావాలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు సాధించాలని సూచించారని చెప్పారు. తాను కూడా ప్రతి వారం ఎంపీల పనితీరును సమీక్షిస్తానని వెల్లడించారన్నారు. టీడీపీపీ నాయకుడి ఎంపిక గురించి చర్చించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో తమలో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ ఎంపీలుగా మాత్రం తొలిసారి ఎన్నికయ్యామని, ఈ నేపథ్యంలో తమకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఐటీ, ఫార్మా తదితర రంగాలకు చెందిన పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయని, వీటిని కూడా సీమాంధ్రకు తీసుకొచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కింది వచ్చిన పన్ను రాయితీలను ప్రచారం చేసి వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు అ క్కడ ఏర్పడేలా చేయాలని చెప్పారన్నారు. 'బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలని పేర్కొన్నారని, దీనిపై మీరేమంటా'రని చంద్రబాబు తమను అడిగారని చెప్పారు. ఎక్కువ జిల్లాలు ఉంటే ఎక్కువ యంత్రాంగం ఉంటుందని, అభివృద్ధిపై దృష్టి కూడా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఈ ప్రతిపాదన మంచిదని ఎంపీలంతా చెప్పామన్నారు. ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్‌గా సతీశ్ చంద్రను నియమించినట్లు చంద్రబాబు చెప్పారన్నారు.
టీడీపీ విజయం తెలుగు జాతికి అంకితం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఈ నెల 27,28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ పార్టీ నేత టీడీ జనార్దన్ చెప్పారు. ' పేదరికం లేని సమాజం, అన్నగారి కల, బాబు ఆశయం ' నినాదంతో ఈ మహానాడును నిర్వహిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పొందిన విజయాన్ని మహానాడులో తెలుగుజాతికి, కార్యకర్తలకు అంకితమిస్తామని తెలిపారు. అవినీతి రహిత భారతదేశ నిర్మాణం, పేదరికం లేని సమాజం, సంస్థాగత విషయాలు, విదేశాంగ విధానం తదితర అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతామని చెప్పారు. టీడీపీని జాతీయ పార్టీగా మార్చడం.. రెండు ప్రాంతాలకు ప్రత్యేక కమిటీలు వేయడంపై చర్చిస్తామని చెప్పారు. మహానాడుకు దాదాపు 25 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు. మహానాడుకు కార్లు, బస్సులు, వ్యాన్లలో వచ్చే వారికే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లల్లో వచ్చే వారికి రవాణా, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతినిధులందరికీ ఒత్తిడి లేకుండా భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీడీపీ కార్యక్రమాలు, ముఖ్యంగా పాదయాత్ర ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహానాడు సందర్భంగా ఆరుగురు సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తామన్నారు.