Saturday 31 October 2015

ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్నారు...

ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకున్నారు...
Updated :31-10-2015 08:06:28
ఏలూరుక్రైం : ప్రత్యేకహోదా కోసం తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్‌ (50)కు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణికి వివాహం కాగా రెండవ కుమార్తె నిఖిల (22) డిఎడ్‌ చేసింది. ప్రస్తుతం దుర్గాప్రసాద్‌ ఉంగుటూరు మండలం కైకరంలోని 16వ నెంబరు జాతీయరహదారి పక్కన ఒక హోటల్‌ను నడుపుతూ జీవిస్తున్నాడు. తన చిన్నకుమార్తె నిఖిల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇంటి వద్ద ఉంటూ అక్కడ చదివింది. అనంతరం తాడేపల్లిగూడెంలో ఇంటర్మీడియట్‌ డీఎడ్‌ పూర్తి చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీకి దరఖాస్తు చేసుకోగా నిరాకరించారు. దీంతో కోర్టు ద్వారా ఆమె డీఎస్సీకి దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. కాని ఫలితాలు మాత్రం విత్‌హెల్డ్‌లో ఉంచారు. రాష్ట్ర విభజన వల్ల తన కుమార్తెలాంటివారు ఎంతోమంది నష్టపోయారని, రాష్ర్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ సూసైడ్‌ నోట్‌ను రాసి ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ వేకువజామున ఇంటిలోనే తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలకు గురైన అతనిని తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరు, విజయవడ, హైదరాబాద్‌లోని ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించారు. చివరకు ఈ నెల 27వ తేదీ వేకువజామున తిరిగి హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం దుర్గాప్రసాద్‌ మృతి చెందాడు. బాధితుడికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు కె.రఘువీరారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు పుప్పాల వాసుబాబు తదితరులు రూ.25 వేల చొప్పున మొత్తం లక్ష రూపాయలను ఆర్థ్ధికసహాయాన్ని బాధితుడు దుర్గాప్రసాద్‌కు వైద్యపరీక్షలు నిమిత్తం అందజేశారు. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించలేదంటూ, అత్త మల్లారెడ్డి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ వివిధాసుపత్రులలో వైద్యం కోసం 5 లక్షలకు పైగా ఖర్చు అయ్యిందని, అనేక అప్పులు చేశామంటూ తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే అప్పుల్లో ఉన్న తాము కూడా బ్రతకలేమంటూ బోరున విలపించారు. ఈ సంఘటనపై చేబ్రోలు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. సమాచారం అందుకున్న వైసీపీ నాయకులు పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, పటగర్ల రామ్మోహనరావు, గుడిదేశి శ్రీను, డాక్టర్‌ దిరిశాల ప్రసాద్‌, మున్నుల జాన్‌గురునాధ్‌, పుప్పాల వాసుబాబు, తదితరులు ఆసుపత్రికి చేరుకుని దుర్గాప్రసాద్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేకహోదా కోసం ఆసుపత్రి వద్దే నినాదాలు చేశారు.

Friday 30 October 2015

India beef film removed from festival

India beef film removed from festival

  • 30 October 2015
  •  
  • From the sectionIndia

n this Friday, Oct. 9, 2015 photo, a woman leads her cow across a road collecting alms from devout Hindus in Mumbai, India.IImage copyrightAP
Image captionOne of the film makers said he was "shocked and upset" the film had been withdrawn

A documentary on beef eating habits in India has been withdrawn from a Delhi film festival for "technical" reasons, its organisers have said.
The film, Caste on the Menu Card, was the only film among the 35 sent to India's information and broadcasting ministry to be refused clearance.
Festival director Manoj Mathews told BBC Hindi he was "disturbed and disappointed" by the decision.
Ministry officials said they were "not provided with adequate information".
Mr Mathews said: "There were documentaries showcased on this platform which dealt with more controversial issues than this and we have had no problem."
The documentary was filmed by five students from the Tata Institute of Social Sciences.
"The documentary is about how caste works in the meat industry. How it's a livelihood question for workers of the industry. We are talking about social exclusion, we are talking about caste," Atul Anand, one of the students who made the documentary, told BBC Hindi.
"We are shocked and upset. We made this documentary between August and September 2014, before beef was banned in Maharashtra.
"We took almost three months to make this documentary and it was sparked by a row on our campus in 2014 after some students demanded that beef and pork be banned," Mr Anand said.
Mr Mathews told the Indian Express newspaper that information and broadcasting ministry officials had told him that "due to the current political situation over the beef ban issue they have not give exemption permission for this particular documentary".
However ministry officials told the newspaper that they had not received "adequate information" about the film and were willing to reconsider the decision if they got the required information.
In another incident, reports from the north Indian state of Haryana indicated that an editor of a state government publication was sacked because of an article that said beef was nutritious.

బెజవాడకు బైబై...నూతన రాజధాని అమరావతి చెంతకు ఛలోఛలో

బెజవాడకు బైబై...నూతన రాజధాని అమరావతి చెంతకు ఛలోఛలో 
Updated :31-10-2015 08:38:08
విజయవాడ నుంచి తరలివెళ్ళటానికి
వర్తక, వాణిజ్యవేత్తల నిర్ణయం
500 ఎకరాల కొనుగోలుకు
ప్రభుత్వానికి ప్రతిపాదన
ఆసియాలోనే భారీ వర్తక, 
వాణిజ్య వాడ నిర్మాణంపై దృష్టి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
వర్తక, వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడ.. ఇక అందుకు బైబై చెప్పనున్నది. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తూ ఉన్న నిర్వాహకులు ఇక్కడి నుంచి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాచీన నగరం విజయవాడతో రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వర్తక, వాణిజ్యం తరలిపోనున్నది. నగరం విస్తరించకపోవటం, ఇరుకు రోడ్లు , జనావాస ప్రాంతాలలోనే వ్యాపారాలు నిర్వహించాల్సి రావటంతో రాజధాని ప్రాంతానికి తరలి పోవాలని నిర్ణయించుకున్నారు. ఆసియాలోనే అత్యంత భారీ వర్తక, వాణిజ్య వాడను నందిగామ, కంచికచర్లలో సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని వీరంతా నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవలే వీరంతా సమావేశమై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే విజయవాడ వర్తక, వాణిజ్య వాడగా పేరుగాంచింది. రోమ్‌ దేశంతో వ్యాపార సంబంధాలు ఎక్కువుగా జరిగేవని బకింగ్‌హామ్‌ కాలువలో లభించిన నాణాల ఆధారంగా అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. అలాంటి వర్తక, వాణిజ్యం విజయవాడ నుంచి తరలిపోతే, నగరానికి జరిగే నష్టమేమిటన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. వర్తకులు, వాణిజ్యవేత్తలంతా తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతించాల్సిందే. వారికి ఉన్న ఇబ్బందులు, నగరంలో ఉన్న ట్రాఫిక్‌ రద్దీ, ఇరుకు రోడ్లు వంటివి వర్తక, వాణిజ్యానికి అనువుగా లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని కూడా వర్తక వాణిజ్యం అంతా ఏకతాటిపైకి వచ్చింది. నగరంలో వర్తకులంతా వివిధ ప్రాంతాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో కాళేశ్వరరావు మార్కెట్‌, వన్‌టౌన్‌ మార్కెట్‌, వస్త్రలత, ఐరన్‌ యార్డు, హార్డ్‌వేర్‌, కూరగాయలు, పండ్ల మార్కెట్‌, పప్పుల మార్కెట్‌ ఇలా అనేక వ్యాపారాలన్నీ వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఈ ప్రాంతాలలో రద్దీ కూడా విపరీతంగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి సరుకు తీసుకు వెళ్ళాలన్నా.. తరలించాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైన విషయమే. దీంతో రాజధాని ప్రాంతానికి సమీపంలో వీరంతా తరలిపోవాలనుకోవటం కూడా ఒక రకంగా నూతన రాజధానికి శుభపరిణామమే.
వర్తక, వాణిజ్య ప్రతినిధులంతా కలిసి 500 ఎకరాల కోసం ప్రతిపాదన చేశారు. ఈ 500 ఎకరాలను పూర్తిగా తమ సొంత డబ్బుతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన భూములలో సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేయటం, రహదారులు, డ్రెయినేజీ, మంచినీటి సదుపాయం, విద్యుత్‌ తదితర సదుపాయాలను కల్పించేందుకు ఆయా శాఖలకు డబ్బులు చెల్లించటానికి కూడా వర్తక, వాణిజ్య ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ద్వారా సంప్రదింపులు 
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కొద్ది కాలం కిందట వర్తక, వాణిజ్యవేత్తల ప్రతినిధులు కలుసుకుని ఈ ప్రతిపాదన చేశారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. గతంలో గద్దె రామ్మోహన్‌ విజయవాడ ఎంపీగా ఉన్నప్పుడు కొంతమంది హోల్‌సేల్‌ వ్యాపారులు ఇలాంటి ప్రతిపాదన చేస్తే అప్పట్లో సీఎంతో మాట్లాడించి గొల్లపూడిలో హోల్‌సేల్‌ మార్కెట్‌ను నిర్మించటానికి కృషి చేశారు. ఆ తర్వాత వారంతా గొల్లపూడికి వెళ్ళిపోయారు. దీంతో గద్దె రామ్మోహన్‌ను మళ్ళీ మిగిలిన సింహ భాగ వర్తక, వాణిజ్య ప్రతినిధులంతా కలిసి విజ్ఞప్తి చేశారు.
సీఎం సానుకూలత.. వర్తక, వాణిజ్య వేత్తలతో సమావేశం : 
వర్తక, వాణిజ్య ప్రతినిధుల ప్రతిపాదన ను గద్దె రామ్మోహన్‌ గురువారం సీఎం దృష్టికి తీసుకు వెళ్ళారు. ఆయన వెంటనే ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేశారు. భూములు కేటాయింపు నుంచి, వర్తక వాణిజ్యవాడ ఏర్పాటు చేసే వరకు ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని ఐక్యంగా ముందుకు రావటంతో ప్రభుత్వంపై పడే భారం కూడా ఏమీ లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వర్తక, వాణిజ్య ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించటం గమనార్హం.
నందిగామ, కంచికచర్లలో నూతన వర్తక, వాణిజ్య వాడ 
నూతన వర్తక, వాణిజ్యవాడను నందిగామ, కంచికచర్ల ప్రాతంలో ఏర్పాటు చేయటానికి సంఘ ప్రతినిధులు నిర్ణయించారు. వర్తక వాణిజ్యవాడను నూతన రాజధానికి అభిముఖంగా, ముఖద్వార సమీపంలో ఏర్పాటు చేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానది మీదుగా ఐకాన్‌ బ్రిడ్జి నిర్మాణంతో రాజధానికి ముఖద్వారం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులంతా అటువైపు వెళ్ళాలని నిర్ణయించటం గమనార్హం.

దస్విదానియా సినిమా - సౌమ్య

దస్విదానియా
సౌమ్య
భారతీయ సినిమా, సమీక్ష, హిందీ
bucket list, dasvidaniya, IKIRU
10 comments
దస్విదానియా అంటే రష్యన్ భాషలో farewell అని అర్థం. వినయ్ పాథక్ నటిస్తూ నిర్మించిన బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ లో వెరైటీ కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం మరోసారి ఈ సినిమాతో నిరూపితమైంది. కాకపోతే, కథని మరింత సృజనాత్మకంగా, కథనాన్ని కూడా ఇదెక్కడో చూశామే అన్న అనుమానం వచ్చే విధంగా కాకుండా సరిగ్గా చేసిఉంటే, “ఇది మన భారతీయ సినిమా” అని బయట చెప్పుకునేంత గొప్ప అనుభవంగా మిగిలేది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా చూడటం ఓ మంచి అనుభవమే. కానీ, గొప్ప అనుభవం మాత్రం కాదు.

కథ: అమర్ కౌల్ ఓ ఫార్మా కంపెనీలో అకౌంటెంట్. కథ మొదట్లోనే అతనికి stomach cancer అని తెలుస్తుంది. మూణ్ణెల్ల కంటే బతకడని తెలుస్తుంది. అక్కడ్నుంచి ఆ మూడు నెలలలో అతను తన జీవితాన్ని ఎలా గడిపాడు, తను – “జీవితంలో ఎప్పటికైనా..” అనుకుంటూ కలలుగన్న కోరికల్ని ఎలా తీర్చుకున్నాడు? అన్నది ఈ సినిమా కథ. కథా పరంగా చూస్తే ఈ సినిమా హృషికేశ్ ముఖర్జీ “ఆనంద్”, ఇటీవలి “కల్ హోన హో”, మణిరత్నం “గీతాంజలి”, కమల్ హాసన్ సినిమా “నమ్మవర్” – ఇలా చాలా సినిమాల “స్పిరిట్” కి దగ్గరగా ఉంటుంది. వస్తువు పరంగా “మై లైఫ్ విదవుట్ మీ”, “బకెట్ లిస్ట్” అనే ఆంగ్ల సినిమాల లా ఉందని వికీలో చదివాను. నాకు మాత్రం సినిమా చూసేముందు నుంచీ ఇది “ఇకిరు” కి దగ్గరగా ఉంటుందేమో అన్న అనుమానం కలిగింది. (ఇకిరు గురించి నవతరంగం లో రెండు వ్యాసాలు వచ్చాయి – అవి ఇక్కడ మరియు ఇక్కడ) అది మొదటి పది నిముషాల్లోనే అనుమానం కాదు, నిజం అని తేలింది. పాథక్ – “సినిమా చూడని వారు చాలామంది ఇది ఇకిరు వల్ల ప్రభావితమైందని అనుకుంటున్నారు. ఇది చూసాక వీటి మధ్య తేడా ఉందని ఒప్పుకుంటారు” అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడని ఇప్పుడే చూసాను. సినిమా చూసాకే ఖచ్చితంగా ఇది ఇకిరు ప్రభావంలో తీసిన సినిమా అని చెప్పగలుగుతున్నాను. రెంటి మధ్యా తేడా బోలెడు ఉంది. ఏదీ తక్కువ కాదు. రెండూ మంచి సినిమాలే. అయినంత మాత్రాన ఇది ఇకిరు నుండి ప్రభావితమైనది కాకుండా పోదు. నిజం ఒప్పుకోడానికి భయమెందుకో అర్థం కాదు.

సినిమాలో పాత్రధారుల పోషణ అద్భుతం. సందర్భోచితంగా ఉన్న నేపథ్య సంగీతం, చక్కని సంభాషణలు, అంతర్లీనంగా కథలో కలిసిపోయిన హాస్యం – ఈ విధంగా చూస్తే, ఇదొక మంచి సినిమా. వినయ్ పాథక్ నటన చాలా సహజంగా ఉంది. ఈ సినిమాకి స్క్రీన్‍ప్లే ఒక అసెట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే, అలాంటి కథా నేపథ్యం లో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నప్పటికీ ఇది చూసేవారిని ఆకట్టుకోగలిగింది కనుక. జానీ మేరా నామ్ సినిమాలో కిశోర్ కుమార్ పాడిన – “పల్ భర్ కె లియే కొయీ హమే ప్యార్ కరియే” పాటను సినిమాలో రెండు మూడు చోట్ల బాగా వాడుకున్నారు. సినిమాలో అంతరాత్మ అమర్ తో సంభాషించే దృశ్యాల దగ్గర సంభాషణలు నాకు చాలా నచ్చాయి. హాస్యానికి హాస్యమూ ఉంది, సీరియస్ నెస్ కూడా ఉంది వాటిలో. అలాగే, నేహా ధూపియా ఇంట్లో జరిగే దృశ్యమంతా కూడా నాకు బాగా నచ్చింది. చిన్ననాటి స్నేహితుడెవరో ఉన్నట్లుండి తారసపడితే ఎలా ఉంటుందో అదంతా ఆ దృశ్యం చూస్తూ ఉండగా చూసేవాళ్ళు కూడా అనుభవించగలిగారు అంటే, దర్శకుడు విజయవంతమైనట్లే కదా.

మొత్తానికి ఈ సినిమా మాత్రం మిస్ అవదగ్గ సినిమా కాదు. మీరు ఇకిరు చూసినా కుడా, ఇది చూడండి. ఇది కాపీ కాదు. దాన్నుంచి “ప్రేరణ చెందినది”. తేడా ఇన్నాళ్ళకి తెలిసింది నాకు – కాపీకీ, ప్రేరణకీ. ఈ సినిమా ఓ మంచి భారతీయ సినిమా. ఎటొచ్చీ Ignorance is bliss అని ఎందుకంటారో నిన్న నాకు బాగా అర్థమైంది. నన్ను సినిమా చూస్తున్నంతసేపూ “ఇకిరు” నుండి తీసారు ఈ కథ అన్న బాధ తొలుస్తూనే ఉండింది. అసలు ఇకిరు చూడకపోయినా బాగుండేది. ఈ సినిమా గురించి నేనూ గొప్పగా చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేదాన్ని. ఒక సినిమాను చూసి మరో సినిమా తీసినప్పుడు గర్వంగా నేను ఈ సినిమా నుండి ప్రేరణ పొందాను అని చెప్పుకోవచ్చు కదా. ఇదేమీ కాపీ కాదు. కొన్ని దృశ్యాలు అలాగే ఉన్నా కూడా. “మా సినిమాకీ ఇకిరు కి సంబంధం లేదు” అన్న స్టేట్‍మెంట్ ఇవ్వడంలో ఎంత సిగ్గులేనితనం ఉందో రెండు సినిమాలూ చూసిన ఎవరికైనా అర్థమౌతుంది. ఎందుకు మన వాళ్ళు ఇలా చేస్తారు? అంటే, ఎవరూ కనుక్కోలేరేమో అన్న ధీమానా? ఈ యుగంలో అంత ధీమాగా ఎలా ఉండగలరు? మంచి సినిమాలు తీయడం చేతనౌను. తెలిసిన కథని కొత్తగా చూపడం చేతనౌను (ఈ సినిమా చేసిందదే, చాలావరకూ). కానీ, తమ కథకి మూలం ఇదీ అని ఒప్పుకోడానికి మాత్రం సిగ్గు! ఇది మా భారతీయ సినిమా అని నేను ఏ సినిమా గురించి, దీనికీ, ఏ ఫారిన్ సినిమాకీ సంబంధం లేదు అని గర్వంగా చెప్పుకోగలనో…అసలా రోజు వస్తుందో లేదో.

ఇకిరు (1952) సౌమ్య నవతరంగం

ఇకిరు (1952)
సౌమ్య
జపాన్, ప్రపంచ సినిమా, సమీక్ష
సమీక్ష, IKIRU, japanese cinema, KURASOVA, World cinema
6 comments
 ikiru.jpgఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం.

కథావస్తువు గురించి చెప్పాలంటే – వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు. కథ ప్రారంభంలోనే అతనికి క్యాన్సరనీ, ఎక్కువకాలం బ్రతకడనీ తెలుస్తుంది. ఇక తక్కిన కథ అంతా, ఆ ఆరునెలలూ అతనేమి చేసాడు, చివరికి జరిగింది ఏమిటి? అన్నది. ఈ విధంగా చూస్తే, ఇది కొన్నాళ్ళ క్రితం కొత్తపాళీ గారు ఇచ్చిన కథా వస్తువు లాగుంది. ఎలాగన్నా మలుచుకోవచ్చు ఈ వస్తువుని. ఇంకోళ్ళైతే ఏమి చేసేవాళ్ళో నాకు తెలీదు కానీ, ఇది కురసోవా తీసినందుకు కాబోలు – సూటిగా తాకుతుంది చూసేవారిని.

కథ ప్రారంభంలోనే బ్యూరోక్రసీ అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు – ఆ ఆఫీసులు ఎలా ఉన్నాయో చూపడంలో కానీ, ఉద్యోగుల వైఖరిలో కానీ, తమ ప్రాంతంలో పార్కు కట్టించుకోవడం కోసం ఆ గుంపు మనుష్యులు ఎన్ని డిపార్ట్మెంట్లు తిరిగారో – ఇదంతా చాలా సహజంగా చూపారు. యాభైల్లో జపాన్ కీ, ఇప్పటి భారద్దేశానికీ కూడా తేడా ఏమీ తెలీలేదు నాకు-ఈ విషయంలో. జపాన్ లో ఇప్పుడెలా ఉందో అన్నది నాకు తెలియదు మరి. మన హీరో ఆఫీసులో ఉన్న అంతమందిలోనూ కాస్త వేరుగా ఉండే మనిషి ఒక యువతి. ఆమె పాత్రను పరిచయం చేసే సీను కూడా నాకు చాలా నచ్చింది. అందులోనే ఆమె స్వభావం అర్థమౌతుంది పాఠకులకి. వతానబే డాక్టర్ దగ్గరకి వెళ్ళిన సీను కూడా ఓ అద్భుతం. బైట మరో రోగితో అతనికి జరిగిన సంభాషణ (ఏకపాత్రాభినయం అనాలేమో…) తరువాత, డాక్టరు లోపల అన్న ఒక్కో మాటకీ వతానబే లో మారుతున్న రంగులు – చూసి తీరాలి. తరువాత అతని ఇంట్లో – అతని కొడుకూ-కోడలూ అతని గురించి మాట్లాడుకున్న మాటలు, వతానబే స్పందనలు అన్నీ చాలా సహజంగా ఉన్నాయి. జాపనీస్ కుటుంబాలకీ, మన కుటుంబాలకీ చాలా సన్నిహిత సంబంధం ఉందేమో జీవన విధానం లో-అనిపించింది ఈ సినిమా లో కుటుంబ సన్నివేశాలు చూస్తున్నంతసేపూ.

వతానబే “Life is brief” పాడిన రెండు సన్నివేశాలు (ఒకటి క్లబ్ లో దిగులుగా, ఒకటి పార్కులో చివరి క్షణాల్లో ఆనందంగా) చాలా బాగా తీసారు. వతానబే తన గురించి తానే బాధపడుతున్నపుడు అతనితో ఉన్న అతను అంటాడు, బార్లో – “we’ve got to be greedy about living. we have learnt that greed is vice. but, thats old. Greed is virtue. especially this greediness for life.” అని. ఎంత నిజం! అనిపించక మానదు ఆ డైలాగు వింటే. బ్యూరోక్రసీ ని గురించి వ్యంగ్యం ఈ సినిమాలో చాలా చోట్లే కనిపిస్తుంది మనకు-మొదటి సీను నుండి. ఉదాహరణకి, వతానబే మరణం తరువాత జరిగిన సమావేశం లో – “doing anything but nothing is radical there.” అన్న డైలాగు. సినిమా మొదట్లో వచ్చే వాయిస్ ఓవర్ లో కూడా కావాల్సినంత వ్యంగ్యం ఉంది. వతానబే మరణం తరువాత జరిగిన చర్చ – అది ఎన్ని సార్లైనా వినొచ్చు. ఒక మనిషి చనిపోయాక అతని గురించి అతన్ని ఎరిగిన వాళ్ళ స్పందనలు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నది బాగా అర్థమౌతుంది. చావు అనేది ఎక్కడన్నా చావే – ఈ సన్నివేశాన్ని మన సమాజానికి అన్వయించుకోగలిగాక ఆ విషయం మరింత బాగా అర్థమైంది.

ఇంతా చెప్పి వతానబే పాత్రధారి తకాషి షిమురా గురించి చెప్పకపోతే అసలు ఈ వ్యాసం రాయడమే వ్యర్థం. అతను నటించాడో, జీవించాడో తేల్చుకోలేకపోతున్నాను నేను. కథలో పెద్ద డైలాగులే లేవు అతనికి. ఉన్నా కూడా, ఏదో గొణిగినట్లు ఉంటాయి. ఒకే సన్నివేశంలో అనుకుంటా నవ్వింది కూడా. ఎన్ని భావాలు పలికించాడో లెక్కలేదు-ఆ కళ్ళలో. అతన్ని చూస్తే చిరాకేసింది…అతన్ని చూస్తే జాలేసింది…అతన్ని చూస్తే భయమేసింది….అతన్ని చూస్తే బాధ…అతని చూస్తే కోపం…అతని నవ్వు చూసి ఆనందం… ఒకే మనిషి కథాక్రమంలో కేవలం తన ముఖ కవళికలతోనే మనచేత ఇన్ని రసాల్ని అనుభవింపజేయగలిగాడు అంటే – అతనిది నటనకానే కాదు.. జీవించడమే! ఇకిరు మొత్తానికి ఓ గొప్ప అనుభవం.

ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటన

ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటన 
Updated :30-10-2015 01:12:19
పట్నా, అక్టోబరు 29: ఏ రాష్ట్రానికీ ఇక ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పకనే చెప్పారు.అసలు ప్రత్యేక హోదా అంశానికి ప్రాధాన్యం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య నిధుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం చేపట్టిన సంస్కరణలతో ప్రత్యేక హోదా డిమాండ్‌ అన్నది అప్రస్తుతంగా మారిందని అన్నారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మోదీ బిహార్‌కు 1.65 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని చెప్పారు. బిహార్‌కు మరింత చేయూతనివ్వాలని తాము భావిస్తున్నామన్నారు.

జూన్‌లోపు రావాల్సిందే

జూన్‌లోపు రావాల్సిందే
Updated :30-10-2015 00:57:50
  • నేనిక్కడ మీరక్కడ ఉంటే పరిపాలన వీలు కాదు
  • ఆర్థిక స్థితి బాగాలేకున్నా అడిగినవన్నీ ఇచ్చాను
  • రాజధాని నిర్మాణానికి ఉద్యోగులూ త్యాగాలు చేయాలి
  • ఇక్కడ తాత్కాలిక వసతే.. శాశ్వతంగా కల్పించలేం
  • పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించండి
  • సచివాలయ ఉద్యోగ నేతలకు బాబు స్పష్టీకరణ
  • హెచ్‌వోడీలపై ఐఏఎస్‌ల్లో భిన్నస్వరాలు


హైదరాబాద్‌, విజయవాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఇక్కడ.. మీరు అక్కడ ఉంటే పాలన వీలు కాదు. దయచేసి ఇబ్బంది పెట్టవద్దు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సాయం అందడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి. వచ్చే జూన్‌లోగా ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ప్రాంతానికి రావాల్సిందే’’ అని సీఎం చంద్రబాబు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులకు స్పష్టం చేశారు. ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉంటే పాలనకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఉద్యోగులు వచ్చే జూన్‌లోపులో రాజధాని ప్రాంతానికి రావాలంటూ సాధారణ పరిపాలన శాఖ మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సచివాలయంలో గందరగోళం చెలరేగింది. జూన్‌లోపులో విజయవాడకు రావడం సాధ్యం కాదని, శాశ్వత తరలింపునకు రెండు మూడేళ్లు పడుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, మరికొంత మంది నాయకులు గురువారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే జూన్‌లోగా ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ తరలి రావాల్సిందేనని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఉద్యోగులు కూడా కొన్ని త్యాగాలు చేయాలని కోరారు. రాజధాని ప్రాంతంలో ఉద్యోగులకు కొంతకాలం తాత్కాలిక వసతి కల్పించగలమని, శాశ్వత వసతి ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు. అటు హైదరాబాద్‌లోనూ, ఇటు అమరావతిలోనూ హెచ్‌ఆర్‌ఏ కల్పించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తామన్నారు.

Altruism flows in his veins

CITIES » BENGALURU

Updated: October 30, 2015 08:16 IST

Altruism flows in his veins

COMMENT   ·   PRINT   ·   T  T  

‘Blood’ Kumar has been championing the cause and dispelling myths about blood donation.

While returning home from school one day in 1981, he heard of the fire at Venus Circus. He rushed to the spot with his brother to help the injured. In the melee, he lost his school bag and was also caned by the police. The next day, he overheard his father telling his mother that many children were dying for want of blood. The incident pushed him to learn all about blood donation and also donate blood. Since then, he has been championing the cause and dispelling myths about blood donation.
As of now, 52-year-old ‘Blood’ Kumar has donated blood 154 times. “When I donated blood for the first time, I was underage. I was scared about blood donation. Later, a doctor helped me understand blood donation better. This inspired me to create awareness about blood donation and I began organising voluntary donation camps across the city,” he says.
Mr. Kumar, who was earlier known as Balan Kumar, says that blood donation is the ultimate service to people, which can even save lives. In 1998, he organised a huge camp and attempted to create a record by getting the maximum number of people to donate blood. “Around 8,000 people donated blood… but it was not recognised by the Guinness Book of Records, as we did not have funds to register. After the event, we learnt that the record was 4,000 people donating blood,” he adds.
He says he faced stiff opposition from his family when he decided to have a blood donation camp at his wedding reception in 2006. “We went ahead with it despite the opposition and 53 people donated blood that day.”
Along with blood donation, he has begun creating awareness about organ donation and breast cancer. After opting for voluntary retirement from his job with the Indian Space Research Organisation, he has been focussing on this and also working with the government on creating awareness about good road behaviour.
“Several awards, including Rajyotsava Award, have come my way… but nothing is more satisfying than knowing that you have helped save someone’s life.”
Better Bengaluru series concludes today. Stay updated on follow-ups of these stories at http://www.thehindu.com/news/cities/bangalore/
Projects he is involved with
Promoting voluntary blood donation
Creating awareness about good road behaviour
Imparting first aid training to school children and teachers
Suggestions for the government
Creating awareness about emergency care and first aid
Enforce laws for traffic violations
Ensure blood group is mentioned in driving licence or Aadhaar card
Suggestions for citizens
Donate blood, save a life
Learn whom to contact in emergencies
Be in touch with local hospital and police station

Thursday 29 October 2015

BJP’s Plan ‘B’ is to create communal tension: Rahul

ELECTIONS » BIHAR ASSEMBLY ELECTIONS 2015

Updated: October 30, 2015 03:56 IST

BJP’s Plan ‘B’ is to create communal tension: Rahul

COMMENT (1)   ·   PRINT   ·   T  T  

Slamming Prime Minister Narendra Modi and the Bharatiya Janata Party on Thursday, Congress vice-president Rahul Gandhi said that Plan “B” of the BJP was to create communal tensions for political gain.
He said the Bihar elections would teach Prime Minister Narendra Modi “a hard lesson”.
“Sometimes, Mr. Modi calls Mahagathbandhan [grand alliance] leaders “tantrik” [black magician] and at times, he calls them “3 Idiots”, but the voters of Bihar are not fools,” Mr. Gandhi said at three poll meetings.
“Modiji has been making such remarks as he has got training like this and he also has sensed his defeat in Bihar polls. But, such language does not behove a Prime Minister.” Alleging that Mr. Modi was being “remote-controlled by the RSS,” the Congress vice-president said: “Modiji also has a Plan “B” to pit one against the other.” “But this plan has also badly failed in Bihar.” He also said that NDA leaders had lost their cool seeing the victory of the grand alliance in Bihar.

తెలంగాణ నుంచి అమరావతికి వచ్చేందుకు మేం సిద్ధం

తెలంగాణ నుంచి అమరావతికి వచ్చేందుకు మేం సిద్ధం
Updated :29-10-2015 14:58:06
 సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ
విజయవాడ,అక్టోబర్29: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విజయవాడలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. ఉద్యోగులు విజయవాడకు వచ్చేందుకు షరతులు పెడుతున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబుకు మురళీకృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడున్నాయో చెబితే వెంటనే తెలంగాణ నుంచి అమరావతికి వచ్చేస్తామని వారు తెలిపారు. జూన్‌ 2 తేదీ నాటికి సచివాలయ ఉద్యోగులందరం అమరావతికి వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆయన ముఖ్యమంత్రికి హామి ఇచ్చారు. ఉద్యోగుల పీఆర్సీ, లోన్‌, అడ్వాన్సుల జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఎంను ఆయన కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి నట్లు మురళీకృష్ణ తెలిపారు. డీఏ పెండింగ్‌ కూడా వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారన్నారు. అంతేకాక అమరావతిలో ఉద్యోగులకు స్థలాలు ఇవ్వాలని చంద్రాబాబును కోరామని ఆయన అన్నారు. ఇక్కడే 15వేల మంది ఉద్యోగులు ఇళ్లు కట్టుకుంటే ప్రభుత్వ కార్యకలాపాలు పెరుగుతాయని సీఎంకు చెప్పామని ఆయన అన్నారు. మేము కోరిన డిమాండ్లన్నిటికి సీఎం చంద్రబాబు ఏకీభవించారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.

Arrest of Adeeb was unavoidable, says Minister

Arrest of Adeeb was unavoidable, says Minister

PRINT   ·   T  T  

Says India has addressed the Nasheed issue with fairness and maturity

The Maldives Foreign Minister, Dunya Maumoon, has said the decision to arrest Vice-President Ahmed Adeeb was “extremely regrettable”, but was unavoidable as it was in connection with the investigation into an explosion on the Presidential boat.
In an e-mail interview with The Hindu , Ms. Maumoon said the government had enough evidence to suggest strongly that the blast was an attempt on President Abdulla Yameen’s life.
Though she did not say who was behind the blast, she said Mr. Adeeb was taken into custody “because the relevant authorities are determined that an impartial investigation could not be carried out unless the Vice-President was detained”.
She said Mr. Adeeb refused to cooperate with the investigation authorities. “There are reasonable grounds to believe that the Vice-President had been exerting undue influence on the Maldives Police Service, through official and unofficial channels and by the use of resources outside the scope of the state budget.” Asked if the recent political crises and dismissal of a number of government officials point to some instability to the Yameen regime, she said: “Reports of instability are wholly inaccurate.”
“The events of September 28 have galvanised support around the President and unified his team to continue with the important work that we have been tasked to do for the Maldivian people,” Ms. Maumoon said. Mr. Adeeb was appointed Vice-President only three months ago when Mr. Yameen’s running-mate, Mohamed Jameel, was impeached. Earlier this month, the President sacked Defence Minister Moosa Ali Jaleel and senior police officials. The country has been in the grip of political crises ever since Mr. Yameen became President through a controversial election in 2013.
The former President Mohamed Nasheed, the country’s first democratically elected leader, was jailed in March for 13 years after being found guilty of terrorism. A U.N. panel recently ruled that Mr. Nasheed’s sentence was illegal.
However, Ms. Maumoon defended the verdict. “I think it is important to reiterate that this case is an independent judicial process which we hope the international community will respect. The former President has been prosecuted because of an order he made to the Army to abduct the Chief Judge of the Criminal Court.”
She said Mr. Nasheed’s appeal in the Supreme Court was “heard fairly, transparently and in line with fundamental legal norms”. She expressed “extreme disappointment” at the U.N. panel’s ruling. “The view of the WGAD [the U.N. Working Group on Arbitrary Detention] is an opinion and not a legally binding judgment, and the government is treating it as such, while making necessary representations.”
Asked if the Nasheed episode affected the Maldives’ ties with India, the Minister said New Delhi respected the independence and sovereignty of the island nation.
(For full interview visit: http://bit.ly/DunyaInt)