అవయువ దానం.. ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్.. Updated :29-10-2015 11:40:50 |
రాష్ట్రంలో జరుగుతున్న అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు, దాతలు ఇచ్చే అవయవాల అమరికపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికైనా బ్రెయిన్ డెడ్ అయితే వారి అవయవాలను కుటుంబ సభ్యుల అనుమతితో తీసి వేరొకరికి అమరుస్తున్నారు. దీన్ని వైద్యులు, ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. బ్రెయిన్‌డెడ్ కేసుల్లో ఎక్కువ మంది పేదలే అవయవదానాలు చేస్తున్నారు. వీరు ఉచితంగా తమ అవయవాలను ఇస్తుంటే.. వాటిని అమర్చడానికి ఒక్కో ఆస్పత్రి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు రోగి నుంచి వసూలు చేస్తోంది. ఒక వ్యక్తి నుంచి రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరిస్తే...వాటి ద్వారా రూ.50 లక్షలకు తక్కువ లేకుండా ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఇందులో అవయవాలు ఇచ్చిన కుటుంబానికి నయాపైసా కూడా ముట్టడం లేదు. పేదలు దానం చేస్తుంటే మధ్యలో వైద్యులు లాభపడుతున్నారు.
ఎవరైనా అనారోగ్యంతో అవయవ మార్పిడి చేసుకోవాలంటే...ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. దీనికి రూ.10 వేలు ఫీజు కట్టాలి. వెయిటింగ్ లిస్టు ప్రకారం పిలుపు వస్తుంది. ఇక్కడే అవకతవకలు జరుగుతున్నాయి. వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాక..బ్లడ్ గ్రూపును బట్టి వెయిటింగ్ లిస్టు తయారుచేస్తారు. ఎక్కడైనా అవయవాలు దానం చేస్తున్నారనే సమాచారం వస్తే..ఆ బ్లడ్ గ్రూపును బట్టి జాబితాలో రోగికి ఆపరేషన్‌కు సిద్ధంగా వుండాలని సమాచారం ఇస్తారు. అవయవాలు ఉచితంగా వస్తున్నా...ఆపరేషన్ చేసేది ప్రైవేటు ఆస్పత్రుల్లో కాబట్టి...వైద్యులు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక కిడ్నీ మార్పిడికి రూ.10 లక్షలు ఖర్చు అవుతోంది. ఇంత మొత్తం పేదలు భరించలేరు కాబట్టి వారి పేరు వెయిటింగ్ లిస్టులో ముందు వున్నా ప్రాధాన్యం లభించడం లేదు. ఆ మొత్తం భరించగలిగేవారికే ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ను జీవన్‌దాన్ ట్రస్టు నిర్వహిస్తోంది. ఏ బ్లడ్ ... గ్రూపులో ఎంతమంది రోగులు అవయవాల కోసం వేచి వున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. ఓ రోగి పేరు నమోదు చేసుకుంటే... వెయిటింగ్ లిస్టులో నంబర్ ఎంతో కూడా చెప్పరు. తన వంతు ఎప్పుడు వస్తుందో తెలుసుకునే వీలు లేదు. ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం వల్ల ట్రస్టు, ప్రైవేటు ఆస్పత్రులు కలిసి ఉచితంగా వచ్చిన అవయవాలను ధనికులకు అమర్చి సొమ్ము చేసుకుంటున్నాయనే తీవ్రమైన ఆరోపణలు వున్నాయి.
వారం రోజుల క్రితం విశాఖపట్నంలో ఓ యువకుడు బ్రెయిన్‌డెడ్‌తో చనిపోతే...శరీరం నుంచి రెండు కిడ్నీలు, కళ్లు సేకరించారు. అందులో ఓ కిడ్నీని కేర్ ఆస్పత్రిలో రోగికి అమర్చారు. ఆ రోగి నుంచి ఆపరేషన్ కోసమని రూ.6.5 లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత మందులు, ఇతర ఖర్చుల కోసం మరో రూ.3 లక్షలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇలా ఎవరు అవయవ మార్పిడి చేసుకున్నా..ఆ స్థాయిలో భరించాల్సిందే. విశాఖ సమీపానున్న పెదగంట్యాడకు చెందిన కడవల నాగరాజు (30) కిడ్నీ కోసం చాలాకాలం క్రితమే పేరు నమోదు చేసుకున్నాడు. రూ.10 వేలు అప్పు చేసి ఫీజు కట్టాడు. ఆరోగ్యశ్రీ కార్డుపై కేజీహెచ్‌లో డయాలసిస్ చేయించుకునేవాడు. అతనికి కిడ్నీ అమరిస్తే...ఆపరేషన్ ఫీజు కట్టలేడని ఆయనకు పిలుపే రాలేదు. ఎదురు చూసి చూసి నెల రోజుల క్రితం చనిపోయాడు. ఇద్దరు పిల్లలున్న నాగరాజు భార్య..తన భర్తకు కిడ్నీ ఇవ్వలేదు కాబట్టి కట్టిన రూ.10 వేలైనా వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. కానీ ట్రస్టు స్పందించడం లేదు. పేదరోగులు ఎదుర్కొంటున్న ఇలాంటి కష్టాలకు లెక్కేలేదు. అవయవాలు తీసుకున్నాక...ఆ శవాన్ని సొంతూరికి పంపడానికి ఆస్పత్రులు అంబులెన్స్‌ను కూడా ఉచితంగా సమకూర్చడం లేదు. ఆ భారం మీదేనంటూ దాత కుటుంబాలపై నెట్టేస్తున్నాయి. రాష్ట్రంలో అవయవమార్పిడి ఆపరేషన్లు అన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చేస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సదుపాయం కల్పించలేదు.
తమిళనాడు విధానం తేవాలి
తెలుగు రాష్ట్రాల్లో అవయవ మార్పిడి విధానంలో చాలా లోపాలు వున్నాయి. ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. పక్కనే వున్న తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆపరేషన్లను ఉచితంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చేస్తోంది. పేరు నమోదు చేసుకోగానే రోగికి నంబర్ వస్తుంది. తన వంతు ఎప్పుడు వస్తుందో ఎప్పటికపుడు సమాచారం ఇస్తారు. అంతా ఉచితంగా చేస్తారు. ఆ విధానం ఆంధ్రప్రదేశ్‌లోను అమలు చేయాలి.
గూడూరు సీతామహాలక్ష్మి,
అఖిల భారత శరీర, అవయవదాతల సంఘం అధ్యక్షురాలు
The right to life is a moral principle based on the belief that a human being has the right to live and, in particular, should not to be killed by another human being. The concept of aright to life is central to debates on the issues of capital punishment, war, abortion, euthanasia, and justifiable homicide.
Ethics and right to life[edit]
Some utilitarian ethicists argue that the "right to life", where it exists, depends on conditions other than membership of the human species. The philosopher Peter Singer is a notable proponent of this argument. For Singer, the right to life is grounded in the ability to plan and anticipate one's future. This extends the concept to non-human animals, such as other apes, but since the unborn, infants and severely disabled people lack this, he states that abortion, painless infanticide and euthanasia can be "justified" (but are not obligatory) in certain special circumstances, for instance in the case of a disabled infant whose life would be one of suffering, or if its parents didn't wish to raise it and no one desired to adopt it.[12]
Juridical rhetoric[edit]
|
No comments:
Post a Comment