- హోదాపై ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నా
- జయదేవ్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసంతృప్తి
గుంటూరు, విజయవాడ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి):రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై తాను కూడా సంతృప్తి చెందలేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. శుక్రవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్టానికి ప్రత్యేక హోదా అంశం ఒక భావోద్వేగమైనదిగా మారిందన్నారు. ఈ విషయంపై తాను లోక్‌సభలో నాలుగుసార్లు ప్రస్తావింప్రధాని ప్రసంగంపై నేనూ సంతృప్తి చెందలేదుచానని, కేంద్ర హోం మంత్రి కూడా స్పందించి ప్రకటన చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, ప్రత్యేక హోదా ప్రకటన విషయంలో తాను ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. కాగా, జయదేవ్ వ్యాఖ్యలపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తనను కలవాలని ఆదేశించారు. దీంతో, విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన గల్లా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన జయదేవ్... తాను గుంటూరులో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని వివరణ ఇచ్చారు.
|
No comments:
Post a Comment