Friday, 30 October 2015

ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటన

ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటన 
Updated :30-10-2015 01:12:19
పట్నా, అక్టోబరు 29: ఏ రాష్ట్రానికీ ఇక ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పకనే చెప్పారు.అసలు ప్రత్యేక హోదా అంశానికి ప్రాధాన్యం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య నిధుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం చేపట్టిన సంస్కరణలతో ప్రత్యేక హోదా డిమాండ్‌ అన్నది అప్రస్తుతంగా మారిందని అన్నారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మోదీ బిహార్‌కు 1.65 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని చెప్పారు. బిహార్‌కు మరింత చేయూతనివ్వాలని తాము భావిస్తున్నామన్నారు.

No comments:

Post a Comment