Thursday 15 October 2015

శంకుస్థాపనకు నన్ను పిలవొద్దు.. నేను రాను: వైసీపీ అధినేత జగన్

శంకుస్థాపనకు నన్ను పిలవొద్దు.. నేను రాను: వైసీపీ అధినేత జగన్
Updated :15-10-2015 14:28:08
హైదరాబాద్, అక్టోబర్ 15: ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్‌ బహిరంగలేఖ రాశారు. రాజధాని శంకుస్థాపనకు తనకు ఆహ్వానం పంపొద్దని, పంపినా హాజరుకానని ఆయన లేఖలో తెలిపారు. అమాయకప్రజల భూములు లాక్కొని రాజధాని కట్టడాన్ని తాము తొలినుంచీ వ్యతిరేకిస్తున్నామని, రైతుల భూములు లాక్కొని వారి ఉసురుపోసుకున్నారని జగన్ ఘాటుగా స్పందించారు. రాజధానిలో 144సెక్షన్‌ కొనసాగించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలనూ ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆయన పేర్కొన్నారు.
 
ఒక్కరోజు తతంగానికి రూ.400కోట్లు బూడిదపాలు చేస్తున్నారని రాజధాని నిర్మాణాన్ని ఉద్దేశించి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం శంకుస్థాపన చేసేది ప్రజల రాజధానికి కానేకాదని, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కోసమే శంకుస్థాపన కార్యక్రమమని లేఖలో జగన్ తెలిపారు. కమీషన్లు, లంచాల కోసం సింగపూర్‌ కంపెనీలకు ప్రజల భూములను అప్పగిస్తున్నారని జగన్ లేఖలో చంద్రబాబునుద్దేశించి రాశారు. వైసీపీ శ్రేణులెవరూ శంకుస్థాపన కార్యక్రమానికి మద్ధతుగా నిలవరని జగన్ లేఖలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment