Friday 23 October 2015

మోదీ వరాలు రాల్చకపోవడానికి కారణాలివేనా..?

మోదీ వరాలు రాల్చకపోవడానికి కారణాలివేనా..?
Updated :22-10-2015 21:14:08
అమరావతి, అక్టోబర్ 22: నవ్యాంధ్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ముగిసింది. వందల సంఖ్యలో విదేశీ ప్రతినిధులు, వేలాదిమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, లక్షలాదిమంది జనసందోహం మధ్య ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతోంటే ఏపీలో దసరా పండుగ ముందే వచ్చినట్లయింది. రాష్ట్రంలోని చిన్న పిల్లాడి నుంచి పండు ముదసలి వరకూ ఎంతో ఉత్కంటతో ఈ కార్యక్రమం కోసం వేచి చూశారు. కార్యక్రమానికి ప్రధాని వస్తారు.. తమ రాష్ట్రాన్ని ఆదుకుంటారనే అందరూ భావించారు.
 
అప్పులతో రాష్ట్ర ప్రస్థానాన్ని ప్రారంభించడంతో ఏపీ ప్రజలు పూర్తిగా కేంద్రం పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే అమరావతి పండగ సంబరం ముగిసింది. కానీ వరాలిచ్చే మోదీ కరుణించలేదు. ‘అండగా ఉంటాం’ అన్న ఒక్క మాటతో సరిపుచ్చారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ వంటి ఊసే లేకుండా మోదీ ప్రసంగం కొనసాగింది. దీంతో ఏపీ ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. టీడీపీ, బీజేపీ నాయకులను కూడా ప్రధాని ప్రసంగం విస్మయం కలిగించింది. అయినా తప్పనిసరిగా మోదీని వెనకేసుకు వస్తూ మట్లాడారు. ఇంతకీ వరాలివ్వడానికి మోదీకి అడ్డుపడిందెవరు..? అసలు ఏపీకి సాయం చేయాలని కేంద్రానికి ఉందా..? వంటి ప్రశ్నలకు బీజేపీ నాయకులు మాత్రం విభిన్నమయిన సమాధానాలిస్తున్నారు. బీహార్ కంటే మెరుగయిన ప్యాకేజీ ఇచ్చేవారనీ, అయితే అక్కడ ఇంకా ఎన్నికలు ముగియనందున ఆగాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో పాటు ఏపీకిచ్చే వరాలపై నీతి ఆయోగ్ ఇంకా నివేదిక పూర్తిచేయలేదని కారణాలు చెబుతున్నారు.
వీటన్నింటితోపాటు పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనుండగా ఏపీకి అన్ని వరాలిస్తే తమకేంటి అని కేసీఆర్ అడుగుతారనీ చెబుతున్నారు. అయినా మన పెద్దలు చెబుతున్నట్లు రాజు తలచుకుంటే వరాలకు కొదువా..?. ‘ఎవరికయినా రాజకీయ లబ్దే ముఖ్యంరా.. బీహార్‌లో ప్యాకేజీ ఇచ్చారు కదా.. లాభమా..? నష్టమా..? చూసుకుంటారు. లాభమయితే వెంటనే ఏపీకి కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారు.’ అని అక్కడికి వచ్చిన రైతులు మాట్లాడుకుంటున్నారు.

No comments:

Post a Comment