Sunday, 25 October 2015

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు 
Updated :26-10-2015 03:23:48
కాదనడం తెలుగుజాతికే కళంకం
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు 

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తెలుగుజాతి ఆత్మగౌరవానికే కళంకమని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ వాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు కలుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నా.. చెప్పినట్లుగానే రుణ మాఫీ చేయడంతో పాటు మహిళలకు రుణాలు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు రాషా్ట్రనికి వచ్చాయని, ప్రతిష్ఠాత్మక కేంద్ర విద్యాసంస్థలు కూడా ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.

No comments:

Post a Comment