Sunday 18 October 2015

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ హెలికాప్టరు ?

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ హెలికాప్టరు ?
Updated :19-10-2015 11:21:20
 విజయవాడ, అక్టోబరు 19 : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గన్నవరం నుంచి ఏపీ ప్రత్యేక హెలికాప్టరులో శంకుస్థాపన స్థలానికి తీసుకువెళ్లాలని ఏపీ అధికారుల యోచిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించారు.
 
21 రాత్రి సూర్యాపేటలో బస చేస్తానని తర్వాతి రోజు అమరావతి శంకుస్థాపనకు రోడ్డు మార్గాన ఉద్దండరాయునిపాలెంకు వస్తానని చంద్రబాబుతో కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు టి.సీఎంవో అధికారులు సూర్యాపేట నుంచి ఉద్దండరాయునిపాలెం రూట్‌మ్యాప్‌ను అడిగారు. దీంతో ఆంధ్రా అధికారులు రూట్‌మ్యాప్ ఇస్తూనే సీఎం కేసీఆర్ సూర్యాపేట నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు హెలికాఫ్టర్లో రావాలని అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్‌లో ఉద్దరాయునిపాలెంకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు సూచించనున్నారు.
 
రోడ్డు మార్గం ద్వారా భద్రతా ఏర్పాట్లకు ఇబ్బంది కలుగుతుందని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్‌లో శంకుస్థాపన ప్రాంగణానికి రావాల్సిందిగా తెలంగాణ పోలీసులు అధికారులకు, సీఎంవోకు సూచించనున్నారు. ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్‌లతో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాయబారుల కోసం ఐదు హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేశారు.
 
కాగా తెలంగాణ సీఎంవో అధికారులు సూర్యాపేట నుంచి ఉద్దండరాయునిపాలానికి వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాటు చేసిన రూట్‌ మ్యాప్ తదితర వివరాలను కృష్ణా జిల్లా అధికారులను అడిగారు. ఈ వివరాలను టి.సీఎంవో అధికారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

No comments:

Post a Comment