Saturday 17 October 2015

తెలుగు కథతోనే చిరు సినిమా తీయాలి : ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ

తెలుగు కథతోనే చిరు సినిమా తీయాలి : ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ
Updated :17-Oct-2015 : 12:01
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ట్విట్లర్లో కామెంట్లు విసిరారు. తెలుగు ఖ్యాతిని దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి చాటుతుంటే చిరంజీవి తమిళ సినిమాను దిగుమతి చేసుకోవడం తెలుగువారిని కించపరచడమే అని వర్మ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. తెలుగు కథతోనే సినిమా తీయాలని మెగాస్టార్‌ను అభిమానులందరూ డిమాండ్ చేయాలన్నారు. 151వ సినిమా తమిళ సినిమా కాపీ కాకూడదని కోరుకుంటున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాకు నిజమైన బ్రూస్‌లీ రాజ‌మౌళే అని వర్మ ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment