గుంటూరు(సంగడిగుంట): రాష్ట్రంలోని ప్రజలందరి భాగస్వామ్యంతో సీఎం చంద్రబాబు అమరావతి రాజధానిని నిర్మించబోతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మన నీరు, మన మట్టి కార్యక్రమాలు రెండో రోజు జిల్లాలో గ్రామగ్రామాన వైభవంగా జరిగాయి. గుంటూరులోని టీడీపీ కార్యాయలం, గోరంట్లలోని శివాలయంలో టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కిషోర్‌బాబు, ఎమ్మెల్యే ఆంజనేయులు, మన్నవ సుబ్బారావు పాల్గొని మట్టి, నీటి కలశాలకు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుంచి కలశాలను ఊరేగింపుగా ఎన్‌టీఆర్ భవన్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ టీడీపీ ఎస్‌సీ సెల్ నాయకుడు మానుకొండ శివప్రసాద్ ఆధ్వర్యంలో పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీ నాయకుడు లాల్‌వజీర్ ఆధ్వర్యంలో దువా నిర్వహించారు. అమరావతి హోమంలో మంత్రు లు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరిని భాగస్వామ్యం చేసేందుకే మన నీరు, మన మట్టి కార్యక్రమాన్ని చేపట్టారని, దీనికి అన్ని గ్రామాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా భావించాలన్నారు. ప్రపంచంలోని 10 ప్రధాన నగరాల్లో అమరావతి భవిష్యత్తులో ఒకటిగా ఉండబోతోందన్నారు. రాజధానికి ప్రజల సంకల్పబలం ఉందని, అందుకే ఏ కార్యక్రమం తలపెట్టిన విజయవంతమౌతోందన్నారు. ప్రతి ఒక్కరు రాజధాని తమది అని భావించేలా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షు డు ఆంజనేయులు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలుగకూడదని ఆయా మత పెద్దలు ఆశీర్వదించి ఆకాంక్షించా రు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడు తూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణానికి 33ఏల ఎకరాలు భూ సమీకరణ ద్వారా సేకరించడం ముఖ్యమంత్రి చం ద్రబాబు ఘనతేనన్నారు. రైతులందరూ సీఎం ను నమ్మి తమ భూములను అందజేయడం గొప్ప విషయం అన్నారు. వారందరిని కూడా రాజధాని శంకుస్థాపనలో భాగస్వాములను చేయడం మనలిన మనం గౌరవించుకోవడం గానే భావించాలన్నారు. ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకుడు కొమ్మినేని విజయలక్ష్మి ఆధ్వర్యంలో కోలాటం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షు డు మానుకొండ శివప్రసాద్, టీవీ రావు, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, సుంకర సతీష్, ఇక్కుర్తి సాంబశివరావు, గంజి చిరంజీవి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, వేణు, నాగరాజు, చిట్టిబాబు, దారపనేని, కసుకుర్తి, షౌకత్ తదితరులు పాల్గొన్నారు
This comment has been removed by the author.
ReplyDelete