Saturday, 17 October 2015

15 ఏళ్లలో శ్రీశైలం డ్యాం ఎన్నడూ ఇలా లేదు

15 ఏళ్లలో శ్రీశైలం డ్యాం ఎన్నడూ ఇలా లేదు
Updated :17-10-2015 09:07:13
  • ఖరీఫ్‌ ముగుస్తున్నా నిండని డ్యాం 
  •  బలపడని అల్పపీడనాలు 
  •  ముఖం చాటేసిన రుతుపవనాలు 
  •  కృష్ణా నదిపై తీవ్ర ప్రభావం 
  •  15 ఏళ్లలో ఎన్నడూలేని పరిస్థితి 
  •  ఉభయ రాష లకూ కష్టకాలమే.. 
2014-15 ఖరీఫ్‌ సీజన్‌ చివరిదశకు చేరినా శ్రీశైలం డ్యాం నిండలేదు. ఈ ఏడాది రుతుపవనాలు ముఖం చాటేశాయి. అడపాదడపా ఆదుకోవాల్సిన అల్పపీడనాలు సైతం బలపడకపోవడం కృష్ణానది పరివాహకంపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రస్తుతం ఎగువ నుంచి నీటి ప్రవాహం కూడా లేదు. దీంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. గత 15 ఏళ్లలో ఎన్నడూలేని పరిస్థితి ఈసారి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జలాశయ నీటిమట్టం 854 అడుగులకు చేరడం అనుమానమే. ఈ నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల సాధ్యమవుతుంది. 

శ్రీశైలం: శ్రీశైలం తెలుగు రాష్ట్రా‌ల్లోని నదీ పరివాహక జిల్లాలకు తాగు, సాగునీటితో పాటు కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి లక్ష్యసాధనకు వీలవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో రెండు రాషా్ట్రలకు కష్టకాలం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఖరీఫ్‌ను పూర్తిగా నష్టపోవాల్సి రాగా.. రబీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సీజన్‌కు ముందే డెడ్‌స్టోరేజీ లోనే దిగువ జిల్లాలకు తాగునీటి అవసరార్థం శ్రీశైలం నీటిని విడుదల అనివార్యమైన విష యం తెలిసిందే. సీజన్‌ ఆరంభం నుంచే అటు రుతుపవనాలు, ఇటు అల్పపీడనాలు కృష్ణానది పరివాహకంపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాషా్ట్రల్లోని ఆనకట్టలకు నీరు చేర లేదు. ఫలితంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలం నిండే పరిస్థితి కనిపించడం లేదు. తుం గభద్ర, కృష్ణానదుల లోకల్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో కురిసిన కొద్దిపాటి భారీ వర్షాలకు శ్రీశైలజలాశయానికి కొంతమేర నీరు చేరింది. ఇదిలా ఉండగా స్థానిక వర్షాలకు తక్కువ నీటినిల్వ సామర్థ్యం గల జూరాల డ్యాం నిండడంతో అక్కడ డిమాండ్‌కు అనుగుణం గా చేస్తున్న విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలానికి వరదనీరు స్వల్పంగా చేరుతోంది. శ్రీశైలం నిండకపోవడంతో గతంలో ఎన్నడూలేని కరువు కాలం కళ్లముందు కదలాడుతోంది.
 
4 నెలల్లో 51 అడుగులు, 28 టీఎంసీలు
ఈ ఏడాది సీజన్‌కు ముందే డ్యాం నీటి మట్టం డెడ్‌స్టోరేజీలో ఉండగానే తాగునీటి అవసరాలకు దిగువకు శ్రీశైలం నీటిని 5 టీంఎంసీల మేర విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నీటిమట్టం 800అడుగులు నుంచి 797అడుగులకు (నీటినిల్వలు 48టీఎంసీలు)కు తగ్గింది. తదుపరి సీజన్‌ ఆరంభం నుంచే వర్షాభావం నెలకొనడంతో కృష్ణానది ప్రవాహం లేక రెండున్నర నెలల పాటు శ్రీశైలానికి నీరు చేరడం గగనమ యింది. అయితే సెప్టెంబర్‌ మాసంలో తుంగభద్ర లోకల్‌ క్యాచ్‌మెంట్‌లో కురిసిన వర్షాలకు శ్రీశైలానికి ఒకింత వరద పుంజు కోవడంతో డ్యాం నీటిమట్టం పెరిగింది. ఈ క్రమంలో రెండో పర్యాయం దిగువ ప్రాం తాలకు తాగునీటి అవసరార్థం శ్రీశైలం నీటిని మరో 5 టీఎంసీల మేర విడుదల చేయాల్సి రావడంతో నీటిమట్టం పెరుగుదలకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో సీజన్‌లో కేవలం 51 అడుగుల(28 టీఎంసీలు) నీరు మాత్రమే పెరిగింది. దీంతో డ్యాం నీటిమట్టం 848.20 అడుగులకు చేరగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 76.14 టీఎంసీలకు చేరింది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగు లు కాగా గరిష్ఠ నీటినిల్వ 215 టీఎంసీలు. అంటే ఈ సీజన్‌లో 50శాతం నీటినిల్వలు కూడా చేరకపోవడం గమనార్హం. గరిష్ఠ నీటి నిల్వకు చేరాలంటే ఇంకా 139 టీఎంసీల నీరు అవసరం ఉంది. ఇంతభారీ ఎత్తున నీరు చేరాలంటే కృష్ణానది ఎగువ పరివాహకాల్లో భారీ తుఫాన్లు సంభవిస్తే తప్ప శ్రీశైలం నిండదు.
 
నీటిమట్టం 854 అడుగులకు చేరేనా?
ఆక్టోబర్‌ దాటితే.. సీజన్‌ దాదాపుగా ముగి సినట్లే. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 854 అడు గులు చేరడంతోపాటు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం ఆశించిన స్థాయిలో ఉంటేనే రాయలసీమ ప్రాంతాలకు కృష్ణాజలాలను పోతిరెడ్డిపాడు ద్వారా విని యోగించేందుకు ఆస్కారం ఉంది. ప్రస్తుత నీటిమట్టం 848.20అడుగులు ఉండడంతో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ బాటం లెవెల్‌కు చేరింది. మరో శ్రీశైలం డ్యాం మరో 5.80 అడుగులు పెరిగి తేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదలకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇప్పటికే మూడురోజులుగా ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. ఈ క్రమంలో డ్యాం నీటిమట్టం 854అడుగులు చేరడం సందేహంగానే ఉంది.
 
ఇదీ తాజా పరిస్థితి
 శ్రీశైలం జలాశయ నీటినిల్వ సామర్థ్యం శుక్రవారం సాయంత్రం 6గంటల సమయానికి 76.1448 టీఎంసీలుగా, డ్యాం నీటిమట్టం 848.20 అడుగులుగా నమోదయ్యాయి. జలాశయానికి తుంగభద్ర నుంచి నీటి ప్రవాహం నిలిచిపోయింది. జూరాల జలాశయం నుంచి 4,400 క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే జలాశయ బ్యాక్‌వాటర్‌ నుంచి హంద్రీ-నీవాకు స్థిరంగా 1,690 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

No comments:

Post a Comment