Monday 30 December 2013

కేసీఆర్‌ది మా ఎజెండా కాదు: మావోయిస్టు

కేసీఆర్‌ది మా ఎజెండా కాదు:కేసీఆర్‌పై మావోయిస్టు పార్టీ ఫైర్

Published at: 28-12-2013 08:10 AM
 5  5  0 
 
 

అయనవన్నీ బూటకపు మాటలు
దళితుడికి సీఎం పదవీ అంతే..
ఆయన అభివృద్ధి నమూనాలో శాటిలైట్ సిటీలే ఉంటాయి
దళారీ బూర్జువావర్గ ప్రతినిథి..వారి కోసమే ఉద్యమంలోకి..
కేసీఆర్‌పై మావోయిస్టు పార్టీ ఫైర్
కొలువులు,నీళ్లు దొరికితేనే పునర్నిర్మాణం పూర్తయినట్టు
అప్పటిదాకా ప్రజలు పోరాడాలి
నీళ్ల విషయంలో రాయలసీమకే కష్టాలు
ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం
బ్రిజేష్ నివేదిక వెనకబడిన ప్రాంతాలకు అనుకూలం
ఆం«ధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి ప్రతాప్ వ్యాఖ్య
హైదరాబాద్, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి) : "టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ది మా ఎజెండా కానే కాదు. అధికారంలోకి వచ్చాక మావోయిస్టు అభివృద్ధి నమూనాను అమలు చేస్తానని ఆయన అనడం పచ్చి బూటకం. ఆయన ముమ్మాటికి దళారీ బూర్జువా వర్గ ప్రతినిధి. వారి కోసమే ఆయన పని చేస్తున్నారు'' అంటూ గులాబీ అధిపతిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ప్రతాప్ నిప్పులు చెరిగారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామనడం కూడా అందులోభాగమేనని దుయ్యబట్టారు. విభజన వల్ల రాయలసీమ జల కష్టాలు మరింత పెరుగుతాయని, ఆ ప్రాంతంతో కలిసి తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేక రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని తాము అనుకోవడం లేదన్న ఆయన.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విధానాల కన్నా, ప్రజల తక్షణ సమస్యలే ప్రముఖ పాత్ర పోషించాయని అంచనా వేశారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, కొలువులు, నిధులు లభించినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం పూర్తయినట్టని తెగేసిచెప్పారు. అప్పటిదాకా.. పోరాడాల్సిందేనని 'ఆంధ్రజ్యోతి'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ ప్రజలకు ప్రతాప్ పిలుపునిచ్చారు.
తెలంగాణ పునర్నిర్మాణం ఏ ప్రాతిపదికపై జరగాలని మావోయిస్టు పార్టీ ఆలోచిస్తోంది?
తెలంగాణ పునర్నిర్మాణం గురించి మా పార్టీ మొదటి నుంచీ నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేస్తున్నది. తెలంగాణ ఉద్యమం బూర్జువా డిమాండే అయినా అందులో వివిధ సెక్షన్లు, వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరేలా పునర్నిర్మాణ ప్రక్రియ సాగాలి. అయితే బూర్జువా వర్గం సహజంగానే తన ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అణగారిన వర్గాల ప్రజల ఆకాంక్షలకు, దళారీ బూర్జువా వర్గ ఆకాంక్షలకు మధ్య సంఘర్షణ ఉంటుంది.అయితే, అయితే బూర్జువాయేతర నాలుగు వర్గాల ప్రయోజనాలే ఇందుకు మౌలిక ప్రాతిపదిక. దానికి మాత్రమే ఈ పార్టీ మద్దతు ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికీ భూ సంస్కరణలే ప్రధాన సమస్య. స్థూలంగా చెప్పాలంటే, కోస్తా ప్రాంతపు బడా బూర్జువా, భూస్వామ్య వర్గాల దోపిడీకి, వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు, నిధులు, నీళ్ల వంటి సమస్యలపై తెలంగాణ ఉద్యమం జరిగింది. కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రజలు వీటిపై పోరాడితేనే పునర్నిర్మాణం జరిగినట్టు. వరంగల్ డిక్లరేషన్ (1997)లోనే ఈ విషయం స్పష్టం చేశాం.
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు అభివృద్ధి నమూనా అమలు చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు గదా?
అదంతా పచ్చి బూటకం. కేసీఆర్‌ది మా ఎజెండా కానేకాదు. ఆయన తెలంగాణ ప్రాంత దళారీ బూర్జువా వర్గానికి ప్రతినిధి. ఆ వర్గం కోసమే ఆయన ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆయన అభివృద్ధి నమూనాలో హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. కోస్తాంధ్ర బూర్జువా వర్గంతో ఆయన మిలాఖత్ అయ్యారు. కాబట్టే, పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదు. ప్రాంత దళారీ బూర్జువా వర్గ ప్రయోజనాలకు అనువైన అభివృద్ధి నమూనాను తయారుచేసే పనిలో ఆయన తనమునకలయి ఉన్నారు. దీన్ని మావోయిస్టు నమూనా అనడం ప్రజలను మోసం చేయడమే. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, భూమి పంచుతానని అనడం కూడా ఇలాంటివే.
తెలంగాణ బూర్జువా వర్గం మీద మీ విశ్లేషణ ఏమిటి?
ఈ వర్గానికి నైజాం కాలంలోనే పునాదులు ఉన్నాయి. అయితే ఇది చాలా బలహీనమైన వర్గం. గ్రామీణ ప్రాంతంలో వెట్టి, బలవంతపు శిస్తు వంటి రూపాల్లో దోచుకున్న సంపదను భూస్వామ్య వర్గం ప్రధానంగా హైదరాబాద్‌లో తమ విలాసాలకు వాడేది. పోగా మిగిలిన మొత్తాన్ని పట్టణాల్లో రంపపు మిల్లులు, గూన పెంకులు వంటి చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టేది. 1940ల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల పల్లెల్లో ఉండలేక పట్టణాలకు ఈ వర్గం పారిపోయింది. అప్పటినుంచి పరిశ్రమల నిర్వహణ క్రమం వేగం పుంజుకుంది. కల్లు వ్యాపారం, చక్కెర పరిశ్రమలు, ద్రాక్ష తోటల్లో పెట్టుబడులు పెడుతూ 1980, 90లలో బలమైన ప్రాంతీయ బూర్జువా వర్గంగా సంఘటితమైంది. 2000 తర్వాత తమ ప్రాంతం మీద అధికారానికి ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ క్రమంలో కోస్తా, రాయలసీమ పెట్టుబడిదారులతో ఈ వర్గానికి వైరుధ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఈ వర్గం నిర్వహిస్తున్న పాత్ర ఇదే. అందులోభాగంగానే ' స్వయం పాలన' అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది.
భవిష్యత్తులో తెలంగాణ-కోస్తా, రాయలసీమ ప్రాంతీయ బూర్జువా వర్గాల మధ్య సంబంధాలు, ఘర్షణలు ఎలా ఉండొచ్చు?
ఈ మూడు ప్రాంతాల దళారీ ప్రాంతీయ బూర్జువా వర్గాలు హైదరాబాద్‌పై పట్టు కోసం కొంత కాలం ఘర్షణ పడే అవకాశం ఉంది. అట్లాగే నీళ్లు విషయంలో కూడా. ఇది కొంత క్లిష్టంగా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రాంతీయ బూర్జువా వర్గం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా తన సామ్రాజ్యవాద అనుకూల స్వభావంతో దోపిడీ విధానాలే అమలు చేస్తుంది. అయితే, సామ్రాజ్యవాదులకు దోచిపెట్టే విషయంలో ఈ మూడు ప్రాంతాల దళారీ బూర్జువాలు ఐక్యమవుతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చే ప్రగతి వ్యతిరేకమైన తెలంగాణ బూర్జువా వర్గం..కోస్తా ంధ్ర, సామ్రాజ్యవాద పెట్టుబడులతో మిలాఖత్ అవుతుంది.
తెలంగాణ అనుకూల వైఖరితో బీజేపీ బలపడుతున్నది కదా?
ప్రత్యేక తెలంగాణ అనేది బూర్జువా డిమాండ్. కాబట్టి బీజేపీ సైతం ఉద్యమంలో పాల్గొంటున్నది. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు ఇస్తామని చెబుతున్నది. అయితే ఆ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు టీడీపీతో సయోధ్య పెట్టు కొని తెలంగాణ డిమాండ్‌ను పదిహేనేళ్లు ఆ పార్టీ దాటవేసింది. అనేక పార్టీలు తలపడుతున్న ఈ తరుణంలో తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా రంగం మీదికి వస్తుందని, అధికారం సాధిస్తుందని అనలేం. అయితే ఇటీవల దాని పునాది పెరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న తెలుగు ప్రజలను ఏ విధంగా విప్లవంలో భాగస్వాములను చేస్తారు?
తెలంగాణ, కోస్తా-రాయలసీమ ప్రజలకు దళారీ బూర్జువా వర్గం, సామ్రాజ్యవాదాలే ప్రధాన శత్రువులు. భూ సంస్కరణలు, నిర్వాసిత సమస్య, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల సమస్యలు, వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాద పెట్టుబడి వల్ల తలెత్తుతున్న సమస్యలు, దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆదివాసుల జల్ జంగల్ జమీన్..సమస్యలపై పోరాడాల్సి ఉంది. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించాలి.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏమంటారు?
ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో అవినీతి, మహిళలకు రక్షణ లేకపోవడం, అధిక ధరలు వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు దీనికి మినహాయింపుగా ఉన్నా ఈ ధోరణి దేశ వ్యాప్తంగా వ్యక్తం కానుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేత మహేంద్రకర్మ మరణం తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలను ఎలా అంచనా వేస్తున్నారు?
మహేంద్ర కర్మ మరణం తర్వాత బస్తర్‌లో బీజేపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. బస్తర్‌లో ప్రత్యేకంగా ఒక రోజు ఎన్నికలు జరిపారు. భారీగా బలగాలను మోహరించి పోలింగ్ నిర్వహించారు. గతంలో ఒక్క కశ్మీర్‌లోనే ఇంతటి మోహరింపును చూశాం. జనతన సర్కార్ (మావోయిస్టు విప్లవ ప్రభుత్వం) పనిచేస్తున్న గ్రామాల్లో ఎక్కడా ప్రజలు పోలింగ్‌లో పాల్గొనలేదు. కానీ, 75 శాతం పోలింగ్ జరిగిందని సీఎం రమణ్‌సింగ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రమంతటా రిగ్గింగ్ భారీగా జరిగింది. కాబట్టి రమణ్‌సింగ్ అభివృద్ధి పథకాల విజయంగా ఈ ఎన్నికలను మా పార్టీ చూడటం లేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణమై..కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు అందితే
కృష్ణా జలాలు రాయలసీమకు అందుతాయనే వాదన ఉంది. ఇది సాధ్యమేనా?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణమైతే రాయలసీమ నీటి సమస్య పరిష్కారమవుతుందని అనుకోవడం చాలా పెద్ద పొరబాటు. రాయలసీమకు అందాల్సిన కృష్ణా నీరు అందకపోవడానికి కోస్తా ప్రాంత పాలకవర్గాలే కారణం. అనేక వంచనలతో, కుట్రలతో రాయలసీమకు నీరు రాకుండా అన్యాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్నందున కృష్ణా జలాల విషయంలో రాయలసీమ, తెలంగాణల మధ్య కూడా పరిష్కారం సాధించాల్సి ఉంది. దీనికి ప్రజాస్వామిక పద్ధతులను పాటించాలి. పోలవరం వల్ల ఖమ్మం తదితర ప్రాంతాల్లో వందలాది ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురవుతాయి. వాళ్లను నాశ నం చేసి నిర్మించే పోలవరం వల్ల కృష్ణా డెల్టాకు లాభం తప్ప రాయలసీమకు మేలు జరగదు. పర్యావరణ సమస్య వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరుగుతుంది.
ఆదివాసీ ప్రాంతంలోని వనరులు దోచుకపోవడానికి, తీర ప్రాంతంలో స్థాపిస్తున్న పరిశ్రమలకు నీటి సౌకర్యం కోసం, రవాణా మార్గం కోసం ఈ ప్రాజెక్టును తలపెట్టారు. కేవలం డెల్టా ప్రాంతాల నీటి స్థిరీకరణకే ఆచరణలో ఇది ఉపయోగపడుతుంది. బ్రిజేష్‌కుమార్ నివేదిక..ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు నీటి విషయంలో కొంత అనుకూలంగా ఉంది. బూర్జువా వ్యవస్థలో ఏ కమిషన్ అయినా వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు చేయలేదు. అయితే రాయలసీమకు సంబంధించినంత వరకు బచావత్ ట్రిబ్యునల్ కంటే బ్రిజేష్‌కుమార్ నివేదిక కొంత మేలు చేస్తుంది.
విభజన సందర్భంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనల గురించి ఏమంటారు?
ప్రాంతీయ అసమానతలనేవి పెట్టుబడి సహజ లక్షణం. తెలంగాణ విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన కలగడానికి ఈ దళారీ పెట్టుబడిదారీ అభివృద్ధి విధానాలే కారణం. నీటి పంపకంలో రాయలసీమ ప్రజలకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ కంటే ఎక్కువగా ఈ ప్రాంతమే ఇబ్బంది పడుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణా జలాల్లో సీమకు న్యాయమైన వాటా అందివ్వాలి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో ప్రజాస్వామిక శక్తులు పుంజుకొని.. తెలంగాణకు మద్దతు ఇస్తూనే సీమ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ శక్తులే క్రమంగా ప్రత్యేక రాయలసీమ దిశగా ద్రుఢంగా సాగాల్సి ఉంది. ఇలాంటి న్యాయమైన ఉద్యమాలకు మా పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా ఈ ప్రాంతం తీవ్రమైన వెనుకబాటుతనానికి గురైంది. అక్కడి సముద్ర తీర ప్రాంత వనరులతో పాటు అన్ని వనరులనూ కోస్తా ప్రాంత దళారీ వర్గాలు కొల్లగొడుతున్నాయి. భారీగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. దీనిపై మా పార్టీ పోరాడుతున్నది.
- See more at: http://www.andhrajyothy.com/node/47814#sthash.AX9ibiP8.dpuf

చంద్రబాబుకి అవినీతి పేటెంట్ : బొత్స

చంద్రబాబు అవినీతికి పేటెంట్ తీసుకున్నారు : బొత్స

Published at: 30-12-2013 15:48 PM
 New  0  0 
 
 

హైదరాబాద్, డిసెంబర్ 30 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పేటెంట్ తీసుకున్నారని, అవినీతిని పెంచి పోషించింది బాబేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నిన్న తిరుపతిలో చంద్రబాబు కాంగ్రెస్‌పై చేసిన వ్యాక్యలపై స్పందించిన ఆయన సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి నిర్మూళకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని అన్నారు. అవినీతి నిర్మూలన కోసం లోక్‌పాల్ బిల్లు తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని ఆయన తెలిపారు.
చంద్రబాబు నాయుడు రామబాణం కాదని, భస్మాసుర హస్తమని బొత్స తీవ్రస్థాయిలో విమర్శించారు.  రాజకీయాలతో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజల సొమ్మును చంద్రబాబు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వస్తే కోర్టులకు వెళ్లి విచారణలు జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని బొత్స అడిగారు. రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు చంద్రబాబు సంపాదించారని రాష్ట్రం కోడై కూస్తోందని ఆయన అన్నారు. అవినీతిని రూపుమాపుతానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నీతికి మారు పేరు అయినట్లు చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యకరమని అన్నారు.
కాంగ్రెసు అధికారం కోసం చూడలేదని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసిందని బొత్స అన్నారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరునే మర్చిపోయిందని ఆయన ఆరోపించారు. జనవరి 3వ తేదీన తన ఆస్తులను ప్రకటిస్తానని బొత్స స్పష్టం చేశారు. తమ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళతానంటే సంతోషమేనని ఆయన పేర్కొన్నారు. బహిరంగంగా బస్సు టిక్కెట్ల అమ్మకాలను అడ్డుకోకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని బొత్స సత్యనారాయణ అధికారులకు హెచ్చరించారు. ఆరోపణలు రుజువయితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని
- See more at: http://www.andhrajyothy.com/node/48573#sthash.yJkwQAx5.dpuf

విభజనకు కిరణ్, బాబు పరోక్ష సహకారం : జగన్

విభజనకు కిరణ్, బాబు పరోక్ష సహకారం : జగన్

Published at: 30-12-2013 20:55 PM
 New  0  0 
 
 

పుంగనూరు,డిసెంబర్ 30: రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సహకరిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం ఆయన పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చౌడేపల్లె, పుంగనూరుల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తిరుపతిలో ఆదివారం ప్రజాగర్జనలో మాట్లాడిన చంద్రబాబు నోటి వెంట సమైక్యాంధ్ర అన్న మాటే వినిపించలేదని జగన్ విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా చంద్రబాబు పాల్గొనలేదని గుర్తు చేశారు. చంద్రబాబుకు విశ్వసనీయత అంటే అర్ధం తెలియదన్నారు. పుంగనూరు సభలో జగన్ ప్రసంగం యావత్తూ చంద్రబాబుపై ఆరోపణాస్త్రాలు సంధించడంతోనే సాగిపోయింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పలు తప్పులు చేశారంటూ పలు అంశాలను ప్రస్తావించారు.
1978లో రాజకీయాల్లో ప్రవేశించినపుడు చంద్రబాబు కుటుంబ ఆస్తి కేవలం రెండున్నర ఎకరాలని, నేడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈనాడు సంస్ధ హైదరాబాదు నడిబొడ్డున గోల్ఫ్ కోర్సు మైదానం కోసం 530 ఎకరాల ప్రభుత్వ భూమిని సింగిల్ టెండర్ ఆమోదించి ధారాదత్తం చేసిన చంద్రబాబును సీబీఐ కనీసం విచారణకు కూడా పిలవలేదన్నారు. ఊరూపేరూ లేని ఐఎంజీ భారత్ అనే సంస్థకు క్యాబినెట్ అనుమతి కూడా లేకుండా అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హైదరాబాదులో 830 ఎకరాలు కేటాయించారని, దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించినా సీబీఐ నోటీసు కూడా జారీ చేయలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్వయంగా రాసిన లేఖలో తన అల్లుడు చంద్రబాబంత అవినీతిపరుడు దేశంలోనే మరెవరూ లేరని ఆరోపించలేదా అని ప్రశ్నించారు. అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టులు చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అంటూ ఏకంగా పుస్తకాలే ప్రచురించలేదా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌తో కుమ్మక్కై తనను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుపాలు చేసిన చంద్రబాబు పాపం ఊరికే పోదని, మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయాక చంద్రబాబు కూడా జైలుపాలు కాకతప్పదని హెచ్చరించారు. ఎన్నికల కోసం చంద్రబాబు తప్పుడు హామీలిస్తున్నారన్నారు.గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను చంద్రబాబు ఏనాడూ అమలు పర్చలేదన్నారు.ఎన్టీఆర్ 2రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు బియ్యం ధరను రూ. 5.25కు పెంచారన్నారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేదాన్ని ప్రకటిస్తే చంద్రబాబు దాన్ని అధోగతిపాల్జేయడంతోపాటు గ్రామగ్రామానా బెల్టు షాపులు తెచ్చారని ఆరోపించారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు భిన్నంగా వైసీపీ రాష్ట్ర సమైక్యత కోసం నిరంతరం పోరాటం సాగిస్తోందన్నారు. విడిపోతే రాష్ట్రం ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే బోరు వేస్తే వేయి అడుగులు దాటినా నీరు పడడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం రెండుగా విడిపోతే రైతులు మరిన్ని ఇబ్బందులకు గురి కావాల్సివస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేవారినే ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాధరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి,లిడ్‌క్యాప్ మాజీ ఛైర్మన్ ఎన్.రెడ్డెప్ప, వైసీపీ నేతలు మిధున్‌రెడ్డి, రోజా, జింకా వెంకటాచలపతి, ఉదయ్‌కుమార్, వెంకటరెడ్డి యాదవ్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.కాగా సోమవారం ఉదయం జగన్ చౌడేపల్లెలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం కొండామర్రి, లద్దిగం గ్రామాల్లో కూడా వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. లద్దిగంలో ఆంజప్ప కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత చారాల, భగత్‌సింగ్ కాలనీ, చింతమాకులపల్లె, పుదిపట్ల గ్రామాల మీదుగా పుంగనూరు చేరుకుని బహిరంగసభలో పాల్గొన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/48597#sthash.Xcg3vzPL.dpuf

Sunday 29 December 2013

Sonia too wants to review Adarsh call

Sonia Gandhi too wants Maharashtra to review Adarsh call

TNN Dec 29, 2013, 04.01AM IST
(Sonia told reporters, "That…)
NEW DELHI: Early reversal of Maharashtra Cabinet's decision to reject the Adarsh probe report indicting senior Congress leaders seems certain withSonia Gandhi on Saturday saying that the issue will be resolved.
Sonia told reporters, "That has been decided yesterday and I think it is going to be resolved." She was asked about the fate of the Adarsh report, a day after Rahul Gandhi said the issue should be reconsidered.
The Congress vice-president on Friday told a news conference that he disagreed with the state Cabinet's decision to nix the report that has indicted former chief minister Ashok Chavan and Union home minister Sushilkumar Shinde.
With Maharashtra CM Prithviraj Chavan by his side, Rahul ticked off the state and made it clear there was no question of protecting any leader.
The surprise rebuke came when Rahul, telling reporters about the decisions taken at the meeting with Congress CMs on ways of combating corruption, was asked about the contradiction between his objectives and the Maharashtra government's decision on Adarsh scam.
For Congress, the reversal of the decision on Adarsh report would be a volte-face after it insisted that there was nothing wrong in Cabinet decision to reject the report. But the fact that the state's hand is being forced by Congress's heir imminent, it is hoped, would help dent the negative perception about Congress on the corruption front.
Rahul's public rebuke on Adarsh comes after he similarly disapproved of the ordinance on convicted legislators by calling it "complete nonsense" on September 27.
The Union Cabinet, which had cleared the ordinance, then met again to recall it.
Rahul has since taken the lead in positioning himself as the voice pushing for Lokpal bill and six other legislations that he said would form the "framework" to fight graft.
With the party flagging corruption as a focus area in the recent months, Sonia told reporters, "I would ask the media to please look at other states led by other parties also, something about corruption ... among their (other parties') own friends and particularly among some of their ministers."
"Look at us by all means and point out our mistakes but look at others also," she said after the Congress's foundation day function at AICC headquarters, adding the UPA government has already ensured the passage of the Lokpal bill and is committed to curb corruption.

చర్చను బహిష్కరించండి : బి.లక్ష్మణరెడ్డి

చర్చను బహిష్కరించండి : బి.లక్ష్మణరెడ్డి

Sakshi | Updated: December 30, 2013 03:13 (IST)
 విజయవాడ, న్యూస్‌లైన్: అసెంబ్లీలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై జనవరి 3వ తేదీ నుంచి జరిగే చర్చను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ బి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం జరిగిన సమైక్య కళాభేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించడమంటే విభజనకు అంగీకరించడమేనని చెప్పారు. ఈ చర్చలో సమైక్యాంధ్రను కోరుకునే శాసనసభ్యులు ఎవరూ పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యతకే కట్టుబడి ఉంటే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. శాసనసభ్యులంతా సమైక్యత కోరుతూ రాష్ట్రపతి, స్పీకర్, సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు పంపాలన్నారు.

  రాష్ట్ర విభజన వలన ఎదురయ్యే నష్టాలను కళారూపాల ద్వారా ప్రజలకు వివరించేందుకు సీమాంధ్రలోని అన్ని మండల కేంద్రాల్ల్లో జనవరి 3నుంచి ‘ సమైక్య కళాభేరి’ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరెడ్డి చెప్పారు. నెలరోజులపాటు జరిగే ఈ కళాభేరిలో 128 మంది కళాకారులు 13 బృందాలుగా వీధి నాటకాలు, కోలాటం ప్రదర్శన, పల్లెసుద్దులు, జానపద నృత్యాలతో సమైక్యవాదంపై గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తారన్నారు.

మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

బిల్లుపై చర్చను బహిష్కరించండి

Sakshi | Updated: December 24, 2013 01:59 (IST)
బిల్లుపై చర్చను బహిష్కరించండి
 సమైక్యాన్ని కోరుకునే ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
 చర్చలో పాల్గొంటే విభజనకు సహకరించినట్టే అవుతుంది
 మీ వాదనను మీరే వ్యతిరేకించినట్టు అవుతుంది: జస్టిస్ లక్ష్మణరెడ్డి
 విభజనను వ్యతిరేకించేవారంతా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలి
 

 సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే ప్రజాప్రతినిధులంతా అసెంబ్లీలో విభజన బిల్లుపై జరిగే చర్చను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. కేవలం విభజన కోసం ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చలో పాల్గొనడమంటే విభజనకు అంగీకరించినట్టే అవుతుందని స్పష్టం చేశారు. తీర్మానంపై ఓటింగ్ అంటూ ముఖ్యమంత్రి చెబుతున్న మాటలన్నీ బూటకమని మండిపడ్డారు. కావాలంటే విభజన కావాలా.. వద్దా అంటూ ఒక తీర్మానం తీసుకువచ్చి ముందు దానిపై ఓటింగ్ చేపట్టాలని, అందులో మెజారిటీ సభ్యులు విభజనకు అంగీకరిస్తే అప్పుడు బిల్లుపై చర్చ చేపట్టాలని సూచించారు. విభజనను వ్యతిరేకించే ఎమ్మెల్యేలంతా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలన్నారు.
వేదిక సభ్యుడు పి.రాంబాబుతో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని తెలుగు ప్రజావేదిక కార్యాలయంలో లక్ష్మణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘బిల్లుపై ఓటింగ్ పెడతామని ముఖ్యమంత్రి చెబుతోందంతా నాటకమే. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకమని మేం భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని కలిపి ఉంచాలా, విడదీయాలా అన్న క్లాజు ఈ బిల్లులో ఎక్కడైనా ఉందా? అలా ఉంటే దానిపై ఓటింగ్ పెట్టినా, సవరణలు పెట్టినా అర్థం ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేదు కాబట్టి చర్చలో పాల్గొంటే ఆత్మహత్యాసదృశమే అవుతుంది. విభజన ఎలా జరపాలన్నదే ఈ ముసాయిదా బిల్లు ముఖ్య ఉద్దేశం. అసెంబ్లీల్లో తీర్మానం లేకుండా రాష్ట్రాలను విభజించే హక్కు కేంద్రానికి లేదు అని వాదిస్తున్నప్పుడు చర్చలో పాల్గొనడమంటే అది విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. బిల్లు తయారీతో చట్టసభలకు జరిగిన అవమానాన్ని ఎత్తిచూపకుండా.. బిల్లు గురించి చర్చించడమంటే అర్థమేంటి? అలా చేస్తే బిల్లుకు సహకరించినట్టే అవుతుంది. మీ వాదన బలహీనపడుతుంది. విభజనే అంగీకారయోగ్యం కాదన్నప్పుడు బిల్లుపై చర్చించడం అంటే మీ వాదనను మీరే వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంటుంది’’ అని లక్ష్మణరెడ్డి అన్నారు.
ముసాయిదా బిల్లుపై జరిగే చర్చను సమైక్యవాదాన్ని బలపరిచే శాసనసభ్యులందరూ బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యవాద తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి గెలిపించుకోవటానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. ‘‘విభజన కావాలా వద్దా అని తీర్మానం తీసుకురండి. కావాలంటే దానిపై ఓటింగ్ పెట్టండి. ఆ తీర్మానంలో మెజారిటీ సభ్యులు విభజనకు అంగీకరిస్తేనే అప్పుడు చర్చలో పాల్గొనవచ్చు. అలా లేకుండా నేరుగా బిల్లుపై చర్చలో పాల్గొనడమంటే అంత కంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఇప్పుడు విభజన చర్చలో పాల్గొని రేప్పొద్దున సుప్రీంకోర్టులో ఏమని వాదిస్తారు?’’ అని నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు.

 ప్రజల అభిమతానికి అనుగుణంగా నడుచుకోవాలి

 ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా అసెంబ్లీలో సమైక్యవాణిని వినిపించాలని లక్ష్మణరెడ్డి కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ ప్రజల అభిమతానికి అనుగుణంగా శాసనసభలో నడుచుకోవాలన్నారు. ‘‘మనం ఇటీవలే ఢిల్లీలో చూశాం. అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించారంటే అది అక్కడున్న 5 లక్షల మంది తెలుగువారి ధృ డమైన అభిప్రాయం వల్లే సాధ్యమైంది. ఇక్కడుండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రతినిధులు కూడా దీన్ని గమనించి ఇక్కడి ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలి. అప్పుడే వారికి భవిష్యత్తు ఉంటుంది’’ అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలే సుప్రీం అన్నారు. ‘‘చట్టసభలే సుప్రీం. ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక వ్యవస్థ) కాదు. ఏ చట్టసభలో తీర్మానంపై చర్చించకుండా విభజనపై నిర్ణయం తీసుకునే ప్రభుత్వానికి అధికారం లేదన్నదే మా వాదన. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో చెబుతాం’’ అని స్పష్టం చేశారు.

3 నుంచి సమైక్య కళాభేరి

విభజనతో కలిగే నష్టాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి సీమాంధ్రలో సమైక్య కళాభేరిలను నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. అన్ని మం డల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామన్నారు. 120 మంది కళాకారులతో కూడిన 13 కళా బృందాలు కోలాటం, జానపదం, నృత్యనాటికలు, వీధి నాటికలతో పలు కళారూపాలను ప్రదర్శించనున్నాయని తెలిపారు.
 

బిల్లుపై చర్చ.. భారత్-పాక్ మ్యాచే

బిల్లుపై చర్చ.. భారత్-పాక్ మ్యాచే

Published at: 30-12-2013 06:19 AM
 New  0  0 
 
 

ప్రజలంతా టీవిలకు అతుక్కుపోతారు
చర్చ కోసం పక్కా ప్రణాళిక సిద్ధం
సీమాంధ్రులకు అన్యాయం, అవమానం
తడిగుడ్డతో కాంగ్రెస్ మా గొంతు కోసింది
పార్టీలో ఇక మాకు భవిష్యత్తు లేదు
మీట్ ద ప్రెస్‌లో సీమాంధ్ర ఎంపీలు
తప్పుల తడక బిల్లును ఆమోదించవద్దు
సభ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోండి..
రాష్ట్రపతికి విన్నపం
విభ జన బిల్లు ఏకపక్షం.. ప్రణబ్‌తో సీమాంధ్ర బీజేపీ నేతలు
హైదరాబాద్, డిసెంబర్ 29: 'విభజన బిల్లుపై చర్చ జరగాలి.. లాభ నష్టాలపై నిజానిజాలు ప్రజలకు తెలియాలి' అని కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు పేర్కొన్నారు. మెజారిటీ సభ్యులు బిల్లును తిరస్కరిస్తే విభజనపై రాష్ట్రపతి కూడా ముందుకు వెళ్లరని అభిప్రాయపడ్డారు. తమతో మాట మాత్రమైనా చెప్పకుండా కేంద్రం హఠాత్తుగా నిర్ణయం తీసుకుందని, సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం, అన్యాయాన్ని సహించలేకే రాజీనామాలు చేశామని వివరించారు. వాటిని తిరస్కరించడంతో యూపీఏపై అవిశ్వాస తీర్మానం పెట్టి తిరుగుబాటు చేశామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చివరివరకూ పోరాడతామని ముక్తకంఠంతో చెప్పారు. ఎవరేమన్నారో వారి మాటల్లోనే...
వాస్తవాలు తెలిసేలా చర్చిద్దాం: ఉండవల్లి అరుణ్‌కుమార్
రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగితేనే ఇరు ప్రాంతాల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వీలవుతుంది. అవసరమైతే చర్చకు మరింత సమయం కావాలని రాష్ట్రపతిని అడగవచ్చు. జనవరి 3నుంచి అసెంబ్లీలో బిల్లుపై చర్చ జరగాలి. మేమేదో తెలంగాణ ప్రజలను దోచేస్తున్నామని అంటున్నారు. బిల్లుపై వివరణాత్మకంగా మాట్లాడితే వాస్తవాలేమిటో వారికి తెలుస్తాయి. ప్రతి సభ్యుడూ.. నేను ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అని మొదలు పెట్టి... అరగంటో, గంటో కారణాలు వివరించాలి. అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నాను అంటూ ముగించాలి. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మొత్తం సమాచారం నా వద్ద ఉంది. ఏ సభ్యుడు ఏ అంశంపై మాట్లాడాలో చెబుతాం. దానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాం. చర్చ మామూలుగా ఉండదు. భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లా ఉంటుంది. ప్రజలంతా టీవీలకు అతుక్కుపోతారు. ఈ ఒక్కసారి పార్టీ భేదాలను పక్కన పెడదాం. జనవరి 23 తర్వాత మళ్లీ తిట్టుకుందాం కానీ ఇప్పుడు మాత్రం మన మధ్య పొరపొచ్చాలు వద్దు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారని మాపై విమర్శలు చేస్తున్నారు. మేం ఎప్పుడూ వేరే పార్టీలోకి వెళ్లలేదు. అప్పట్లో ప్రధాని స్థాయిలో ఇందిరాగాంధీ అనుసరించిన విధానాన్ని, నడిచిన పద్ధతినే మేమూ అనుసరిస్తున్నాం. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌లో మాకు భవిష్యత్తు ఉండదనే పార్టీకి రాజీనామాలు చేశాం. రాష్ట్ర విభజన జరిగితే ఏదో లాభం జరుగుతుందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కానీ విభజనతో సీమాంధ్ర కంటే తెలంగాణే ఎక్కువ నష్టపోతుంది. ఇదే విషయాన్ని మనం అసెంబ్లీలో విపులంగా చెప్పగలగాలి.
చివరివరకూ పోరాటం: రాయపాటి సాంబశివరావు
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం అన్యాయం. ఎంపీలకు చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారింది. మళ్లీ అక్కడ కాంగ్రెస్ రాదు. నేను అమెరికాలో ఉన్నప్పటికీ అక్కడి నుంచే రాజీనామా పంపించా. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చివరి దాకా పోరాడుతాం. నూటికి నూరుపాళ్లు కృషి చేస్తాం. నిజానికి అధికార పార్టీకి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులే సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 60 శాతం ప్రజలకు రాష్ట్ర విభజన ఇష్టం లేదు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మా వంతు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తారు.
బానిసలం కాదు కాబట్టే తిరుగుబాటు: హర్షకుమార్
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం మమ్మల్ని, సీమాంధ్ర ప్రజలను ఘోరంగా అవమానించింది. మమ్మల్ని బానిసల్లా చూస్తోంది. అందుకే అధిష్ఠానంపై తిరుగుబాటు చేశాం. మాతో కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండా కేంద్రం ఏకపక్షంగా విభజనను చేపట్టింది. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి వచ్చింది. మా పదవులకు రాజీనామా చేస్తే వాటిని ఆమోదించకుండా స్పీకరుపై కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చింది. అధిష్ఠానం విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందే రాజీనామాలు చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. నిజానికి విభజన జరుగుతుందని మేం నమ్మలేదు. పత్రికల్లో వస్తున్న కథనాలపై అధిష్ఠానాన్ని అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పింది. సీఎంతో మాట్లాడినప్పుడు కూడా తనకు అలాంటి సమాచారం లేదన్నారు. హఠాత్తుగా ఒక రోజు... రాష్ట్రాన్ని విభజించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో దిగ్విజయ్ సింగ్ చెప్పారు. మేం ద్రిగ్భాంతికి గురయ్యాం. అక్కడే ఆయనపై తిరుగుబాటు చేశాం. అధిష్ఠానం మమ్మల్ని మోసం చేసింది. 2004లోనే రాష్ట్ర విభజనకు నేను మద్దతు పలికాను. హైదరాబాద్, నదీ జలాలపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తర్వాత విభజన చేయాలని కోరాను. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగింది. మా పోరాటాన్ని, ఆందోళనను కొందరు డ్రామాలుగా అభివర్ణిస్తున్నా, చివరికి అర్థం చేసుకుంటారు.
కేంద్రానిది రాక్షస క్రీడ: సబ్బం హరి
ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తోంది. ఇందులో ఏమాత్రం సందేహ లేదు. దీన్ని అడ్డుకునే ప్రయత్నాలను కేంద్రంసహించలేకపోతుంది. ఇక్కడున్న సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టింది. కేంద్రం ఇంత రాక్షస క్రీడ ఆడనవసరం లేదు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విభజించడం ద్వారా దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని ప్రజలకు ఒక సందేశం పంపాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో 30-50 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని చూస్తోంది. దీనికి ఏపీని పావుగా ఎంచుకుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ రెండు మూడేళ్ల క్రితమే ప్రారంభించి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. ఆ చర్చల ప్రక్రియలో సీమాంధ్ర ప్రజలు విడిపోవడానికి సిద్ధ పడి ఉండేవారేమో? లేకపోతే తెలంగాణ ప్రజలు కలిసి ఉండటానికి ఇష్టపడి ఉండేవారేమో? కానీ, ఇందుకు భిన్నంగా ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం రాజకీయ లబ్ధికోసం కాకపోతే మరేమిటి? అయితే నిజమైన సమైక్యవాదులెవరో, విభజనవాదులెవరో అర్థం కాకుండా ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. లై డిటెక్టర్‌తో అసలైన వారిని గుర్తించే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
చర్చతోనే తేలుతుంది: లగడపాటి రాజగోపాల్
బిల్లుపై చర్చ జరగాలి. అప్పుడే సమైక్య రాష్ట్రంలో ఎవరు లాభపడ్డారో, ఎవరు నష్టపోయారో తేలుతుంది. అ తర్వాత ఓటింగ్ జరగాలి. మెజారిటీ అభిప్రాయం ప్రకారమే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడిదారుల ఉద్యమంగా సమైక్య ఉద్యమాన్ని అభివర్ణిస్తున్నారు. కానీ, ఇది తెలుగుతల్లి గర్భం నుంచి పుట్టిన ఉద్యమం. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందో లేదో తెలియకపోయినా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు తమ కొంప ముంచారన్న ఆక్రోశం ప్రజల్లో పెల్లుబుకుతోంది. సీమాంధ్రలోనే కాదు, కరీంనగర్, వరంగల్‌లో కూడా కలిసి ఉండాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది. కానీ, విభజనవాదులు దౌర్జన్యంతో అలాంటివారి గొంతు నొక్కేస్తున్నారు.
తడిగుడ్డతో మా గొంతు కోసింది
పార్టీ తీరుపైమీట్ ద ప్రెస్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల ఆవేదన
(హైదరాబాద్, ఆంధ్రజ్యోతి) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన దరిమిలా ప్రస్తుతం రాష్ట్రంలో ఎటుచూసినా ఆ బిల్లుపైనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో 'ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం(ఏపీజేఎఫ్)' ఆధ్వర్యంలో ఆదివారం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై ఎంపీల స్పందనలు...
విభజన అనివార్యమైతే సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు మీ రోడ్ మ్యాప్ ఏంటీ?
ఉండవల్లి: అసెంబ్లీలో చర్చ ముగిసే జనవరి 23 వరకు రోడ్డు లేదు, మ్యాపూ లేదు. అసెంబ్లీలో చర్చను చేపట్టి ఎందుకు విభజన వద్దో సహేతుక కారణాలను ఎమ్మెల్యేలు చూపాలి. మెజారిటీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తే, ఈ బిల్లుపై రాష్ట్రపతి సుప్రీం కోర్టును సంప్రదిస్తారు.
మీవి డ్రామాలని అంటున్నారు ?
ఉండవల్లి: డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌పార్టీ తడిగుడ్డతో మా గొంతులు కోసింది. విభజన ఆపకపోతే పార్టీలో మాకు భవిష్యత్తు లేదు. మేమంతా ఐక్యంగా ఉండడానికి... అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలిసి చస్తే కదా... !
రాజీనామాలతో విభజనను ఎందుకు ఆపలేకపోయారు ?
ఉండవల్లి: మేం రాజీనామా చేశాం. కొంత మంది చేయలేదు.
విభజన వద్దంటూ వైసీపీ అఫిడవిట్లు ఇచ్చింది... చర్చలో పాల్గొంటే విభజనకు సహకరించినట్లేనని చెబుతోంది.
ఉండవల్లి: అఫిడవిట్లు ఇవ్వడం, కోర్టుల్లో దాఖలు చేయడం కాదు. ముందుగా బిల్లుపై చర్చ జరగాలి, మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించాలి.
విభజనపై ఎవరి వాదన వారిదే. కానీ ఇరు ప్రాంతాల నేతలు(కేటీఆర్, సీఎం) కరచాలనం చేసుకుంటున్నారు. అసలు సీమాం«ద్రుల సంగతి ఏమిటి ?
లగడపాటి: ఎవరు ఏమిటో ప్రజలకు తెలియడానికే అసెంబ్లీలో చర్చ జరగాలంటున్నాం. విభజన వాదులు అందరిని ద్వేషిస్తారు. సమైక్యవాదులు అందరిని కలుపుకొని పోవాలని చూస్తారు. కేటీఆర్‌తో సీఎం కరచాలనం చేయడాన్ని ఆ విధంగానే చూడాలి. నేను కూడా పార్లమెంటులో కేసీఆర్‌తో కరచాలనం చేశాను.
విభజన తర్వాత కొత్త పార్టీ ఆలోచన ఏమైనా ఉందా ?
రాయపాటి: జనవరి 23 తర్వాత బిల్లు పార్లమెంటుకు వెళితే... కాంగ్రెస్‌లో మా భవిష్యత్తు క్లోజ్ అయినట్లే. విభజన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.
సరైన సమయంలో సీమాంధ్ర నేతలు స్పందించలేదన్న ఆరోపణలున్నాయి...
రాయపాటి: సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన వెంటనే మా పదవులకు రాజీనామా చేశాం. కానీ స్పీకర్ వాటిని పక్కన పెట్టారు. హైకమాండ్ చెప్పినట్లే స్పీకర్ నడుచుకుంటారు. నందమూరి హరికృష్ణ రాజీనామాను ఆమోదించారంటే ఆయన ప్రతిపక్ష పార్టీ నేత కాబట్టి ఆమోదించారు.
బిల్లుపై చర్చతో తెలంగాణవారికీ న్యాయం జరుగుతుందంటున్నారు ఎలా?
ఉండవల్లి: తెలంగాణవారు మమ్మల్ని వెళ్లిపొమ్మనడం లేదు. బాగో బాగో అంటున్నారు. మా భద్రాచలంను మాకు ఇవ్వండి అని అడిగితే... భద్రాచలం ప్రజలు తెలంగాణతోనే కలిసి ఉంటామంటున్నారని, అందుకే భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని చెబుతున్నారు. మరి మేం కూడా తెలంగాణతోనే కలిసి ఉంటామని అంటున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నాం. హైదరాబాద్‌ను యూటీ చేస్తే పన్నులు పెరుగుతాయి. రేపు ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. అందుకే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేలా యూటీ వద్దని అంటున్నాం.
విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి, ఇప్పుడు విభజన బిల్లుపై చర్చ జరగాలనడం సరైనదేనా?
లగడపాటి: అన్ని పార్టీలు అంగీకరించాయని చెప్పి బిల్లును పంపారు. కాబట్టి ఇప్పుడు తీర్మానం కాకుండా, బిల్లుపై చర్చ జరగాలని చెబుతున్నాం. చర్చ ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రజలను కూడా మార్చుకోగలం. అందరిని మార్చుకోవడానికి చర్చే పరిష్కారం.
సమైక్యవాదమంటే అందరిని దగ్గర చేసుకోవడమని చెబుతున్నారు. తెలంగాణలో వెయ్యి మందికి పైగా ఆత్మబలిదానం చేసుకుంటే వారిని ఎందుకు ఓదార్చలేదు.
లగడపాటి: సిద్ధిపేటలో హరీష్‌రావు మీడియా సాక్షిగా కిరోసిన్ పోసుకుని,అగ్గిపెట్టే కోసం వెతుక్కుంటే, ఆ ఘటన చూసిన కొన్ని గంటల తర్వాత ఎల్‌బీ నగర్‌లో శ్రీకాంత్‌చారి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేర్పాటు వాదులు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఈ కారణంగానే అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
- See more at: http://www.andhrajyothy.com/node/48302#sthash.lDiKy63S.dpuf