ఈ సోకులకు సొములెక్కడివి?
అది... ఆరంతస్తుల భారీ భవంతి!
'భవంతి' అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే... అది సాదాసీదా కట్టడం కానే కాదు! భవనంలో ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్. గోడలకు గ్రానైట్ పలకలు. గది గదికీ ఏసీ. ప్రతి గదికీ చూడచక్కటి డిజైన్‌తో ఫాల్స్ సీలింగ్. పిల్లల దుస్తులు శుభ్రం చేయడానికి వాషింగ్ మిషన్లు. అధునాతన వసతులతో బాత్రూమ్‌లు, టాయ్‌లెట్లు!

ఇవి రాష్ట్రంలోని అత్యంత ఖరీదైన కార్పొరేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన వసతులు అని అనుకుంటే పొరపడినట్లే! ఇది... పేద ముస్లిం బాలికలు, యువతులకు మత సంబంధ చదువు చెప్పేందుకు ఉద్దేశించిన 'హీరా ఇస్లామిక్ అంతర్జాతీయ కళాశాల' భవంతి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరస్వామి పాదాల చెంత... తిరుపతి సమీపంలోని తొండవాడ వద్ద వెలసిన వివాదాస్పద కట్టడం! ఒకప్పటి... తిమ్మప్ప ఆలయ పుష్కరిణి స్థలంలోనే వెలసినట్లు చెబుతున్న విలాసవంతమైన కట్టడం! 'తిరుపతిలో ఇస్లామిక్ వర్సిటీ ఏమిటి? ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా!' అనే హిందూ సంస్థల అభ్యంతరాల సంగతి సరేసరి! కానీ... పేద ముస్లిం బాలికల కోసం అత్యాధునిక వసతులను సమకూర్చి, వారికి విద్యాబుద్ధులు నేర్పించడాన్ని ప్రశంసించాల్సిందే! కానీ... భవన నిర్మాణం, వసతుల కల్పనకు కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతినెలా లక్షలకు లక్షలయ్యే నిర్వహణ వ్యయం ఎలా భరిస్తారు? పేద బాలికల నుంచి భారీగా ఫీజు వసూలు చేసే వీలే లేదే! మరి విరాళాలు సేకరిస్తున్నారా? అయితే... ఎక్కడి నుంచి? అందుకు అనుమతులున్నాయా? విద్యార్థినులకు రాత్రి బసతో కూడిన సంస్థ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? అన్నీ అనుమానాలే! ఎవరీ నౌహీరా? ఆమెకు ఎక్కడివీ సొమ్ములు? వివరాల్లోకి వెళితే...
చంద్రగిరి మండలం తొండవాడలో నిర్మించిన ఆరు అంతస్తుల హీరా కళాశాల భవనాన్ని అధునాతన వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లోరింగ్ మొదలు గోడల వరకు మొత్తం గ్రానైట్ రాయితోనే నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను తరగతి గదులకు కేటాయించారు. ఒకటి నుంచి ఐదు అంతస్తులను విద్యార్థినుల వసతికి ప్రత్యేకించారు. ఆరో అంతస్తు అతిథి గృహంగా మార్చుతున్నారు. భారీ సమావేశ మందిరం కూడా నిర్మితమవుతోంది. ఈ ఆరు అంతస్తుల్లోని ప్రతి గదిలో ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. హీరా కళాశాల నిర్మాణానికి ఇప్పటికే రూ.6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని అంచనా. ప్రస్తుతం హీరా కళాశాల కరెంటు చార్జీల బిల్లు నెలకు రూ.50 వేలు. చాలా వరకు ఏసీలను ఇంకా బిగించలేదు. మొత్తం ఏసీలు పని చేస్తే కరెంటు బిల్లే లక్షల్లో వస్తుంది. ఇక పిల్లలకు భోజనాలు, సిబ్బంది జీతాలు కలిపి నెలకు రూ.15 లక్షల వరకు నిర్వహణ వ్యయమవుతుంది. మరి ఇంత డబ్బు ఎక్కడిది?
నిజాల నిగ్గుపై హైకోర్టు ఆదేశం
హీరా ఇస్లామిక్ కళాశాలపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇటీవల హైకోర్టు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు శాఖల అధికారులతో ఓ కమిటీ వేసింది. ఈ భవనం పునాదులు ఆరంతస్తులను తట్టుకునేంత బలంగా ఉన్నాయో లేదో తేల్చాలని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ అధికారులను ఆదేశించింది. భూ ఆక్రమణలుంటే తొలగించాలని ఆర్డీవోను ఆదేశించింది. తుడా అనుమతులను అతిక్రమించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా తుడా వీసీని ఆదేశించింది. భద్రతపై తనిఖీ జరిపి ఈనెల 30 తేదీలోపు నివేదిక ఇవ్వాలని డీఎస్పీకి సూచించింది.

పేద పిల్లలకు విలాసవంతమైన భవనంలో విద్యను నేర్పే విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ... ఈ సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయడం, దీని ఏర్పాటులో అంతులేని గోప్యత పాటించడం, నిబంధనలు ఉల్లంఘించడం, నిధులపై పారదర్శకత లేకపోవడం ఇలాంటి అంశాలపైనే అందరిలోనూ సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, సంస్థ నిర్వాహకులపైనా ఉంది.
- ఆంధ్రజ్యోతి, తిరుపతి
- ఆంధ్రజ్యోతి, తిరుపతి
కళాశాల నిర్వాహకురాలిగా వార్తల్లోకెక్కిన నౌహీరా కొన్నేళ్ల క్రితం ఒక సాధారణ మహిళ. ఆమె జన్మస్థలం చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని కల్లూరు. అక్కడే వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తరువాత నివాసాన్ని తిరుపతికి మార్చారు. రేణిగుంట రోడ్డులో మదర్సా ఏర్పాటు చేసింది. 2004లో 'మదర్సా ఈ నిష్వాన్ ఈషా అతుల్ ఇస్లాం ఉర్దూ అండ్ అరబిక్ డెవలప్‌మెంట్ సొసైటీ' పేరుతో ఒక సంఘాన్ని రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నౌహీరా గల్ఫ్ దేశాలకు వెళ్లి... మూడేళ్ల క్రితమే తిరిగొచ్చారు. వచ్చీరాగానే... తిరుపతికి సమీపంలోని తొండవాడ వద్ద పేద విద్యార్థినుల విద్య కోసం భారీ స్థాయిలో 'విశ్వవిద్యాలయ' నిర్మాణానికి పూనుకున్నారు.
దీనికి నిధులు ఎక్కడివన్న ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం లేదు. ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు నిధులు అందలేదు. చుట్టుపక్కల విరాళాలు సేకరించిన దాఖలాలు లేవు. పోనీ... బడాబడా వ్యక్తులు లక్షలకు లక్షలు విరాళాలు ఇచ్చారనుకుంటే, ఈ సంస్థకు అందించే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లేదు. విదేశాల నుంచి సేకరించేందుకు... ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగులేషన్ యాక్టు(ఎఫ్‌సీఆర్ఏ) కింద ఈ సంస్థ రిజిస్టర్ కాలేదు. 'నా సొంత నిధులతోనే కళాశాల భవంతి నిర్మిస్తున్నాను' అని నౌహీరా చెబుతున్నట్లు సమాచారం! సాధారణ మహిళగా కొన్నేళ్లు గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన ఆమెకు ఇన్ని కోట్లు ఎక్కడివన్న ప్రశ్నకు సమాధానాల్లేవు. హైదరాబాద్ సహా వివిధ దేశాల్లో వజ్రాల వ్యాపారాలు ఉన్నట్లు నౌహీరా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈమె వ్యాపారాలపై అనుమానాలున్నాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కూడా జరుగుతోంది.
బోర్డు తిప్పేశారు
ఆదివారం వరకు 'హీరా అంతర్జాతీయ ఇస్లామిక్ కళాశాల' అని ఉన్న బోర్డును ఇప్పుడు మార్చేశారు. సోమవారం పాత బోర్డుకు తెల్ల రంగు పూశారు. మంగళవారం దీనిని 'మదర్సా ఈ నిషాన్ ఈషా అతుల్ ఇస్లాం ఉర్దూ అండ్ అరబిక్ డెవలప్‌మెంట్ సొసైటీ' అని సంస్థ పేరు రాశారు.ఈ సొసైటీని 2004లోనే నౌహీరా రిజిస్టర్ చేశారు. కళాశాల రెండు రోజుల్లోనే 'మదర్సా'గా ఎందుకు మారింది? హీరా ఇస్లామిక్ కళాశాల స్థాపన వెనుక కనిపించని ఉద్దేశాలేవో ఉన్నాయనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తోంది. అన్నట్లు... బోర్డు మార్చుతున్న సమయంలో 'స్వర్ణముఖి నది సబ్ సర్ఫేస్ డ్యామ్'కు సంబంధించిన ఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు.

ఇస్లామిక్ వర్సిటీ భవనాన్ని కూల్చివేయాలని వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు మంగళవారం విజయవాడ సబ్‌కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. సంస్థకు వస్తున్న నిధులపై ఆరా తీయాలని డిమాండ్ చేశారు
అడుగడుగునా ఉల్లంఘనలే
ప్రస్తుతం తమ కళాశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నట్లు హీరా సంస్థ స్వయంగా ప్రకటించింది. ఈ భవనంలోనే హాస్టల్ వసతి కల్పించింది. 16 అడుగుల ప్రహరీ గోడతో పాటు కాపలాదార్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే... చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులకు రాత్రి బస కల్పించే సంస్థలు అందుకు తప్పనిసరిగా కలెక్టర్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. దీనికోసం తొలుత స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ... హీరా కళాశాల ఇలాంటి అనుమతి తీసుకోలేదు. హీరా కళాశాల యాజమాన్యం 'జీ ప్లస్ వన్'కు అనుమతి తీసుకుని ఆరంతస్తుల భవనం నిర్మించింది. ఈ విషయంలో అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సాధారణంగా నిర్మాణ అనుమతులు కోరితే అప్రూవల్ ఇస్తారు. కానీ, ఇక్కడ ఇస్లామిక్ కళాశాల అనుమతుల విషయంలో టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారు. 'జీ ప్లస్ సిక్స్' భవనం కడతారని ముందే తెలిసే ఇలా సాంకేతిక అనుమతి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తతంగం వెనుక లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.

No comments:
Post a Comment