ఎవరూ అంటరానివారు కాదు
మా డిమాండ్లకు అంగీకరిస్తే చాలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాల్సిందే
ఇండియా టుడే ఇంటర్వ్యూలో జగన్
మా డిమాండ్లకు అంగీకరిస్తే చాలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాల్సిందే
ఇండియా టుడే ఇంటర్వ్యూలో జగన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీతో దోస్తీకి సిద్ధమే అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 'ఎవ్వరూ అంటరానివారు కాదు. మోదీతో సహా మా ఆకాంక్షలు, డిమాండ్లను ఆమోదించే వారెవరితోనైనా చేతులు కలుపుతాం' అని ప్రకటించారు. ఇండియా టుడే గ్రూప్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్ ఈ విధంగా స్పందించారు. అదే సమయంలో... ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్థించే పార్టీలతో తాము పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. "సమైక్యాంధ్ర అనేది మా పార్టీ డిమాండ్.
ఇది ప్రజల డిమాండ్. ఈ రాష్ట్రాన్ని విభజించబోమని చెప్పే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటాం'' అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో లేని సంప్రదాయాలకు తెరతీసిందని జగన్ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం మూడు రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే వాటిని విభజించాలని నిర్ణయించుకుందని గుర్తు చేశారు. కానీ... కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోసం వేచి చూడకుండానే, విభజన నిర్ణయం తీసుకుని, దానిని బలవంతంగా ప్రజలపైకి రుద్దుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తుల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment