Monday 2 December 2013

కిరణ్ పాలన 'ఉత్తమం' :

కిరణ్ పాలన 'ఉత్తమం' :ఉత్తమ పరిపాలన అవార్డుకు ఎంపిక చేసిన ఇండియా టుడే
Published at: 01-12-2013 08:50 AM


హైదరాబాద్, నవంబర్ 30(ఆంధ్రజ్యోతి): దేశంలో ఉత్తమ పాలన అందించే రాష్ట్ర ప్రభుత్వమేదీ అనగానే అభివృద్ధిలో దూసుకుపోతున్న గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలే అందరికీ గుర్తుకు వస్తాయి. అయితే ఈ రాష్ట్రాలన్నింటిని వెనక్కినెట్టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును దక్కించుకుంది. యేటా ఇండియా టుడే అందించే ఉత్తమ పరిపాలనా అవార్డు సీఎం కిరణ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. గత ఏడాది ఈ అవార్డు గుజరాత్‌ను వరించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 20న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకుంటారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో .. పెద్ద రాష్ట్రాలను తలదన్ని ఉత్తమ పరిపాలనా అవార్డును కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దక్కించుకోవడం విశేషం. ' ది స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' అనే అంశంపై ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కిరణ్ సర్కార్ ఉత్తమ పాలన అందిస్తున్నట్లుగా తేలింది. పౌర సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలన్నింటికంటే అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లుగా వెల్లడైంది. కిరణ్ ప్రారంభించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా లబ్ధిదారుల ముంగిటకు చేరడం వల్లే ప్రగతి సాధ్యమైనట్లుగా సర్వేలో వెల్లడైంది. మహిళా, ఆడశిశువుల సాధికారత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం, మీ-సేవ, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత వంటి అంశాలు కిరణ్ సర్కార్ పాలనా దక్షతకు నిదర్శనంగా నిలిచాయని సర్వే పేర్కొంది.
- See more at: http://www.andhrajyothy.com/node/35800#sthash.peujFgjl.dpufకిరణ్ పాలనకు అవార్డే నిలువుటద్దం
Published at: 02-12-2013 05:35 AM


గుడ్ గవర్నర్ పురస్కారం గర్వకారణం..కాంగ్రెస్ నేతల అభివందనలు
విజయవాడ/హైదరాబాద్, డిసెంబర్ 1 : రాష్ట్రంలో సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ అనేక ప్రభుత్వ పథకాలతో సమర్థవంతంగా పరిపాలన అందించిన కిరణ్ పనితీరుకు ఇండియాటుడే అవార్డు నిలువుటద్దం అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, అవి కూడా తాత్కాలిక విధానంలోగాక, శాశ్వత ఏర్పాట్లు చేశారని మంత్రి పార్థసారథి అన్నారు. ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కిరణ్ సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.
ఇప్పుడు 26 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాలు పొందుతున్నారని చెప్పారు. ఇటువంటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వానికి ఇండియా టుడే 'గుడ్ గవర్నెన్స్' అవార్డు వచ్చినందుకు, ఆ మంత్రి మండలిలో ఒక సభ్యుడుగా తాను ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ రెడ్డికి కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో శాసనమండలి విప్ రుద్రరాజు పద్మరాజు, పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ మహిళలకు, యువత కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించడంతో పాటు బంగారు తల్లి లాంటి విశిష్టమైన పథకాలను చట్టబద్దం చేసిన ఘనత కిరణ్ ప్రభుత్వానికి దక్కుతుందంటూ ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని అభినందించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/36017#sthash.8PRKjIuH.dpuf

No comments:

Post a Comment