Thursday, 26 December 2013

స్పీకర్‌ కు .బుద్ధి, జ్ఞానం ఉందా? - జగన్

స్పీకర్‌ను నేను ఒకటే అడగదలచుకున్నా..బుద్ధి, జ్ఞానం ఉందా?

Published at: 27-12-2013 06:36 AM
 New  0  0 
 
 

నీకేమైనా అవగాహన ఉందా?
"లఖ్‌నవ్‌కు వెళ్లిన స్పీకర్‌ను ఒకటే అడగదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించినప్పుడు లఖ్‌నవ్‌లో ఏం జరిగింది? అన్న కనీస అవగాహన మీకుందా? కనీసం ఆ మేరకు బుద్ధి, జ్ఞానమైనా మీకుందా? అక్కడికీ ఇక్కడికీ తేడా అర్థమవుతోందా? ఆరేళ్ల పిల్లాడిని అడిగినా చెబుతాడు. ''
- జగన్
హైదరాబాద్, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): "అసెంబ్లీ స్పీకర్‌కు కనీస అవగాహన, బుద్ధి, జ్ఞానం ఉందా'' అని నాదెండ్ల మనోహర్‌పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏదో ఒక చర్చ జరిపేయాలని, రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తీసుకుపోవాలని సీఎం, స్పీకర్ తొందరపడుతున్నారని ఆరోపించారు. పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వచ్చిన తర్వాత లోటస్ పాండ్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు స్పీకర్ మనోహర్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రెండు వారాల కిందట ఇదే వేదికగా 'నేను ఓటమిని ఒప్పుకోను' అన్న జగన్.. తాజాగా "మాకు బలం తక్కువ. వాళ్ల మనసులు కరగాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా'' అని వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చామని తెలిపారు. చంద్రబాబు, కిరణ్‌ను కాదని టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమలాగే అఫిడవిట్లు సమర్పించాలని కోరారు. సీఎం కిరణ్ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఒకవైపు సమైక్యమని అంటూనే మరో వైపు విభజనకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ 56 శాఖలకు ఆదేశాలు జారీ చేశారని ధ్వజమెత్తారు. సమైక్య తీర్మానం చేయకపోతే సీఎం, ప్రతిపక్షనేత, అసెంబ్లీ స్పీకర్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు.
ఇలాంటి వారిని గెలిపించడం మన ఖర్మ అంటూ ఓటర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. చర్చ జరగాలంటూనే సమాచారం ఇవ్వరని, ఏమీ లేకుండా చర్చలని తప్పుబట్టారు. "లఖ్‌నవ్‌కు వెళ్లిన స్పీకర్‌ను ఒకటే అడగదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించినప్పుడు లక్నోలో ఏం జరిగింది? అన్న కనీస అవగాహన మీకుందా? కనీసం ఆ మేరకు బుద్ధి, జ్ఞానమైనా మీకుందా? ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించినప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది. ఉత్తరాఖండ్‌ను విభజించడానికి మాకు అభ్యంతరం లేదని ఏకాభిప్రాయంతో తీర్మానం ఆమోదించింది. ఆ తర్వాతే ఉత్తరాఖండ్ విభజించారు. మన రాష్ట్రంలో తీర్మానం సంగతి దేవుడెరుగు అని పక్కన పెట్టేశారు. దానిని ఖాతరు చేయకుండానే ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపించి చర్చ జరుపుతున్నారు. అక్కడికి ఇక్కడికి తేడా అర్థమవుతోందా? ఆరేళ్ల పిల్లాడిని అడిగినా చెబుతాడు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి విభజనను ఇప్పటికైనా అడ్డుకోలేకపోతే చరిత్ర హీనులవుతారు'' అని సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, స్పీకర్ మనోహర్‌లపై జగన్ ధ్వజమెత్తారు. టీడీపీ, కుట్రపూరిత రాజకీయ నాయకులంతా చర్చకు మొగ్గు చూపుతున్నారని, ఇది మన ఖర్మ అని అన్నారు. బిల్లుపై చర్చకు అంగీకరిస్తే విభజనకు ఆమోదించినట్లేనని వ్యాఖ్యానించారు. మొదట సమైక్యనికి అనుకూలంగా తీర్మానం చేయాలని పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. బిల్లును మనపై రుద్దే కుట్ర చేస్తున్నారని, దీనిని ఆపాల్సిందిపోయి మనమే అంగీకారం తెలిపితే ఎలా మంచి జరుగుతుందని ప్రశ్నించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/47342#sthash.IipmmshB.dpuf

No comments:

Post a Comment