హైదరాబాద్, డిసెంబర్ 30 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పేటెంట్ తీసుకున్నారని, అవినీతిని పెంచి పోషించింది బాబేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నిన్న తిరుపతిలో చంద్రబాబు కాంగ్రెస్‌పై చేసిన వ్యాక్యలపై స్పందించిన ఆయన సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి నిర్మూళకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని అన్నారు. అవినీతి నిర్మూలన కోసం లోక్‌పాల్ బిల్లు తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని ఆయన తెలిపారు.
చంద్రబాబు నాయుడు రామబాణం కాదని, భస్మాసుర హస్తమని బొత్స తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజకీయాలతో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజల సొమ్మును చంద్రబాబు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వస్తే కోర్టులకు వెళ్లి విచారణలు జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని బొత్స అడిగారు. రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు చంద్రబాబు సంపాదించారని రాష్ట్రం కోడై కూస్తోందని ఆయన అన్నారు. అవినీతిని రూపుమాపుతానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నీతికి మారు పేరు అయినట్లు చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యకరమని అన్నారు.
కాంగ్రెసు అధికారం కోసం చూడలేదని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసిందని బొత్స అన్నారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరునే మర్చిపోయిందని ఆయన ఆరోపించారు. జనవరి 3వ తేదీన తన ఆస్తులను ప్రకటిస్తానని బొత్స స్పష్టం చేశారు. తమ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళతానంటే సంతోషమేనని ఆయన పేర్కొన్నారు. బహిరంగంగా బస్సు టిక్కెట్ల అమ్మకాలను అడ్డుకోకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని బొత్స సత్యనారాయణ అధికారులకు హెచ్చరించారు. ఆరోపణలు రుజువయితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని
No comments:
Post a Comment