Sunday, 29 December 2013

ముస్లింల కోసం విద్యానిధి

ముస్లింల కోసం విద్యానిధి రూ.15వేల కోట్లతో ఏర్పాటు యోచన: కేంద్రం

Published at: 30-12-2013 08:35 AM
 New  0  0 
 
 

గువహటి, డిసెంబర్ 29: దేశంలోని ముస్లింల కోసం రూ.15వేల కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రహ్మాన్‌ఖాన్ వెల్లడించారు. అసోం రాజధాని గువహటిలో ఆదివారం భారత సంతతి అమెరికన్ ముస్లింల సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు. ముస్లింలకు సంబంధించి విద్యారంగంలో మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. భారత ముస్లింలలో కనీసం ఒక్కశాతం విరాళాలిచ్చినా ఇంత భారీ స్థాయిలో నిధిని ఏర్పాటు చేయడం సాధ్యమేనని వివరించారు. దేశంలోని ముస్లింలకు ఈ శక్తి ఉందని, కావాల్సిందల్లా నిధిని సేకరించి, నిర్వహించగల యంత్రాంగమేనని అన్నారు. దీనిపై ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్న ప్రశ్నకు- ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని, త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి బదులిచ్చారు. ముస్లింలు తమనుతాము మైనారిటీలలో భాగంగా భావించవద్దని, దేశ జనాభాపరంగా రెండో స్థానంలో ఉన్నట్లు గ్రహించాలని సూచించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/48446#sthash.YQW6fe6I.dpuf

No comments:

Post a Comment