Thursday 5 December 2013

పది జిల్లాల తెలంగాణకు ఆజాద్ సూచన

పది జిల్లాల తెలంగాణకు ఆజాద్ సూచనPublished at: 05-12-2013 11:46 AM న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : పది జిల్లాలతో కూడిన తెలంగాణనే సిఫారసు చేయాలని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ జీవోఎం సహచరులకు సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చ జరిగి అందరూ అంగీకరిస్తే రాయల తెలంగాణకు మొగ్గుచూవచ్చని, లేదంటూ కొత్తసమస్యలకు దారితీయొచ్చని ఆజాద్ తెలిపినట్లు సమాచారం. తెలంగాణ, రాయల తెలంగాణ నిర్ణయాన్ని కేబినెట్ నిర్ణయానికి జీవోఎం వదిలేసిన విషయం తెలిసిందే.
http://www.andhrajyothy.com/node/37851#sthash.rkiGA3cW.dpuf
పది జిల్లాల తెలంగాణపైనే చర్చ జరిగింది : యనమలPublished at: 05-12-2013 12:48 PM
హైదరాబాద్, డిసెంబర్ 5 : పది జిల్లాలతో కూడిన తెలంగాణపై మాత్రమే కేంద్రం రాజకీయ పార్టీలతో చర్చించిందని, ఇప్పుడు తెలంగాణతో లాభమా?...రాయల తెలంగాణతో లాభమా? అని బేరీజు వేస్తోందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. విభజన పద్దతి ప్రకారం జరగడంలేదని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేబినెట్ నిర్ణయం తర్వాత పార్టీలో చర్చించి తమ విధానం చెప్తామని యనమల రామకృష్ణుడు తెలిపారు.- See more at: http://www.andhrajyothy.com/node/37859#sthash.EcomTryJ.dpuf
వెంకయ్యనాయుడితో జైరామ్ రమేష్ భేటీ
Published at: 05-12-2013 13:07 PM
న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడితో కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణకు మద్దతు ఇవ్వాల్సిందిగా వెంకయ్యను కోరినట్లు తెలుస్తోంది. అయితే పది జిల్లాల తెలంగాణకు కట్టుబడి ఉన్నామని వెంకయ్య తేల్చిచెప్పారు. రాయల తెలంగాణ వల్ల లాభనష్టాల గురించి వెంకయ్యకు జైరాం రమేష్ వివరించగా, దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని వెంకయ్య తెలిపినట్లు సమాచారం.- See more at: http://www.andhrajyothy.com/node/37863#sthash.29p3ykOe.dpuf
సుష్మాస్వరాజ్‌ను కలిసిన టి.జేఏసీ నేతలుPublished at: 05-12-2013 12:37 PM
 న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్‌తో తెలంగాణ జేఏసీ నేతలు గురువారం సమావేశమయ్యారు. పది జిల్లాల తెలంగాణకు కట్టుబడి ఉండాలని సుష్మాస్వరాజ్‌కు నేతలు వినతి చేసినట్లు తెలుస్తోంది.- See more at: http://www.andhrajyothy.com/node/37857#sthash.MUOvX89K.dpuf
మజ్లిస్ ఆదేశాలు పాటిస్తే ఖబడ్దార్Published at: 05-12-2013 08:36 AM హైదరాబాద్, డిసెంబర్ 4: హైదరాబాద్ నగరంలోని కేవలం పాతబస్తీకే పరిమితమై, ఒక్క ఎంపీ సీటు మాత్రమే ఉన్న మజ్లిస్ పార్టీ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ పాటిస్తూ రాయల తెలంగాణ నిర్ణయం తీసుకుంటే ఖబడ్దార్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హెచ్చరించా రు. రాయలసీమ ప్రజల అభిమానాన్ని దెబ్బతీసేలా నాలుగు జిల్లాలను విభజిస్తే తీవ్ర పరిణమాలుంటాయని అన్నా రు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. "ఒక్క ఎంపీ సీటు ఉన్న మజ్లిస్ పార్టీ ముందు కాంగ్రెస్ అధిష్ఠానం మోకరిల్లింది. తెలంగాణ ప్రజల ఇన్నేళ్ల పోరాటాన్ని, ఆరాటాన్ని పక్కన పెట్టి, మజ్లిస్ ఆదేశాలను పాటిస్తూ రాయల తెలంగాణను తెరపైకి తెస్తోంది. బ్రేకింగులు, లీకింగులతో ఇరు ప్రాంతాల ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది.రాయలసీమ ప్రజల అభిమానాన్ని, ఆకాంక్షలను దెబ్బతీసేలా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. మజ్లిస్ ఆదేశాలు పాటిస్తే ఖబడ్దార్'' అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. "మజ్లిస్ కనుసన్నల్లో, నూతన సమీకరణాలతో, ఓట్లు, సీట్ల దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. రాయలసీమకు చెందిన కొంత మంది రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నారు. రాయలసీమ ప్రజల మనోభీష్టాలను దెబ్బతీసే ఈ ప్రతిపాదనను బీజేపీ సమర్థించదు. ఇంత జరుగుతున్నా... తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు? వారి గొంతు ఎందుకు మూగబోయింది? వారిని ప్రజలు నిలదీయాలి. సోనియా కాదు గదా... కాంగ్రెస్ జేజేమ్మలు దిగివచ్చినా రాయల తెలంగాణ ప్రకటన రాదు. బీజేపీ సహకారం లేకుండా ఒక్క అడుగు ముందుకు పడదు'' అని హెచ్చరించారు.బీజేపీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ పార్టీ బిల్లును గట్టెక్కించే యోచనలో ఉందన్న ప్రశ్నకు స్పందిస్తూ... తమ పార్టీ మద్దతు లేకుండా బిల్లు ఆమోదం పొందదని తేల్చిచెప్పారు. రాయల తెలంగాణ బిల్లు పెడితే అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రతిఘటిస్తామని అన్నారు. ప్రస్తుతం ఉద్యమం పార్లమెంటుకు చేరిందని, అక్కడే తెలంగాణ కోసం ఉద్యమిస్తామని, అదే సందర్భంలో సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. తనకు అధికారాన్ని అప్పగిస్తే... ఏడాదిలో రాష్ట్ర సమస్యను పరిష్కరిస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలకు సమాధానం చెబుతూ... ఆయన సీఎం అయ్యేవరకు తెలంగాణ ప్రజలు నిరీక్షించదల్చుకోలేదని స్పష్టం చేశారు. అసలు చంద్రబాబు అధికారం కావాలంటున్నది తెలంగాణలోనా లేక సీమాంధ్ర రాష్ట్రంలోనా అని ఆయన ఎద్దేవా చేశారు.- See more at: http://www.andhrajyothy.com/node/37776#sthash.r3g5oU8a.dpuf

విలీనం ఆగిపోవడం వల్లే తెరపైకి రాయలPublished at: 05-12-2013 08:23 AM
హైదరాబాద్, డిసెంబర్ 4 (ఆంధ్రజ్యోతి): తన పార్టీని విలీనం చేస్తానన్న హామీ నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వెనక్కు పోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణను ముందుకు తెచ్చిందని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. కేసీఆర్ ఎత్తుగడల్లో తెలంగాణ బలవుతోందని, విభజన ఆగితేనే తనకు ఓట్లు.. నోట్లు.. సీట్ల పంట పండుతుందని ఆయన భావిస్తున్నారని మోత్కుపల్లి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తన పార్టీని విలీనం చేసి ఉంటే పది జిల్లాలతో కూడిన తెలంగాణ వచ్చేది. ఆయన కాదన్నాడని రాయల తెలంగాణ తెచ్చారు. కేసీఆర్‌కు తెలంగాణ రావడం ఇష్టం లేదు. వస్తే తన దుకాణం బంద్ అవుతుందని ఆయన భయం. అందుకే విలీనాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తున్నారు. వెయ్యి మంది బలిదానాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. చేసిందంతా చేసి ఇప్పుడు బంద్ పిలుపు ఇవ్వడం దేనికని ప్రశ్నించారు ఈ బంద్‌కు తెలంగాణ ప్రజలు సహకరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.- See more at: http://www.andhrajyothy.com/node/37756#sthash.iPjuzoBz.dpuf
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు జీఓఎం ఆమోదం, రేపే కేబినెట్ ముందుకు రానున్న బిల్లు
Published at: 04-12-2013 21:50 PM
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 4: ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు కేంద్ర మంత్రుల బృందం బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రేపు (గురువారం) కేంద్ర కేబినెట్‌కు వెళ్తుంది. ఈ ముసాయిదా బిల్లును ఆమోదించడంతో తమ పని పూర్తి అయ్యిందని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం రాత్రి మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.బుధవారం రాత్రి జరిగిన సమావేశమే చివరిదని షిండే వివరిస్తూ తాము ఆమోదించిన ముసాయిదా బిల్లుపై కేంద్ర కేబినెట్ గురువారం చర్చిస్తుందని చెప్పారు. ఇక తెలంగాణ అంశంపై మంత్రుల బృందం మళ్లీ సమావేశం కాదని ఆయన చెప్పారు. ఈ బిల్లులో పేర్కొన్న అంశాలను కేబినెట్ యథాతథంగా ఆమోదిస్తుందా, లేక మార్పులు చేర్పులు చేస్తుందా అన్నది రేపటికి తేలిపోతుంది.ఇన్ని సంవత్సరాలుగా పది జిల్లాల తెలంగాణాను కోరుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అభీష్టానికి విరుద్ధంగానే ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయరంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అడగని రెండు జిల్లాలను అదనంగా కలపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఇప్పటికే గురువారం బంద్‌కు పిలుపు ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా బంద్‌లో పాల్గొనేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి స్పష్టం చేశారు. కాగా, తెలంగాణా అంశంపై రకరకాల ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చి ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఫుట్ బాల్ ఆడుకుంటోందని సీపీఐ నాయకుడు నారాయణ విమర్శించారు.- See more at: http://www.andhrajyothy.com/node/37490#sthash.5Pm2nSeb.dpuf
అవును.. రాయల ప్రతిపాదించా: కోట్లPublished at: 03-12-2013 07:40 AM పత్తికొండ టౌన్, డిసెంబర్ 2: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తాను జీవోఎంకు నాలుగు ప్రతిపాదనలు చేశానని కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువ్వదొడ్డిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవోఎంకు ఇచ్చిన ప్రతిపాదనల్లో తొలుత తాను రాష్ట్ర సమైక్యతకే ప్రాధాన్యం ఇచ్చానన్నారు. విభజన అనివార్యమైతే ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ, కర్నూలు రాజధాని అంశాలను వివరించానని చెప్పారు. అలాగే, కర్నూలు జిల్లాలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించినట్టు- See more at: http://www.andhrajyothy.com/node/36602#sthash.oBo4ZEXc.dpuf
'రాయల'కు ఒప్పుకోండయ్యా..!Published at: 04-12-2013 07:05 AM జే సీ,జీవన్‌రెడ్డిల నడుమ సరదా సంభాషణరాయల తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు జేసీ, జీవన్‌రెడ్డి మధ్య మంగళవారం సరదా సంభాషణ జరిగింది. వీరిద్దరూ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయం వద్ద తారసపడ్డారు. ముందుగా జేసీ మాట్లాడుతూ.. 'రాయల తెలంగాణకు ఒప్పుకోండయ్యా..! మీ సంస్కృతి, మా సంస్కృతి వేరు కాదు. మీకూ తినడానికి లేదు.. మాకూ తినడానికి లేదు' అంటూ వ్యాఖ్యానించారు. దీనికి జీవన్‌రెడ్డి స్పందిస్తూ.. 'ఆర్టికల్ 371(డి)ని సవరించకుండా ఇది సాధ్యం కాదన్నా. ఇప్పుడు సవరణంటే అడ్డుకునే కుట్రే' అన్నారు. అనంతరం ఇద్దరి నడుమ సంభాషణ ఇలా సాగింది..జేసీ: ముందు మీరు ఒప్పుకోండి.. అవన్నీ వాళ్లు(అధిష్ఠానం) చూసుకుంటారు.జీవన్: ఇన్నిరోజులు చలాయించిన రాజ్యం, ఆధిపత్యం చాలదని మళ్లీ బయల్దేరారా!జేసీ: మేం ఏం చేసినం, చేసినోళ్లు కడపోళ్లు చిత్తూరోళ్లుజీవన్: సంజీవరెడ్డి మీవాడు కాదాజేసీ: ఏంది సంజీవరెడ్డా.. పాపం నాయనాజీవన్: పాపం అంటూనే రాష్ట్రపతి అయిండు. విజయభాస్కర్‌రెడ్డి మీవోడు కాదా?జేసీ: వారంతా పనికిరానివాళ్లుజీవన్: చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి వీరంతా సీమవాళ్లే కదాజేసీ: కిరణ్‌కుమార్ సంగతి వదిలేయ్జీవన్: ఎందుకొదిలేయాలి.. ఆయన చేయి రాజశేఖర్‌రెడ్డి కన్నా పెద్దదంటజేసీ: (రాజశేఖర్‌రెడ్డిని ఉద్దేశిస్తూ) అంత చేయి ఎవ్వరికీ లేదు సామి!జీవన్: అయ్యో రామచంద్రా .. వైఎస్సార్ ఆరేళ్లలో చేసింది ఈయన 6 నెలల్లో చేసిండంటజేసీ: రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, లోకేష్, జగన్ వాళ్లు పేర్లు చెప్పు ఒప్పుకుంటా. ఎవరెవరో పేర్లు చెబితే ఎట్లా..!జీవన్: వాళ్లవి బయటపడ్డాయి కిరణ్‌వి బయటపడలేదు అధికారం ఉన్నంత వరకు అందరివీ దాగుతాయిజేసీ: సరే కానీ రాయలకు అపోజ్ చేయవద్దుజీవన్: ఇప్పటికీ సీమాంధ్రకుట్రలైతే ఆగట్లేదుజేసీ: ఏం తిక్కరెడ్డీ.. వారు ఇస్తామంటే మేం అడ్డుకుంటే ఆగుద్దాజీవన్: ఏదేమైనా తెలంగాణను అడ్డుకోవడమే మీకు కావాల. చివరి అస్త్రం దాకా ప్రయత్నిస్తారుజేసీ: అట్టనకు రెడ్డీ.. మీరు మేము బాయ్ బాయ్. అయినా వీళ్లేం రెడ్లో నాకర్థం కాదు. గౌడలు మా గౌడ సీఎం కావాలనుకుంటారు. గౌడరాజ్యం రావాలంటారు. యాదవలు యాదవ సీఎం కావాలంటున్నారు. రెడ్లు మాత్రం కలవరు.జీవన్: రెడ్లు ఎవరు అడగకుండానే సీఎంలు అవుతున్నరు కదా అనడంతో అందరూ ఒక్కసారి నవ్వారు.- See more at: http://www.andhrajyothy.com/node/37110#sthash.8dEtsIb9.dpuf
ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కోరాం : సుష్మాస్వరాజ్Published at: 03-12-2013 18:22 PM న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : ప్రత్యేక తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, ఈ పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని కోరామని బీజీనీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం లోక్‌సభ స్పీరక్ మీరాకుమార్ ఆధ్వర్యరంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లోనే ప్రతిపాదించాలని కోరామని, అందుకు ప్రయత్నిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ చెప్పారన్నారు. తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపాదించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా సూచించాయి. పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులు పెంచాలని కూడా కోరాయి. ఇందుకు ప్రభుత్వం- See more at: http://www.andhrajyothy.com/node/36959#sthash.jOXj61Lz.dpuf
ఆంధ్రోళ్లు పోయి లుంగీలోళ్లు వస్తారు!Published at: 03-12-2013 03:31 AM  పైసా పెట్టకుండా దౌర్జన్యాలు... హైదరాబాద్‌లో సగం హత్యలు వాళ్ల పనేరాయలతో పంచాయితే : వీహెచ్.. 'ఇందిర విజయరథ' యాత్ర ప్రారంభంభువనగిరి/యాదగిరిగుట్ట, డిసెంబర్ 2: రాయల తెలంగాణతో కొత్త పంచాయితీలు పుట్టుకొస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు."ఆంధ్రావాళ్లు పెట్టుబడి పెట్టి వ్యాపారాలతో దోచుకున్నారు. కానీ, రాయలసీమ వాళ్లు పైసా పెట్టుబడి లేకుండానే లుంగీలతో ఇక్కడకు దిగుతారు. సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలు చేస్తారు'' అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగే సగం హత్యలు అక్కడివారి (రాయలసీమ)వేనని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం ఆయన 'ఇందిరమ్మ విజయరథం' పేరిట బస్సు యాత్ర ప్రారంభించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో పూజలు తరువాత బయలుదేరిన బస్సుకు మంత్రి జానారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని 15 ఎంపీ స్థానాల్లో గెలిపించుకోవడంతోపాటు, గణనీయమైన రీతిలో అసెంబ్లీ స్థానాలను అందించడమే సోనియా గాంధీకి అసలైన కృతజ్ఞత అవుతుందని ఈ సందర్భంగా వీహెచ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కొలిచే నల్లపోచమ్మ దేవత.. సోనియా గాంధీ అని శ్లాఘించారు. "యాత్రలో భాగంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కృషి, యూపీఏ చేపట్టిన ఆహార భద్రత, ఈజీఎస్ , విద్యాహక్కు చట్టం, భూసేకరణ పరిహారం పెంపు తదితర అంశాలను ప్రజలకు వివరించనున్న''ట్టు పేర్కొన్నారు.రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా దోచుకున్నది వై.ఎస్ జగనేనని మండిపడ్డారు. తెలంగాణపై సీబ్ల్యూసీ నిర్ణయం తర్వాత చంద్రబాబు స్పందించిన తీరు మన్ననలు పొందిందని..ఆ తర్వాత అయన సమ న్యాయం అంటున్న తీరు ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సీఎం అయినా పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. యూటీ, రాయల ప్రాతిపాదనలను తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని ఎంపీ రాజగోపాల్ రెడ్డి అన్నారు.- See more at: http://www.andhrajyothy.com/node/36494#sthash.Tn4rgJJy.dpuf

బీజేపీ వల్లే 10 జిల్లాల తెలంగాణ
Published at: 06-12-2013 04:31 AM
 New  0  0   
Give it 1/5
Give it 2/5
Give it 3/5
Give it 4/5
Give it 5/5


హైదరాబాద్, డిసెంబర్ 5 : తమ పార్టీ కారణంగానే 10 జిల్లాల తెలంగాణను కాంగ్రెస్ ప్రకటించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషించిన బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అన్నారు. 10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన తర్వాత గురువారం రాత్రి కిషన్‌రెడ్డి ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. "10 జిల్లాల తెలంగాణ వస్తుందనుకుంటున్న సమయంలో అనేక అనుమానాలు, వార్తలు వెలువడ్డాయి. 10 జిల్లాల తెలంగాణ అనో, 12 జిల్లాల రాయల తెలంగాణ అనో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ మళ్లీ పిల్లి మొగ్గలేస్తుందన్న భావం ప్రజల్లో కలిగింది. అయితే, మా పార్టీ ఎంపీ సుష్మా స్వరాజ్.. స్పీకర్‌తో జరిగిన సమావేశంలో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పారు. 12 జిల్లాల రాయల తెలంగాణను ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఎన్డీయే సమావేశంలోనూ 10 జిల్లాల తెలంగాణకే భాగస్వామ్య పక్షాలు మద్దతు ప్రకటించాయి.
కీలక సమయంలో బీజేపీ పోషించిన పాత్రతో కాంగ్రెస్ పార్టీ 10 జిల్లాల తెలంగాణను ప్రకటించింది'' అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. "తెలంగాణ కోసం మా పార్టీ మొదటి నుంచి ఉద్యమిస్తూనే ఉంది. తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో తీర్మానం చేసి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టింది. సుష్మాస్వరాజ్, జైట్లీ, ఆడ్వాణీ, రాజ్‌నాథ్‌సింగ్ వంటి అగ్రనేతల కృషి వెలకట్టలేనిది. వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కృతజ్ఞతలు చెబుతున్నా. తెలంగాణ ఉద్యమంలో 1,100 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఆ అమరులకే ఈ తెలంగాణను అంకితమిస్తున్నాం. ఈ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ, విద్యార్థులు, ఉద్యోగులు, కుల సంఘాలు, పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించారు. వారందరికీ బీజేపీ తరపున ధన్యవాదాలు'' అని అన్నారు. "అయితే కాంగ్రెస్‌పై ఇంకా అనుమానాలున్నాయి. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి'' అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. "ప్రస్తుతం ఏ ప్రాంత ప్రజలూ ఆందోళన చెందకూడదు. ఇది గెలుపోటముల ప్రస్తావన కాదు. తెలంగాణ అభివృద్ధితో పాటే సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. సీమాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలి '' అని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. "కేబినేట్ ఆమోదంతో రాజకీయ ప్రక్రియ పూర్తయింది. ఇక రాజ్యాంగ ప్రక్రియే మిగిలి ఉంది'' అని బీజేపీ నేత దత్తాత్రేయ అన్నారు. కాగా, కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బృందం గురువారం రాత్రి అసెంబ్లీ ఎదుట గల అమర వీరుల స్థూపాన్ని సందర్శించింది

- See more at: http://www.andhrajyothy.com/node/38197#sthash.ZpzMGGE7.dpuf

No comments:

Post a Comment