Monday 9 December 2013

లౌకికతకు మోదీత్వమే ముప్పు!

లౌకికతకు మోదీత్వమే ముప్పు!

Published at: 08-12-2013 09:33 AM
 New  0  0 
 
 

గుజరాత్ సీఎం చరిత్ర తెలియని 'అక్షరాస్యుడు'
బాలగోపాల్ పుస్తకావిష్కరణ సభలో.. ఢిల్లీ ప్రొఫెసర్ అమిత్‌సేన్ గుప్తా
హైదరాబాద్, డిసెంబర్ 7 : దేశ ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థకు మోదీత్వమే అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ప్రొఫెసర్ అమిత్‌సేన్ గుప్తా అన్నారు. హిందుత్వ ప్రచారానికి మీడియా అండగా నిలుస్తున్నదని ఆరోపించారు. దివంగత ప్రజా న్యాయవాది, మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక నేత కె.బాలగోపాల్ రచన 'ముస్లిం ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయాలు' పుస్తకావిష్కరణ సభ శనివారమిక్కడ జరిగింది. "గుజరాత్ సీఎం మోదీ దేశాని కి ప్రమాదకారి. అసత్య విషయాలతో ప్రజలను, సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు'' అని అమిత్‌సేన్ ధ్వజమెత్తారు. తక్షశిల ఎక్కడుందో, అలెగ్జాండర్ ఎవరో, అసలు బీజేపీకి ఆద్యుడెవరో కూడా తెలియని 'అక్షరాస్యుడు' మోదీ అని ఎద్దేవా చేశారు. ముస్లింలను ఊచకోత కోయించిన నేత ప్రధాని అయితే ఎంత ప్రమాదమో ఊహించడానికే కలవరం కలుగుతోందని చెప్పారు. మోదీ, మీడియాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముస్లిం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి బాలగోపాల్ రచన దిక్సూచిగా పనిచేస్తుందని ప్రముఖ హక్కుల నేత ఎంటీ ఖాన్ అన్నారు. ముస్లిం సమాజాన్ని బాలగోపాల్ ఎంత లోతుగా అధ్యయనం చేశారనేది ఈ పుస్తకాన్ని చదివితే అర్థమవుతుందని చెప్పారు. ముస్లింలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' డిప్యూటీ ఎడిటర్ మీర్ అయూబ్ అలీ ఖాన్ వివరించారు. "ముస్లిం జీవన విధానం, ఆచార సంప్రదాయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కాదు. హిందూ-ముస్లింల ఐక్యతను విడదీయడం ఎవరి తరం కాదు'' అని చెప్పారు. 400సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, కవి ఖాదర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/39340#sthash.Mq51oxiJ.dpuf

No comments:

Post a Comment