మావోను మరిచారు!
బీజింగ్, డిసెంబర్ 25: ఆయన వ్యక్తి ఆరాధనకు వ్య తిరేకం. అయితే, ఆయన పేరిట వంద అడుగులకు పైగా భారీ విగ్రహాలు ఏర్పాటవుతాయి. ఆయన వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకి. అయితే, తండ్రి పార్టీలో పొలిట్ బ్యూరోలో ఉంటే, కొడుకు రాజ్యాంగ పదవిలో ఉంటా రు. ఇలా.. నవ చైనా నిర్మాత మావో రెnుడాంగ్ బోధించిన ప్రతి మాట, ప్రతి పదం తన రూపును, చూపును కోల్పోయాయి. మారిన అంతర్జాతీయ, ఆర్థిక వాతావర ణం దీనికి ఒక కారణంకాగా, కమ్యూనిస్టు సిద్ధాంతాలపై ఆసక్తిలేని నాయకులు పెరిగిపోవడం మరో కారణం.
ఒప్పుల కుప్ప..
"70 శాతం ఒప్పు.. 30 శాతం తప్పు''.. మావోపై కమ్యూనిస్టు ప్రభుత్వం అంచనా ఇది. అయితే, ఆయన 120వ జయంతి సందర్భంగా నిర్వహించిన అధ్యయనంలో మాత్రం ప్రజలు మావోకు పూర్తిస్థాయిలో నీరాజనాలు పలికారు. గురువారం జయంత్యుత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ అనుకూల పత్రిక 'గ్లోబల్ టైమ్స్'ఈ అధ్యయనం చేసిం ది. సర్వేలో పాల్గొన్నవారిలో 85 శాతానికిపైగా మావోపై సానుకూలత వ్యక్తం చేశారు.ఆయన సాధించిన విజయాలతో పోల్చితే తప్పులను పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదని వారంతా చెప్పారు. ఈ విషయంలో మావోను 6.8 శాతం గట్టిగా సమర్థించగా, 78.3 శాతం మద్దతు ఇచ్చారు. 11.7 శాతం వ్యతిరేకించగా, మూడు శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించలేదు.

మళ్లీ పుట్టాడు..!
'ఎవడు బతికేను మూడు యాభైలు' అనేది నానుడి. అయితే మావో రెnుడాంగ్ మూడు యాభైలు బతకలేదు గానీ, దేశ జనజీవనంపై ఆయన ప్రభావం మాత్రం ఆ స్థాయిలోనే కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం కూడా మావో పుస్తకాలను తిరగేస్తున్నట్టు కనిపిస్తున్నది. యువ నాయకత్వం ప్రభుత్వ, పార్టీ పదవులను కైవసం చేసుకున్న దరిమిలా.. మావోపై పునరాలోచన మొదలయిన సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి, మావో మరణంతో 37 ఏళ్ల క్రితమే ఆయన బోధనలు కనుమరుగయ్యాయి. అయితే..మావో 120వ జయంతిని గురువారం అధికారికంగా జరిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు చూ స్తే.. ఇన్నాళ్లకు తిరిగి కమ్యూనిస్టు అధినేతలకు మావో అక్కర వచ్చినట్టు అనిపిస్తున్నది. అవినీతికి వ్యతిరేకంగా జరిపే పోరులో మావోను ఆదర్శంగా తీసుకోనున్నట్టు అధ్యక్షుడు జి జింపింగ్ ప్రకటించడమే దీనికి నిదర్శనం.

రాజకీయాలకు పెద్దపీట వేశారు. ఆయుధంపై రాజకీయాలదే పైచెయ్యి కావాలని కోరా రు. ప్రభుత్వంలో పార్టీకి నిర్ణాయక పాత్ర కల్పించారు.
రాజకీయాల్లో కేంద్రీకరణను, పాలనా రంగంలో వికేంద్రీకరణను ఆయన ప్రోత్సహించారు.

అధికారానికి ఇచ్చినంత విలువ రాజకీయాలకు ఇవ్వడంలేదు.
రాజకీయాలను వికేంద్రీకరించే ప్రయత్నం జరుగు తున్నది. ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు ఏక పార్టీ వ్యవస్థపై సమీక్షకు డిమాండ్ చేస్తున్నాయి.

స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. విదేశీ పెట్టుబడుల్లో సమతూకం సాధించారు. వర్ధమాన దేశాలతోనే ఎక్కువగా లావాదేవీలు నడిపించారు.
జాతీయ బూర్జువావర్గం ఏర్పడి బలపడేందుకు దోహదపడ్డారు ఉత్పత్తి-ప్రయోగం అనే పద్ధతిలో పెద్దఎత్తున పారిశ్రామికీకరణ సాధించారు.

ఆధునిక కమ్యూనిజాన్ని బోధించినప్పటికీ, మూలాలను మరవలేదు. ప్రాచీన సాహిత్యాన్ని, సంస్కృతిని..తరగని గనిగా అభివర్ణించారు.
మత వ్యవహరాల్లో ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని..ఓపిగ్గా సంభాషించాలని పదేపదే హెచ్చరించారు.

ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఆదాన ప్ర దానాలు కొనసాగాలంటూ, ఆయన తన 'ప్రజాపంథా'ని తీర్చిదిద్దారు.
'తరాల భాగస్వామ్యా'న్ని ప్రోత్సహించారు. అంటే..పార్టీ,ప్రభుత్వాల్లో యువకులు, మ«ధ్యవయ స్కులు, వృద్ధతరాలకు సమాన ప్రాతినిథ్యం ఉండాలి.

సామ్రాజ్యవాద దేశాలకు దీటుగా వర్ధమాన దేశాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నించింది. జాతీయ కాంక్షను, స్వేచ్ఛను బలపరిచారు.
ఇరుగుపొరుగు సరిహద్దులను నిజమైన 'రక్షిత గోడలు'గా భావించారు. అగ్రదేశాల దాడుల క్రమంలో వర్ధమాన దేశాలకు పెద్దదిక్కుగా నిలిచారు.

పాశ్చాత్య సంస్కృతికి గేట్లు తెరిచారు. 'ప్రాచీనత్వం' పై మావో భావనని వక్రీకరించి, కన్ఫ్యూషియస్ బోధనలకు ప్రాచూర్యం కల్పిస్తున్నారు.
ప్రజల మనోభావాలపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా సరిహద్దుల్లోని ముస్లిం తెగలు, టిబెటన్ బౌద్ధులు తరచూ ఆత్మాహుతిదాడులకు దిగుతున్నారు.

వేల మంది అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీనియర్ నేతలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. 'ప్రజాపంథా'ను పక్కన బెట్టడమే దీనికి కారణమన్న భావన పెరుగుతోంది.
ఇప్పుడు అంతటా యువ హవా కనిపిస్తుండగా, ఇంతకుముందు పూర్తిగా వృద్ధ ముద్రే దర్శనమిచ్చేది.

విదేశాంగ విధానం స్వప్రయోజనాకాంక్షతో నిండిపోయిందన్న విమర్శ ఉంది. చిన్న దేశాలకు అండగా ఉండటం పోయి..కబళించే దశను చేరింది.
భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం, టిబెట్‌లో పోటీ మత గురువులను నిలబెట్టడం వంటి.. చర్యలతో ఉపఖండాన్ని నిప్పుల కొలిమిగా మార్చింది.

మావో తప్పులు చేశారు..
బీజింగ్, డిసెంబర్ 26: నవచైనా నిర్మాత మావో రెnుడాంగ్ 120వ జయంత్యుత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన తరుణంలో మావోపై భిన్నవాదాలకు చైనా వేదికగా మారింది. నిన్నటికి నిన్న చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం 'మావో.. 70 శాతం ఒప్పు, 30 శాతం తప్పు' అని తేల్చగా, చైనా ప్రజల్లో 85 శాతం మావో పట్ల తమ సానుకూలతను చాటుకున్నారు. కమ్యూనిస్టు నాయకులు చాలా అరుదుగా మాత్రమే మావోపై విమర్శనాత్మకంగా మాట్లాడుతుంటారు. సమష్టి వ్యవసాయం, పారిశ్రామికీకరణ దిశగా దేశాన్ని నడిపించేదుకు మావో చేపట్టిన 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' వంటి విధానాలు చైనాకు భారీ నష్టాన్ని కలిగించాయి. ఇలాంటి వాటిపై ఇప్పుడిప్పుడే కమ్యూనిస్టు పార్టీ పెద్దలు, సామాన్య చైనీయులు పెదవి విప్పుతున్నారు. అయితే దీనికి ముగింపు పలికే విధంగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్.. 'మావో.. తప్పులు చేశారు.
అయితే ప్రజలు, ఓ జాతి స్వరూపాన్ని సమూలంగా మార్చివేసిన విప్లవాత్మకమైన వ్యక్తి గుణగణాలను పరిగణనలోకి తీసుకుని ఆయనపై ఓ నిర్ణయానికి రావాలి.' అని కోరారు. 'ప్రస్తుత అభివృద్ధిని మన పూర్వీకులు సాధించిన అభివృద్ధితో పోల్చి వారిని కించపర్చడం సరికాదు.' అని పేర్కొన్నారు. జింగ్‌పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'మావో గొప్ప రాజకీయవేత్త, వ్యూహకర్త, సిద్ధాంతకర్త.' అంటూ ప్రశంసించారు. అలాంటి వ్యక్తిని సరైన చారిత్రక దృక్పథంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. జింగ్‌తోపాటు పలువురు ప్రముఖ కమ్యూనిస్టు నేతలు గురువారం మావోకు నివాళులర్పించారు. మరోవైపు మావో జన్మస్థలమైన షాఓసన్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది.
No comments:
Post a Comment