Saturday 14 December 2013

Beaf

ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది
" య ఇచ్చేత్పుత్రోమే ,పండితో, విగీతః సమితిగమః
శుశ్రూషితాం వాచం భాషితాజాయేత,
సర్వాన్ వేదాం అనువ్రవీత, సర్వమాయురి యాతిది
మాంసోదనం పాంచయిత్వా సర్పిష్మంతం అశ్వనీయతాం
ఈశ్వరీ జనయుత వాఔక్షేణవార్షణమేవా..."

అనగా పండితుడు, ప్రసిద్దుడు, సామాజికుడు శ్రోతలున్నవక్త, వేదపాఠి,దీర్ఘాయుష్మంతుడు అగు పుత్రుని కోరికగల తల్లి ఆబోతు లేక ఎద్దు మాంసోదనం నేతితో వండుకొని తినవలయును.ఇందులో సందేహించనవసరం లేదు.
దీనికి శంకరాచార్యులు ఇలా టీకారాశారు
"మాంసమిశ్రమోదానం,తస్మాంస నియమూర్థమాహా ఔక్షేణవా ,మాంసేన,ఉక్షాసేచ ననుమర్థః పుంగవస్తదీయం మాంసం ఋషభస్తతో-ప్యధికవయాః తదీయమార్షభం మాంసం".
అనగా మాంసం వయస్సులోనున్న ఎద్దుదై ఉండవలయును.. నేడు గోమాంసం అంటే ఎంతో ఏవగింపు వుంది.కానీ ప్రాచీనకాలంలో ఇటువంటి భావంలేదు.బుద్ధుని కాలంలో కూడా వాడుకలో వున్న ఆహారం..
--------0--------0-----------0-----------0------------0
ఇప్పుడు చెప్పండి మధ్యలో కుట్ర ఎక్కడ జరిగింది., ఎద్దుమాంసం
తినటం తప్పెందుకు అయ్యింది..? వేదాల్లో చెప్పినట్లుగా మంచి పుత్రుడు కలగాలంటే ఎద్దుమాంసం తినమన్నారు..అంటే ఎద్దుమాంసం తిన్న దళితులందరూ శ్రేష్ఠులేగా..?! మరి నీచులుగా పంచములుగా ఎలాతయారయ్యారు..పంచమ సృష్టి ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగింది...?!
చెప్పండి..
Like ·  ·  · 15 hours ago · 

No comments:

Post a Comment