చట్టసభల్లో తేల్చుకుందాం
రాజ్యాంగ, న్యాయపరంగా పోరాడదాం
159 మందీ 3 అఫిడవిట్లు సిద్ధపరచండి
రాష్ట్రపతికి, సుప్రీం కోర్టుకు, స్వీకర్‌కు ఇద్దాం
సీమాంధ్ర సభ్యులంతా విధిగా హాజరు కావాలి
ఒక్కొక్కరు రెండేసి గంటలపాటు మాట్లాడాలి
సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో సీఎం కిరణ్
159 మందీ 3 అఫిడవిట్లు సిద్ధపరచండి
రాష్ట్రపతికి, సుప్రీం కోర్టుకు, స్వీకర్‌కు ఇద్దాం
సీమాంధ్ర సభ్యులంతా విధిగా హాజరు కావాలి
ఒక్కొక్కరు రెండేసి గంటలపాటు మాట్లాడాలి
సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో సీఎం కిరణ్
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి):"రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలిసికట్టుగా పోరాడదాం. ప్రజా కోర్టుగా భావించే చట్టసభల్లో తేల్చుకుందాం. అవసరమైతే రాజ్యాంగ పరంగా.. న్యాయపరంగానూ పోరాటం చేద్దాం'' అని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి కిరణ్ స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సీమాంధ్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మం త్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, పార్థసార«థి, తోట నరసింహం, టీజీ వెంకటేశ్, కాసు కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, కోండ్రు మురళీ మోహన్, గల్లా అరుణ కుమారి, శైలజానాథ్, వట్టి వసంతకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర రెడ్డి సహా 50 మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు కొందరు ప్రజా ప్రతినిధులు బుధవారం నుంచే విభజన బిల్లుపై చర్చ జరపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.మంగళవారం తనను టీ మంత్రులు కలిశారని, చర్చ విషయమై పట్టుబట్టవద్దని, సభను ప్రొరోగ్ చేయకుండా చర్చను కొనసాగించాలని కోరారని, వారి గౌరవాన్ని కూడా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కిరణ్ వివరించారు.
బుధవారం బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందంటూనే కాంగ్రెస్ తరఫున మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి వట్టి వసంత కుమార్, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్‌లకు సూచించారు. చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర సభ్యులంతా విధిగా హాజరు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు గంటలపాటు రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను వివరించాలని సూచించారు."సవరణలు కోరదాం. వాటి ద్వారా నిరసన తెలియజేద్దాం. తద్వారా విభజన బిల్లు వీగేలా చేద్దాం. అన్ని పార్టీలకూ చెందిన సీమాంధ్రలోని 159 మంది శాసనసభ్యులూ మూడు సెట్ల అఫిడవిట్లను సిద్ధం చేద్దాం. ఒక సెట్‌ను రాష్ట్రపతికి, ఒక సెట్‌ను ఇప్పటికే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిల్‌కు సపోర్టుగానూ.. మరో సెట్‌ను స్పీకర్‌కు అందిద్దాం. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని పేర్కొందాం'' అని కిరణ్ వివరించారు. శుక్రవారం వరకూ చర్చ జరుగుతుందని, మళ్లీ సంక్రాంతి సెలవుల తర్వాత..జనవరి 23 వరకూ చర్చ చేద్దామన్నారు.
నరసరావుపేట: "సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరిదీ ఒకటే మాట. ఒకటే బాట. సమైక్యాంధ్రకు సీఎం కిరణ్ కట్టుబడి ఉన్నారు'' అని మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. సీఎంతో సీమాంధ్ర నేతల భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం రాజకీయాలు పక్కన బెట్టి నేతలందరూ చేయి చేయి కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్ర వాణిని ఢిల్లీకి విన్పించేలా అన్ని పార్టీల నాయకులు ఐక్యంగా పని చేయాలని సూచించారు.
బ్యాట్స్‌మెన్‌కు హెడ్ ఇంజురీ!
హైదరాబాద్, డిసెంబర్ 17: 'మా బ్యాట్స్‌మెన్‌కు హెడ్ ఇంజురీ కావచ్చేమో? ఇప్పటికైతే మేం మోసపోయామని భావిస్తున్నాం. అందుకే ఆంధ్ర దేశం కావాలని కోరుతున్నాం'' అని మంత్రి కె.పార్థసారథి అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి డీకే అరుణ జోక్యం చేసుకుంటూ .. పాకిస్థాన్‌లా ప్రత్యేక దేశం కోరుతారా అని ప్రశ్నించారు. ఆ వెంటనే ఖలిస్థాన్‌లా .. ప్రత్యేకంగా ఆంధ్రదేశం కోరుకుంటారని మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఖలిస్థాన్ కాదులే కాని.. ఆంధ్ర దేశంగా ఉన్నా స్వేచ్ఛగా బతకొచ్చేమో అని పార్థసారథి అన్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్న కర్నూలు, రాయలసీమ నేతలు రాయల తెలంగాణ కోరారు కదా అని ఏరాసును మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు "అవును. కేంద్రం నుంచి సంకేతాలు వచ్చాయి. అలా అడగాలని అన్నారు. కాని.. మమ్మల్ని భరించలేమని తెలంగాణ నేతలు అంటున్నారు.
మేమైతే కోస్తాంధ్ర వారిని భరించలేం'' అని ఏరాసు సమాధానం ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. రాష్ట్ర విభజనపై డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గల్లా అరుణ మాట్లాడుకుంటున్న సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ లాబీల్లోకి వచ్చారు. ఆయననుద్దేశించి గల్లా అరుణ చనువుగా 'అదుగో మా దొంగ శ్రీనివాస్ వస్తున్నాడు' అని అన్నారు. 'మా శ్రీనివాస్‌ను ఏమైనా అనే అధికారం మాకుంది' అని ఆమె చెప్పారు. తర్వాత డీఎస్ మాట్లాడుతూ.. 'నా ఇంటి పేరు ధర్మపురి.. నేను ఎవరి దగ్గరా ఏమీ పట్టుకు పోలేదు. తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాను. నా చెల్లెలు అరుణకు ఏమైనా అనే హక్కుంది' అన్నారు.
విభజనపై అఫిడవిట్
విభజనను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలంతా తమ అభిప్రాయాలను అసెంబ్లీలో వెల్లడించటంతోపాటు ఒక అఫిడవిట్ రూపంలో అందజేయాలని నిర్ణయించారు. అఫిడవిట్ సారాంశమిదీ..
విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.
విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.
సభలోని మెజార్టీ సభ్యుల అభిప్రాయాలకు అది విరుద్ధం.
విభజన..నిబంధనలకు విరుద్ధంగా ఉంది.
తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ వద్దు
371 (డి) ఉన్నందున కేవలం బిల్లులో సవరణ చేసి రాష్ట్రాన్ని విభజించడం తప్పు.
విభజన అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది.
రాష్ట్ర ఐక్యతను, సుస్థిరతను దెబ్బతీస్తుంది.
కేంద్ర కేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.
రాష్ట్రపతి.. సుప్రీం కోర్టును న్యాయ సలహా కోరాలి.
తెలంగాణపై రెండో ఎస్సార్సీ ద్వారానే నిర్ణయం తీసుకోవాలని ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రోశయ్య కమిటీ, 2000 నాటి సీడబ్ల్యూసీ తీర్మానం, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచించాయి.
No comments:
Post a Comment