'గే' నిషేధానికి మా మద్దతు :రాజ్‌నాథ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ సమర్థించింది. తాము ఆ తీర్పును సమర్థిస్తున్నామని, స్వలింగ సంపర్కమనేది అసహజ ప్రక్రియ అని, అలాంటి వాటికి తమ పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని పేర్కొంది. నిజానికి ఈ అంశంపై తమ వైఖరి ఏమిటో ఆ పార్టీ తొలుత చెప్పలేదు. ఎట్టకేలకు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ దీనిపై నోరు విప్పారు. ఒకవేళ ప్రభుత్వం గనక దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించదలుచుకుంటే.. తమ పార్టీ స్వలింగ సంపర్కాన్ని నిషేధించే సెక్షన్ 377ను సమర్థిస్తుందని స్పష్టం చేశారు.
దీనిపై లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్‌ను, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీని ప్రశ్నించగా.. "పార్లమెంటు తలుచుకుంటే దీన్ని మార్చవచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ విషయమై ఏకాభిప్రాయానికి ప్రభుత్వం అఖిలపక్షాన్ని నిర్వహిస్తే, అందులో ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించి మా అభిప్రాయాన్ని తెలుపుతాం'' అని సమాధానమిచ్చారు. ఈ అంశంపై బీజేపీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. "సెక్షన్ 377 ప్రకృతి విరుద్ధమైన లైంగిక చర్యలను నిషేధిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే.. పుట్టుకతోనే 'గే' లక్షణాలు కలిగినవారి విషయంలో ఇది అసహజ చర్య కాబోదు. అలాంటివాటిని కోర్టు చట్టబద్ధమో, చట్టవిరుద్ధమో చేయలేదు. ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం కాదు కాబట్టి'' అని ఆ పార్టీకే చెందిన నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా.. స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త అంజలీ గోపాలన్ రాజ్‌నాథ్ వైఖరిపై మండిపడ్డారు. సుప్రీం తీర్పుపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు.. స్వలింగ సంపర్కంపై ఆరెస్సెస్ అధికారిక వైఖరి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
రికార్డులకెక్కనున్న అసహజ శృంగార కేసులు
అసహజ శృంగారంపై సుప్రీం తీర్పు నేపథ్యంలో వచ్చే ఏడాది ఉంచి ఈ కేసుల వివరాలను రికార్డు చేయాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నిర్ణయించింది. ఐపీసీ సెక్షన్ 377 కింద నమోదయ్యే అసహజ శృంగార కేసుల వివరాలను రికార్డు చేయడం 1986లో ఎన్‌సీఆర్‌బీ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి.
అసహజ శృంగారంపై సుప్రీం తీర్పు నేపథ్యంలో వచ్చే ఏడాది ఉంచి ఈ కేసుల వివరాలను రికార్డు చేయాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నిర్ణయించింది. ఐపీసీ సెక్షన్ 377 కింద నమోదయ్యే అసహజ శృంగార కేసుల వివరాలను రికార్డు చేయడం 1986లో ఎన్‌సీఆర్‌బీ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి.
No comments:
Post a Comment