మనిషికి పంది అవయవాలు Updated :15-10-2015 01:49:24 |
వాషింగ్టన్: మరణానంతరం లేదా బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించిన వారి నుంచి వివిధ అవయవాలు సేకరించి వైద్యులు ఎంతో మందికి ప్రాణం పోస్తుంటారు. అయినా.. దాతలు దొరక్క చాలా మంది చనిపోతున్నారు. ఈ మరణాలను నిలువరించేందుకు జంతువులలో మనుషులకు సరిపోయే అవయవాలను సేకరించి అమర్చాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు, డీఎన్‌ఏలో మార్పులు చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు. మానవ గుండె నిర్మాణానికి దగ్గరగా ఉండే పందుల నుంచి గుండె కవాటాలను, ఇతర అవయవాలను మనుషులకు అమర్చవచ్చని కనుగొన్నారు. అయితే, పందులలో రిట్రోవైరస్ పాళ్లు ఎక్కువని తేలింది. గ్రహీత శరీరంలో చేరాక ఇది ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని తేలింది. దీంతో మానవ శరీర నిర్మాణానికి అనుగుణంగా పందుల డీఎన్‌ఏలో మార్పులు చేసే కొత్త పద్ధతిని హార్వర్డ్ పరిశోధకులు కనుగొన్నారు.
|
No comments:
Post a Comment