వైసీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్‌బై
చంద్రబాబుతో ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక భేటీ
టీడీపీలో చేరిన ఎస్పీవై, రేణుక భర్త నీలకంఠ
అనుబంధ సభ్యురాలిగా కొనసాగనున్న రేణుక
లోక్‌సభలో ఏడుకు పడిపోయిన వైసీపీ బలం
చంద్రబాబుతో ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక భేటీ
టీడీపీలో చేరిన ఎస్పీవై, రేణుక భర్త నీలకంఠ
అనుబంధ సభ్యురాలిగా కొనసాగనున్న రేణుక
లోక్‌సభలో ఏడుకు పడిపోయిన వైసీపీ బలం
వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు కూడా గడవక ముందే... ఇంకా ప్రమాణస్వీకారాలు కూడా జరగకముందే కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీ అధ్యక్షుడు, కాబోయే సీఎం చంద్రబాబును కలిశారు. అభివృద్ధి జరగాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎస్పీవై రెడ్డి, రేణుక భర్త నీలకంఠలకు చంద్రబాబు టీడీపీ కండువా వేసి పార్టీలోకి స్వాగతించారు. తాను టీడీపీలో చేరటం లేదని, టీడీపీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని రేణుక వెల్లడించారు.
న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కలేదన్న బాధతో ఉన్న వైసీపీకి మరో ఝలక్ . ఆపార్టీ కొంచెం మంచి ఫలితాలు సాధించిన కర్నూలు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన పది రోజుల్లోపే జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీలు పార్టీని వీడారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆదివారం టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు మేలు జరగాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. ఎస్పీవై రెడ్డి, రేణుక భర్త నీలకంఠలకు చంద్రబాబు టీడీపీ కండువా వేసి పార్టీలోకి స్వాగతించారు. బుట్టా రేణుక మాత్రం తాను టీడీపీలో చేరటం లేదని, టీడీపీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని వెల్లడించారు. వాస్తవానికి కొద్ది రోజుల నుంచే ఈ ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి కనబర్చారు. కాగా, స్థానిక నాయకులతో కూడా మాట్లాడిన తర్వాతే వీరిని పార్టీలోకి తీసుకోవాలని టీడీపీ భావించింది. ఈ మేరకు జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులతోనూ చర్చించి, వారంతా ఆమోదం తెలపటంతో ఇద్దరు ఎంపీలను పార్టీలోకి ఆహ్వానించింది.టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, జిల్లా టీడీపీ నాయకులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలతో పాటు శనివారం రాత్రే బుట్టా రేణుక, నీలకంఠలు చంద్రబాబుతో సమావేశమైనట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఏపీ భవన్‌లో ఎస్పీవై రెడ్డి, నీలకంఠ టీడీపీ తీర్థం పుచ్చుకోగా, రేణుక మాత్రం ప్రత్యేకంగా చంద్రబాబుతో సమావేశమయ్యారు.
చంద్రబాబుతోనే అభివృద్ధిఎస్పీవై
తన నియోజకవర్గ ప్రాంతం, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండు వా వేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లు అంటే చాలా ఎక్కు వ సమయమని, మరో ఐదేళ్ల పాటు సార్వత్రిక ఎన్నికలు ఉండబోవని చెప్పారు. ప్రస్తు తం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడినందున తక్షణం తాను నిర్ణయం తీసుకున్నానని.. తన ప్రాంతానికి న్యాయం చేయాలని భావించానని చెప్పారు. దీంతో టీజీ వెంకటేశ్‌ను సంప్రదించానని, ఆయన చంద్రబాబుతో మాట్లాడార ని తెలిపారు. చంద్రబాబు కూడా గౌరవ ప్రదంగా తనను చూశారని, పెద్దమనిషి, వివాద రహితుడు అంటూ తనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు.

వాస్తవానికి జగ న్ తనకు చాలా సన్నిహితుడని, ఆయనతో కానీ, వైసీపీలో కానీ తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత, జగన్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వైసీపీని వీడటం సమంజసమేనా? అని ప్రశ్నించగా.. జగన్‌కు ఎలాంటి ఇబ్బందులూ లేవని చెప్పారు. తాను పార్టీ మారటం కొంత వివాదాస్పదమే అయినప్పటికీ తనకు పజలే ముఖ్యమని, వారి అభివృద్ధే ముఖ్యమని తెలిపారు. పదేళ్లుగా వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తన ప్రాంతాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లాగా అభి వృద్ధి చేశానన్నారు. తన ప్రాంతానికి నీళ్లు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముఖ్యమన్నారు. వాస్తవానికి తాను తన మెజార్టీతో ఎమ్మెల్యేలను గెలిపించానని, ఎమ్మెల్యేలకంటే ఎక్కువ ఓట్లు తాను పొందానని వెల్లడించారు. జగన్‌పై ఉన్న కేసుల విషయం గురించి తాను మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. పార్టీ మారితే అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి కదా! అని ప్రశ్నించగా.. తాను దాని గురించి ఆలోచించటం లేదన్నారు. ఏం జరిగినా చంద్రబాబు చూసుకుంటారన్న విశ్వాసంతోనే తాను టీడీపీలోకి వచ్చానన్నారు. ఒకవేళ ఎంపీ పదవి రద్దయితే మళ్లీ పోటీ చేస్తానని, ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. తాను బేషరతుగానే టీడీపీలో చేరానన్నారు.
హామీలను అమలు చేయడానికే: రేణుక
ప్రజల్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, వారికి ఎన్నో హామీలు ఇచ్చానని, ఇప్పుడు అవి నెరవేర్చకపోతే తాను రాజకీయాల్లోకి రావటంలో అర్థం ఉండదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఇకపై టీడీపీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న చంద్రబాబుకు అభినందనలు తెలిపానని చెప్పారు. తన నియోజకవర్గాన్ని, ప్రజలను అభివృద్ధి చేయాలని, సేవ చేయాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలంటే అందుకు ముఖ్యమంత్రి నుంచి ఎంతో సహాయ సహకారాలు అవ సరమవుతాయని వివరించారు.

చంద్రబాబుతో ఇదే చర్చించానని, అభివృద్ధి విషయంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారన్నారు. కాబట్టి,టీడీపీ అనుబంధ సభ్యురాలిగా ఉండి తాను చంద్రబాబు సహకారం పొందుతానని అన్నారు. తనపై అ నర్హత వేటు అంశం గురించి తాను ఆలోచించటం లేదని, తన నియోజకవర్గ అభివృద్ధి గురించే తాను ఆలోచిస్తున్నానన్నారు. తాను సేవాభావంతోనే వ్యవహరిస్తున్నానని, రాజకీయ నాయకురాలిగా వ్యవహరించటం లేదన్నారు. తన భర్త టీడీపీలో చేరినప్పటికీ తాను వ్యక్తిగతంగా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. కాగా, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తారని తాను భావించటం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను వైసీపీతో ఉన్నాననా? లేదా? అన్నది కూడా తనకు తెలియదని, తాను టీడీపీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. మిగతా సాంకేతికాంశాలన్నీ తర్వాత చూస్తానన్నారు. ఒకవేళ తనపై అ నర్హత వేటు వేస్తే.. పోటీ చేయగలిగే స్తోమత ఉంటే పోటీ చేస్తానని, లేదంటే ప్రజలకు సేవ చేసుకుంటానని సమాధానం ఇచ్చారు.
అనర్హత వేటు వర్తించదా?
విప్ జారీ చేసే అధికారం గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఉండడం... రిజిస్టర్డ్ పార్టీలకు ఆ నిబంధన వర్తించకపోవడం వైసీపీకి శాపంగా మారింది. వైసీపీ తరఫున ఫ్యాన్ గుర్తుపై గెలిచి వేరే పార్టీలోకి వెళ్లే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడే అవకాశమే లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తమపై అనర్హత వేటు అవకాశమే లేదని తెలియడంతో ఇంకొందరు ప్రజాప్రతినిధులు టీడీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

No comments:
Post a Comment