ఏపీ బడ్జెట్ రూ.లక్ష కోట్లు!
- వ్యవసాయానికి ప్రత్యేకం : యనమల
హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను దాదాపు రూ.లక్ష కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ శాఖలతో బడ్జెట్‌పై సమీక్షించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. రాష్ట్రపతి పాలన సందర్భంగా సెప్టెంబర్ నెలాఖరు వరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించుకోగా మిగిలిన ఆర్థిక సంవత్సరం కోసం రెండు వారాలుగా యనమల నేతృత్వంలో కసరత్తు చేస్తున్నారు. చివరిగా సోమవారం ఆయన ఆర్ధిక, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని తెలిపారు. బడ్జెట్‌లో ఏదీ రహస్యం లేదని, ఓపెన్ బడ్జెట్ అని చెప్పారు. బడ్జెట్‌పై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా వ్యవసానికి ఈసారి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నట్టు వివరించారు. ఆగస్టు 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతామని అన్నారు. రుణమాఫీపై మాట్లాడుతూ రైతులు చెల్లించాల్సిన బకాయిలపై బ్యాంకులను పదేళ్ల గడువు కోరతామని తెలిపారు. రైతుల రుణాలకు గ్యారెంటీగా మూడు రకాల సెక్యూరిటీలను సమర్పిస్తామన్నారు. బేవరెజెస్ కార్పొరేషన్, ఇసుక, ఎర్రచందనంపై వచ్చే ఆదాయాలను ఎస్ర్కో అకౌంట్ల ద్వారా చూపిస్తామని వివరించారు.

No comments:
Post a Comment