సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొనండి
కమ్యూనిస్టులు రాజకీయ పోరాటాలకే పరిమితం కాకూడదు : బర్ధన్
హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాజకీయ పోరాటాలకే పరిమితం కాకుండా అనేక సమస్యలపై సాగుతున్న సామాజిక ఉద్యమాల్లో కూడా కమ్యూనిస్టులు భాగస్వాములైతేనే ఫాసిస్టు శక్తులను అరికట్టడం సాధ్యమవుతుందని సీపీఐ సీనియర్ నాయకులు ఏబీ బర్ధన్ అన్నారు. సీపీఐ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు శత జయంత్యుత్సవాల ముగింపును పురస్కరించుకుని ‘‘సామాజిక ఉద్యమాలు - వామపక్షాల పాత్ర’’ అనే అంశంపై ఆదివారం కొండాపూర్‌లో సీఆర్ ఫౌండేషన్‌లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. సదస్సును ప్రారంభించిన బర్ధన్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఉద్యమాలతో పాటు ధరల పెరుగుదల, అవినీతి, నిరుద్యోగం, అత్యాచారాలు, పర్యావరణం లాంటి అనేక ఇతర సమస్యలపై సామాజిక ఉద్యమాలు సాగుతున్నాయన్నారు. సామ్రాజ్యవాద శక్తులు అనుసరించిన ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావం వల్ల ఏర్పడిన ఈ సమస్యలపై పోరాడుతున్నా.. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఫాసిస్టు శక్తులను తాజాగా రంగంలోకి దింపి జాతులు, కులాలు, వర్గాలు, మతాల వారీగా చిచ్చుపెడుతున్నాయని చెప్పారు. ఇక నుంచైనా వామపక్షాలు కలిసి ముందుకు సాగాలని బర్ధన్ సూచించారు. దేశ పరిస్థితులను ప్రస్తావిస్తూ కేంద్రంలో ప్రభుత్వం మార్పును కేవలం మార్పుగా చూడరాదని, ఈ మార్పును విశాల దృక్పథంతో చూడాలని, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం... మొత్తం పాలనా యంత్రాంగాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్సిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లో గ్రామస్థాయి నుంచి పోరాడాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉందని బర్ధన్ అన్నారు. సదస్సులో కీలకోపన్యాసం చేసిన ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ... భారత దేశంలో కొంత వరకు సామాజిక విప్లవాలు వచ్చాయని, కానీ విప్లవమంటూ ఇంతవరకూ రాలేదని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ మాట్లాడుతూ ధరలను అరికట్టలేని యూపీఏకి పాలించే అధికారం లేదని గొంతు చించుకున్న మోదీ...అధికారంలోకి వచ్చాక ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైయ్యారన్నారు. ఫౌండేషన్ ఆవరణలో ఉన్న సీఆర్ విగ్రహానికి, భవన ప్రాంగణంలో ఉన్న నీలం రాజశేఖర్‌రెడ్డి విగ్రహాల వద్ద పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రచురించిన సీఆర్ జీవిత చరిత్ర గ్రంథాన్ని బర్దన్ ఆవిష్కరించారు.

No comments:
Post a Comment