సర్వేకు పవన్‌కళ్యాణ్, విజయశాంతి దూరం
హైదరాబాద్, ఆగష్టు 19 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను జనసేన అధినేత, నటుడు పవన్‌కళ్యాణ్, విజయశాంతి నిరాకరించారు. ఇటీవల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి నివాసానికి కొద్దిసేపటి క్రితం షేక్‌పేట్ ఎమ్మార్వో, కొంత మంది అధికారులు వెళ్లగా తాను సర్వేలో పాల్గొనబోనంటూ వివరాలు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు. దీంతో సర్వే అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసానికి సర్వే అధికారులు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండటంతో వారు వెనుదిరిగారు. కాసేపటి తర్వాత ఇరువురి నివాసాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటామని అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment