Monday 11 August 2014

మోదీది ఫాసిస్టు చర్య: కేసీఆర్‌

మోదీది ఫాసిస్టు చర్య: కేసీఆర్‌

Published at: 09-08-2014 07:08 AM
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అధికారాలను కబళించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం.. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, వాటిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల అధికారాలను కబ్జా చేయడమని కేసీఆర్‌ వాదిస్తున్నారు. కేంద్రం నుంచి లేఖ వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే హుటాహుటిన ఆయన ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు. లేఖలోని అంశాలపై సమగ్ర సమాచారం తెప్పించుకున్న మీదట.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు పలువురు ముఖ్యమంత్రులతో కూడా ఫోన్లో మాట్లాడి కేంద్రంతో పోరాటానికి సహకరించాలని కోరారు. కేంద్రం పంపిన లేఖ అప్రజాస్వామికంగా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని సీఎం తిప్పికొట్టారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్‌ రాజీవ్‌ శర్మకు ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ లేఖలోని అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను పట్టించుకోబోమని, వాటిని అమలు చేయబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరిస్తూ కేంద్ర పంపిన లేఖను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపాలని ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణిని ప్రతిఘటించడానికి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

No comments:

Post a Comment