Sunday, 3 August 2014

రుణ మాఫీపై ఉత్తర్వులు జారీ


రుణ మాఫీపై ఉత్తర్వులు జారీ

Published at: 03-08-2014 07:19 AM
-   ఏపీలో కుటుంబానికి లక్షన్నర..  డ్వాక్రా సంఘానికి లక్ష
-   మాఫీ మొత్తం నేరుగా అకౌంట్లలోకి: మంత్రి పుల్లారావు

హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రుణమాఫీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ రైతులకు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చల్లని కబు రు అందించింది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగానికి ఊరటనిచ్చింది. ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర చొప్పున.. డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల చొప్పున రుణ మాఫీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు శనివారం ప్రభుత్వ ఉత్తర్వు లు వెలువడ్డాయి. ఎన్నికల హామీలో భాగంగా రైతుల కు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కోటయ్య కమిటీని నియమించి.. దాని సిఫారసుల ప్రకారం కుటుంబానికి లక్షన్నర మాఫీ చేస్తామని ఇటీవల ప్రకటించారు కూడా. అయితే, ఒక కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా రుణమాఫీ మాత్రం ఒక్క రికి మాత్రమే వర్తించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జిల్లా సా ్థయి నుంచి కిందిస్థాయి అధికారులంతా రైతులకు తెలియజేసి వారిని చైతన్యం చేయాలని ప్రభుత్వం కోరింది. బ్యాంకుల నుంచి తిరిగి రుణం ఇప్పించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా, రుణాల రీషెడ్యూలుపై ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ ఉన్నతాధికారులతో చర్చించిన చంద్రబాబు సెక్యూరిటీ బాండ్లను గ్యారెంటీగా ఇచ్చి రైతుల రుణలను రీ షెడ్యూలు చేయించే యత్నంలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్‌కు ఇప్పటికే వివరించారు. త్వరలోనే దీని కి అనుమతి లభిస్తే ఈ ఖరీఫ్‌లో రైతులకు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు లభిం చే అవకాశం ఉంటుంది. రీషెడ్యూలు చేస్తే ఏడాదిపాటు మారటోరియంతోపాటు ఐదేళ్లలో పాత రుణాలను చెల్లించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది.
రైతుల ఖాతాల్లో లక్షన్నర జమ చేస్తాం: మంత్రి పుల్లారావు
తాడికొండ: రుణమాఫీ పథకం కింద ఇవ్వనున్న లక్షన్నర రూపాయలను రెండు నెలల్లో ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా లాం వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం ఆయన ఈ విషయం చెప్పారు. రుణాలు చెల్లించిన రైతులకు కూడా వారి అకౌంట్లలో రుణమాఫీ కింద రూ.లక్షన్నర జమ చేయాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఈ విషయంలో రైతులకు ఎలాంటి సందేహాలు వద్దన్నారు. అలాగే డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాలు చెల్లించి ఉంటే.. వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు. కాగా, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా ఈ ఏడాది రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పుల్లారావు తెలిపారు. రైతులకు అవసరమైనచోట గిడ్డంగులను నిర్మిస్తామన్నారు.

No comments:

Post a Comment