Sunday 10 August 2014

పోలవరాన్ని ఆపడానికి మరో ఉద్యమం

పోలవరాన్ని ఆపడానికి మరో ఉద్యమం

Published at: 10-08-2014 03:10 AM
-  రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు: గద్దర్‌
-    యుద్ధానికి ఆదివాసీలు సిద్ధం: వరవరరావు
-   బహుళజాతి సంస్థల కోసమే: జీతన్‌ మరాండి
-    ఆదివాసీల పోరాటానికి అండగా ఉంటాం: దేవీప్రసాద్‌

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలను లెక్కచేయకుండా పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు నాలుగు రాష్ర్టాలకు చెందిన ఆదివాసీలు సిద్ధంగా ఉన్నారని, ఇందుకోసం మరో ఉద్యమాన్ని చేస్తామని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. శనివారం పీపుల్‌ అగెనెస్ట్‌ పోలవ రం ప్రాజెక్ట్‌ (పీఏపీపీ) ఆఽధ్వర్యంలో  పోలవరానికి వ్యతిరేకంగా సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ, తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలకు చెందిన ఆదివాసులతో పాటు.. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యంగాన్ని తుంగలో తొక్కుతున్నాయని ధ్వజమెత్తారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. యుద్ధం చేసైనా.. ప్రాణాలు తీసైనా సరే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆదివాసీలు ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నారని తెలిపారు. జార్ఖండ్‌ ఆదివాసీ కళాకారుడు జీతన్‌ మరాండి మాట్లాడుతూ.. బ్రిటీషు పాలనలో దేశ వనరులు ఆంగ్లేయులు దోచుకున్నట్లుగా నేటి పాలకులు బహుళజాతి సంస్థలకు అటవీ వనరులను దోచిపెడుతున్నారని మండిపడ్డారు.  హైకోర్డు సీనియ ర్‌ న్యాయవాది బొజ్జాతారకం మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంవల్ల అభి వృద్ధి జరగదన్నారు. టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ..  గిరిజన ఆదివాసుల పోరాటానికి పూర్తి మద్దతునిస్తామన్నారు. కాగా, ఆదివాసీలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రజా నాట్యమండలి పాడిన పాటలు ఆలోచింపజేశాయి.
కొమరం భీంలా ఉద్యమించాలి: న్యూడెమోక్రసీ
ఆదివాసీలను ముంచివేసే పోలవరం నిర్మాణాన్ని నిలిపివేసే వరకు ఆదివాసీలు కొమరం భీంలా ఉద్యమించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడె మో క్రసీ పిలుపునిచ్చింది. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్క రించుకుని పోలవరాన్ని వ్యతిరేకిస్తూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని బస్‌భవన్‌ నుంచి ఇందిపార్కు వరకు ప్రదర్శన నిర్వ హించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటే శ్వరరావు, కె.గోవర్ధన్‌, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు వి. సంధ్య మాట్లాడారు. ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
గిరిజన హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలి: కోదండరామ్‌
గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, గిరిజనులు, ఆదివాసీల ఉనికిని ప్రమాదంలో పడేసే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా వ్యతిరేకించాలని టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ పిలు పునిచ్చారు. ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ‘పోలవరం ముంపు ప్రాంత గిరిజన హక్కుల సాధన’ అనే అంశంపై ని ర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్మిస్తే భవిష్యత్‌లో రాజమండ్రి, కాకినాడ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

No comments:

Post a Comment