Friday, 15 August 2014

అభివృద్ధిలో నా సత్తా చూపిస్తా రాష్ట్రం మధ్యలోనే రాజధాని


అభివృద్ధిలో నా సత్తా చూపిస్తా రాష్ట్రం మధ్యలోనే రాజధాని

Published at: 16-08-2014 04:41 AM
భయపడి కాదు.. ప్రజలకు అందుబాటులో ఉండాలనే శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు
పదేళ్లూ హైదరాబాద్‌లో ఉంటా
2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం
మీడియాతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు
హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మధ్యలోనే  రాజధాని ఉంటుంది. ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. ప్రజలకు పాలన అందుబాటులో ఉంచేందుకే శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలిస్తున్నాం. ఎవరికో భయపడి కాదు.’  అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు మధ్యలో ఉండాలనే   విజయవాడ-గుంటూరు మధ్యలో తాత్కాలిక రాజధానిని ఎంచుకున్నామని అక్కడ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అయితే తాను మరో పదేళ్ల్లపాటు హైదరాబాద్‌లో ఉంటానన్నారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అభివృద్ధిని పరుగులు తీయిస్తానన్నారు. రాజధాని స్థల ఎంపికపై శివరామకృష్ణన్‌ కమిటీ సర్వే  చేస్తుందని,  ఆ కమిటీ కంటే  రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.  రాజధానికి భూముల సేకరణ విషయంలో ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. 
రైతులు భూములిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించి 60:40 నిష్పత్తిలో భూములను అభివృద్ధి చేసి వారికి  ఇస్తామన్నారు. పది రెట్లు భూముల విలువు పెరిగే అవకాశముందన్నారు. వ్యవసాయ భూములను రాజధానికి ఉపయోగించడం ద్వారా ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గే అవకాశముందన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆ భూములకు ఇవ్వాల్సిన నీటిని రాయలసీమకు మళ్లించి అక్కడ వ్యవసాయోత్పత్తులను పెంచుతామన్నారు. అన్నీ జిల్లాలను అభివృద్ధి చేసి ఒక వ్యూహం ప్రకారం ఫలాలను ప్రణాళికాయుతంగా సమంగా పంచుతామన్నారు.  తెలుగు రాషా్ట్రలు రెండింటిని  కలిసి అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చాలా సార్లు ఆహ్వానించానని...  ఆయన స్పందించలేదన్నారు.  పీపీఏల విషయంలో ఒకడుగు ముందేకేశారేమో?  అన్న ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్‌ హక్కులనే ప్రస్తావించాను తప్ప కవ్వింపు చర్యలు పాల్పడలేదన్నారు. గవర్నర్‌ చొరవ తీసుకుని కేసీఆర్‌తో చర్చలు ఏర్పాటు చేస్తే తాను పాల్గొంటానని, తనకేమీ చిన్నతనం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  ఆదాయ వనరుల పెంపుదలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశానని,  త్వరలో ఆ కమిటీ రిపోర్టు ఇస్తుందన్నారు.  ఏ జిల్లాలో ఏ విధంగా ఆదాయం పెంచువచ్చో కమిటీ  నివేదిక ఇస్తుందన్నారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని స్పష్టం చేశారు.  రెండు రాషా్ట్రల మధ్య వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి కదా? అన్న విలేకరుల అభిప్రాయంపై  కేంద్రం వేచి చూస్తుందని తెలిపారు. పరస్పరం పరిష్కరించుకోకపోతే సమయ, సందర్భాన్ని బట్టి కేంద్రమే రంగంలోకి దిగుతుందన్నారు.

No comments:

Post a Comment