Friday, 1 August 2014

తెలంగాణ విద్యార్థులకే ఫీజులు, పొరుగు రాష్ట్రాల వారికి చెల్లించబోము : కేసీఆర్

తెలంగాణ విద్యార్థులకే ఫీజులు, పొరుగు రాష్ట్రాల వారికి చెల్లించబోము : కేసీఆర్

Published at: 01-08-2014 14:16 PM
హైదరాబాద్, ఆగష్టు 1 : తెలంగాణ విద్యార్థులకే మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, పొరుగు రాష్ట్రాల వారికి చెల్లించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే కోసం హెచ్ఐసీసీలో శుక్రవారం ఉదయం జరిగిన సన్నాహక సదస్సులో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీ రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం ఎంతో ఒత్తిని ఎదుర్కుంటోందన్నారు. అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామని ఆయన చెప్పారు.
విద్యార్థుల స్థానికతను ధృవీకరించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పు ఇచ్చాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఫీ రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆందోళన అవసరంలేదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. అధికారులు చేసే చిన్న పొరపాటుకు భవిష్యత్ తరాలు నష్టపోకూడదన్నారు. తప్పుడు ద్రువీకరణ పత్రాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. తర్వాత ప్రభుత్వాన్ని నిందిస్తే ఉపయోగం ఉందని ఆయన అన్నారు.
ఏ జిల్లాలోనూ తప్పుడు సర్టిఫికెట్లు ఉండొద్దని, తప్పుడు «ద్రువీకరణ పత్రాలు వస్తే కలెక్టర్లదే బాధ్యత కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 20 లక్షలకు పైగా అదనపు రేషన్‌కార్డులు ఉన్నాయని, వాటి వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లితుంద న్నారు. ఖజానాకు ప్రభుత్వం ధర్మకర్తగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలన్నీ కంప్యూటరీకరించాలని, ప్రభుత్వ ని«ధలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణలో 12 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, అర్బన్‌లో 3 లక్షలు, గ్రామాల్లో 9 లక్షల దళితుల కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామని, సర్వేలో వాస్తవాలు తేల్చాలని అధికారులకు తెలియజేశారు. వ్యవసాయానికి అనుకూలంగాలేని భూములను పరిశ్రమలకు వాడనున్నట్లు ఆయన చెప్పారు. భూమిలేని దళిత కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని, మూడెకరాల భూమి ఖచ్చితంగా ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment