తెలంగాణ సినిమా ఇరాన్ మార్గం
8/17/2014
8/17/2014
మానవజాతి చరిత్రలో జరిగిన విముక్తి పోరాటాలన్నింటికీ కారణాలు రెండే రెండు. ఒకటి అస్తిత్వ కాంక్ష! రెండోది ఆత్మగౌరవ ఆకాంక్ష. ఈ రెండు కారణాలే స్వాతంత్యోద్యమానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మార్గాల్ని వేసాయనేది వాస్తవం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాజకీయంగా, భౌగోళికంగా తెలంగాణ ప్రజలు విముక్తులయ్యారు. కానీ సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, సినిమాల పరంగా ఆ విముక్తి ఇంకా జరగాల్సివుంది. సాంస్కృతిక కళారూపలన్నిట్లోనూ సినిమాది అగ్ర ప్రాధాన్యత అనడంలో సందేహంలేదు. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని , ఆత్మగౌరవాన్ని గత ఆరు దశాబ్దాలుగా తృణీకరిస్తూ వలస పాలకుల ఆధితప్య ధోరణిని తెలంగాణ నేలమీద సైతం బలోపేతం చేసిన కారకాలలో తెలుగు సినిమా చూపించిన ప్రభావం, పోషించిన పాత్ర అనన్యసామాన్యం. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా నుంచి తెలంగాణ సినిమాని విముక్తం చేయాలనే ప్రయత్నాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి.
అయితే తెలుగు సినీ పరిశ్రమ పేరిట బలంగా పాతుకుపోయిన వలస సంస్కృతుల బారి నుండి తెలంగాణ సినిమాకు సొంత గ్రామర్ రూపొందించడం సాధ్యమా? అసలు తెలంగాణ సినిమా అస్తిత్వాన్ని తెలుగు సినిమా సునామీ నుండి తట్టుకొని నిలబడగలిగేలా చేయగలమా? తెలుగు సినిమా తరహా మాస్ మసాలా వినోదాత్మక చిత్రాలకు అలవాటు పడిన తెలంగాణ ప్రేక్షకుల దృష్టిని తెలంగాణ సినిమాల వైపు మళ్ళించగలమా? ఇంకా ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ తెలంగాణ నేల మీద ఉన్న థియేటర్‌లలో సైతం తెలుగు సినిమాలు కాకుండా తెలంగాణ సినిమాలను నడపగలమా? మెయిన్‌స్ట్రీమ్ తెలుగు సినిమాల ధాటికి తట్టుకొని నిలబడగలిగే తెలంగాణ సినిమాలను సృష్టించగలమా? కనీసం దీర్ఘకాలంలో అయినా తెలుగు సినిమా ప్రభావం లేని తెలంగాణ సినిమాలని బ్రాడ్‌గా బిల్డ్ చేయగలమా?...ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నల దొంతరలు, మరెన్నో సందేహాల తెరలు ఇప్పుడు సగటు తెలంగాణ సినీ అభిమానిని తొలుస్తున్నాయి. ఈ ఆందోళన వెనుక వాస్తవం ఉందనేది నిజమే. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర పోరాటం ఇచ్చిన స్ఫూర్తిని మరొక్కసారి మననం చేసుకుని, అదే పోరాట వ్యూహాలను, నైపుణ్యాలను తెలంగాణ సినిమా విషయంలో కూడా అనుసరించినట్లయితే ప్రత్యేక తెలంగాణ సినిమా అనేది అసాధ్యం కాదనేది గుర్తించాలి.
ఈ సమయంలోనే, సంస్కృతిలో భాగంగా సినిమాలకు సొంత అస్తిత్వాన్ని అందించడానికి ఆయా దేశాలు, రాష్ర్టాలలో ఎలాంటి చర్యలను అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు చేపట్టాయో విశ్లేషణాత్మకంగానూ, ఆచరణాత్మకంగానూ పరిశీలించాలి. అలాంటి పరిశీలనను లోతుగా జరిపినపుడు ప్రస్తుతం తెలంగాణ సినిమా పై సంధిస్తున్న ప్రశ్నలన్నింటికీ ఒక ఒయాసిస్సు లాంటి సమాధానం మనకు ఇరాన్ సినిమాలలో కనిపిస్తుందని చెప్పవచ్చు.
ఇరాన్ సినిమాల ప్రత్యేక ముద్ర
సమకాలీన ప్రపంచ సినిమా రంగంలో ఇరాన్ సినిమాలది ప్రత్యేక ముద్ర! భాష పర్షియన్ అయినప్పటికీ ఈ సినిమాలలోని కథావస్తువులన్నీ సార్వత్రిక మానవీయ విలువలకు, భావోద్వేగాలకు పట్టం కట్టేలా ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ సినిమా అంటే సున్నితమైన మానవ సంబంధాలకు, సునిశితమైన ప్రకృతి-మానవ అనుబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని సినీరంగాలకు , అందరు టాప్ డైరెక్టర్స్‌కు ఇరాన్ సినిమాలు ఓ మోడల్, ఓ లెస్సన్స్ అనే స్థాయికి ఎదిగాయి. ఆ మాటకొస్తే ప్రపంచస్థాయిలో అత్యున్నత స్థాయికి వెళ్శిన ప్రతి దర్శకుడిపైన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇరాన్ సినిమాల ప్రభావం అనివార్యం అనేంతగా అవి విస్తరించాయి. మిగతా సినీ ప్రపంచానికి, సినీ సూత్రాలకి అసలు కథే కాదనుకున్న కథా వస్తువులతో ఇరాన్‌లో సినిమాలు తీయడమే కాక, ఇలా కూడా సినిమాలు తీయవచ్చా? అనే ఆలోచనను అందరిలో రేకెత్తించే స్థాయికి ఇరాన్ సినిమాలు ఇప్పుడు ఎదిగాయి. అలా అని ఈ సినిమాలు ఏ హాలీవుడ్ స్థాయి భారీ బడ్జెట్‌లు, భారీ సాంకేతిక నైపుణ్యాలు, గ్రాఫికల్ యానిమేషన్స్‌తో చేస్తారనుకొంటే పొరపాటే. ఈ సినిమాలన్నీ వెరీ-లో బడ్జెట్ సినిమాలు. ఆ మాటకొస్తే బాలీవుడ్, టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో సినిమాకయ్యే బడ్జెట్‌తో ఇరాన్‌లో ఏకంగా 15 సినిమాలు తీయొచ్చు. (బడ్జెట్ 30 కోట్లు అనుకుంటే!)

ఇరాన్ సినిమాల ఫార్ములా
ఇరాన్ సినిమాలలో ప్రధానమైన క్రియేటివ్ వర్క్ అంతా స్క్రిప్ట్ దశలోనే జరుగుతుందని చెప్పాలి. ఆ లెక్కన ఈ సినిమాల బడ్జెట్ 30 శాతం అయితే, క్రియేటివిటీ, బ్రెయిన్ వర్క్70 శాతం ఉంటుందని చెప్పాలి. అంత చిక్కని, చక్కని కథలు, కెమెరా వర్క్‌లో సృజనాత్మకత, లొకేషన్స్, క్యారెక్టర్స్, నటుల ఎంపికలో శ్రద్ధ ఈ సినిమాలలోని ప్రధాన సూత్రాలు. స్క్రిప్ట్ వర్క్ అయితే ఈ సినిమాలకు వెన్నెముక. సినిమా అంటే 90 శాతం స్క్రిప్ట్ 10 శాతం షూటింగ్ అని తలలు పండిన ప్రపంచస్థాయి ఫిలింమేకర్స్ చెబుతారు. ఈ మాటలకు ప్రత్యక్షసత్యాలుగా ఇరాన్ సినిమాలు ఉంటాయి.

ఇక కథావస్తువు విషయానికొస్తే, ఈ సినిమాలన్నీ ప్రధానంగా కుటుంబ కథలు, చిన్నపిల్లల కథలు, స్త్రీ పురుషసంబంధాలు, నిరుద్యోగం, యుద్ధం, ప్రకృతితో మనిషి అనుబంధాలు, రాజకీయ నేపథ్య చిత్రాలు, కాలేజి నేపథ్య కథలు, సామాజిక పరిణామ చిత్రణలతో కూడి ఉంటాయి. ఈ కథలన్నింటిలోనూ హృదయాలను తట్టిలేపే కుటుంబ అనుబంధాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆలోచనాత్మక కథనాలు, హృద్యమైన సన్నివేశాలు ఈ సినిమాలలో ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే అంశాలు.
కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనేది కళాపరిణామ ప్రస్థానంలో ఒక దశ అయితే ఇరాన్ సినిమా ఒకడుగు ముందుకు వేసి సినిమా కళ ప్రజా వికాసం కోసం అనే మాటని తన సినిమాల ద్వారా రుజువు చేసింది. దీనికి భిన్నంగా హాలీవుడ్, బాలీవుడ్, తెలుగు సినిమా వంటి కమర్షియల్ సినీ రంగాలలో వినోదమే ప్రధాన స్థానంగా వుంటుంది. కానీ ఈ ఇరాన్ సినిమాలలో రియాలిటీకి దగ్గరగా వుండే వినోదం వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే వికాసం ప్రముఖ స్థానంలో నిలుస్థాయి.
ఇరాన్ సినిమాలలో ఏం జరిగింది?
ఇరాన్‌లో ఈ తరహా హ్యూమన్ టచ్ స్టోరీస్ సినిమాలుగా రావడం వెనుక వున్న ప్రధాన కారణం ఏంటో తెలుసా? ప్రభుత్వం! ప్రభావవంతమైన కళారూపమైన సినిమాలపై ఏ నియంత్రణ లేని చోట ఎలాంటి వెర్రితలలు వేస్తున్న సినిమాలు వస్తున్నాయో మనందరం చూస్త్తున్నదే!. భావప్రకటన స్వేచ్ఛ, క్రియేటివ్ ఫ్రీడమ్, ఆర్టిస్టిక్ లిబర్టీల పేరిట సినిమాలలోని కథలు, సినిమా చిత్రీకరణలు ఎంత విపరీత విలువలని, అవాస్తవిక కథనాలని వండి వడ్డిస్తున్నాయనే దానికి మన తెలుగు సినిమాలే నిదర్శనం. అయితే ఇరాన్‌లో నాలుగు దశాబ్దాల క్రితం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత ఇరాన్ సినిమాల ముఖ చిత్రాన్ని మార్చేసింది. సహజంగానే ఇరాన్ దేశానికి అత్యంత ఘనమైన ప్రాచీన చరిత్ర, వారసత్వం ఉన్నాయి. తొలినాటి నాగరికతలలో ఒకటైన పర్షియన్ నాగరికత ఇక్కడిదే. అలాగే పర్షియన్ సాహిత్యం, కవిత్వం, వాస్తుశిల్పం, కళలు అన్నీ ఇరాన్ దేశంలో కళాత్మక విలువలకు పునాదులు వేసాయి.
ఇరాన్ దేశం ముస్లిం మత చట్టాల ప్రకారం ప్రభుత్వం అధీనంలో నడిచే దేశం. 1979లో వచ్చిన ఇరాన్ విప్లవం తర్వాత అక్కడ ఏర్పడిన ప్రభుత్వం సంస్కృతి విషయంలో ప్రభుత్వ విధానాన్ని కూడా రూపొందించింది. దానిలో భాగంగా అక్కడి సినిమాలకు, సినీ దర్శకనిర్మాతలకు కొన్ని పరిమితులను విధించింది. ఆ పరిమితులలో ప్రధాన పరిమితి ఏమిటో తెలుసా? సెక్స్, క్రైమ్, వయొలెన్స్, వెస్ట్రనైజేషన్(పాశ్చ్యాత్యీకరణ) ప్రతీకలు...ఈ నాలుగు లేని కథలలో సినిమాలు తీయాలి అనేదే ఆ పరిమితి! అసలు సినిమాలలో ఈ నాలుగు అంశాలు లేకుండా తీయడం అనేది ఎంతో కష్టం. మనం చూస్తున్న సోకాల్డ్ సినిమాలన్నింటికీ (హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా) ఈ నాలుగు అంశాలే ముడి సరుకులు. అలాంటిది ఆ ముడి సరుకులు లేకుండా కథా చిత్రాలను నిర్మించాలనే సవాలు అప్పట్లో ఆనాటి ఇరాన్ దర్శక నిర్మాతల ముందు నిలిచింది.

ఈ పరిమితిని చూసి నివ్వెరపోయిన కమర్షియల్ మాస్ సినీ మేకర్స్ అందరూ వెంటనే రీలు,పేపర్స్ సర్దుకుని వెనక్కి వెళ్శిపోయారు. ఇక్కడే ఎడ్వర్డ్ డిబోనో చెప్పినట్లు లిటరల్ థింకింగ్ ప్రిన్సిపుల్ తీవ్రంగా పనిచేసింది. ఈ సూత్రం ప్రకారం దారులన్నీ మూసుకుపోయినపుడు మనిషి మస్తిష్కం మరింత చురుకుగా పనిచేస్తుందట! సినిమాని కమర్షియల్‌గా చూసిన దర్శకనిర్మాతలందరూ తోకముడిచి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ సినిమా కళ మీద నిజమైన నిజాయితీతో కూడిన ప్రేమ, గౌరవం ఉన్న దర్శకనిర్మాతలు మాత్రం ఈ ఆటంకాన్ని తమ సృజనాత్మక ప్రతిభకు సవాలుగా భావించారు. అలా భావించిన వారిలో మొదటివాడు సోహ్రాబ్ షహీద్ సలేస్ సినిమాలంటే ఆయనకు తీవ్రమైన వ్యామోహం..వ్యాపారం కాదు! అందుకే అప్పటివరకూ ఉన్న సినీ ఫార్ములాలకు భిన్నంగా సెక్స్, వయొలెన్స్, క్రైమ్ వెస్టర్న్ కల్చర్ లేని కథలకోసం అన్వేషించాడు. చివరికి సక్సెస్ అయ్యాడు. కుటుంబ విలువలు మానవ సంబంధాలు, చిన్న పిల్లల ఇతివృత్తాలతో సినిమాలు రూపొందించాడు. అలా వచ్చినవే ఎ సింపుల్ ఈవెంట్ (1973), స్టిల్ లైఫ్(1974) సినిమాలు!
అలాగే అబ్బాస్ కియోరెష్టమీ (ది రిపోర్ట్ -1977, దిటేస్ట్ ఆఫ్ చెర్రీ-1997, వేర్ ఈజ్ మై ఫ్రెండ్స్ హోమ్ -1987, అండ్ లైఫ్ గోస్ ఆన్-1992), మజిద్ మజిదీ (చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ -1998, కలర్ ఆఫ్ ప్యారడైజ్- 2000, ది విల్లో ట్రీ-2005), జాఫర్ పనాహీ (ది వైట్ బెలూన్ -1995, ది మిర్రర్ 1997) వంటి దర్శకులు వరుసగా సినిమాలను తీసి ఇరానియన్ సినిమాకు మానవ సంబధాల కథలనే పునాదులుగా నిర్మించారు. వీరు తీసిన ఈ సినిమాలు హాలీవుడ్ వంటి ఇతర సినీరంగాలకు భిన్వత్వాన్ని, సహజత్వాన్ని, సున్నితత్వాన్ని అనుభవంలోకి తెచ్చాయి. అలా క్రమంగా ప్రపంచ సినీ యవనికపై ఇరాన్ చిత్రాలు తిరుగులేని మార్క్‌ను వేయగలిగాయి. అలాగే మొహిసిన్ మక్‌మల్ బఫ్ తీసిన ది సైక్లిస్ట్ (1987), టైమ్ ఆఫ్ లవ్(1990) సినిమాలు కూడా దీనికి తోడయ్యాయి. ఇరాన్‌లో పూర్తి స్థాయి సినిమాల నిర్మాణం ప్రపంచ సినిమాతో పోల్చుకుంటే ఆలస్యంగానే మొదలైనప్పటికీ అక్కడి ప్రభుత్వ విధానము, దర్శకుల సృజనాత్మకత వల్ల అనతికాలంలోనే ఇరాన్ సినిమా అంతర్జాతీయంగా తనదైన ప్రత్యేకతను సాధించడంలో సఫలీకృతమైంది.
తెలంగాణ సినిమా - ఇరాన్ సినిమాలు
తులనాత్మక దృష్టితో కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇరాన్ సినిమా తెలంగాణ సినిమాల మధ్య పోలికలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇరాన్‌లో న్యూఐడియాలజీతో తీసిన న్యూవేవ్ సినిమాలు తెరకెక్కిన కాలం(1970వ దశకం)లోనే తెలంగాణ నేపథ్యంలో హిందీ సినిమా అంకుర్ (1974) విడుదలయింది. ఆ తర్వాత చిల్లర దేవుళ్ళు(1975),మృణాల్ సేన్ ఒక ఊరికథ (1977) మాభూమి (1979) వంటి పూర్తిస్థాయి తెలంగాణ సినిమాలు నిర్మాణమైనాయి. ఇవి ఇచ్చిన ఊపుతో మరిన్ని తెలంగాణ సినిమాలు రావలసి ఉండేది. కానీ తెలుగు సినీరంగం ఉక్కుపాదాల కింద నలిగిపోయి తెలంగాణ సినిమా వెనక్కి వెళ్ళింది. అదే కాలంలో ఇరాన్‌లో ఈ తరహా సెన్సిటివ్ సినిమా క్రమక్రమంగా ఎదిగి బ్రాండ్ ఇరానియన్ సినిమాగా స్థిరపడింది. మా భూమి పరంపర కూడా తెలంగాణ సినిమాలలో కొనసాగితే ఇప్పటికే బ్రాండ్ తెలంగాణ సినిమా కూడా ఎస్టాబ్లిష్ అయ్యేదేమో!

ఇక ప్రస్తుతం తెలంగాణ సినీరంగం కూడా 1970 దశకం నాటి ఇరాన్ సినిమా పరిస్థితి దగ్గరే ఆగిపోయింది. పైగా మాస్ మసాలా కమర్షియల్ అవాస్తవికతతో పేట్రేగిపోతున్న తెలుగు సినిమా నీడ నుంచి, తెలంగాణ సినిమా విముక్తి కావాల్సి ఉంది. ఇది జరగాలంటే ఇప్పుడున్న ఒకే ఒక్కమార్గం-ఇరాన్ మార్గమే అని చెప్పాలి. ఇరాన్ తరహాలో ప్రభుత్వ ప్రమేయం, ప్రభుత్వ చొరవ, ప్రభుత్వవిధానమే శరణ్యం అనేది నిర్వివాదాంశం. దాసి, మట్టి మనుషులు బజార్, మండీ వంటి సినిమాల ద్వారా,హైదరాబాద్ బ్లూస్, ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ వంటి ప్రయోగాల ద్వారా ఇప్పటికే తెలంగాణ సినిమా జాతీయస్థాయి ప్రఖ్యాతిని సాధించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇరాన్ తరహాలో విధాన నిర్ణయం తీసుకుంటే, తెలంగాణ సినిమాలు కూడా కమర్షియల్ విజయాన్ని, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించడం కష్టమేమీకాదు!
మామిడి హరికృష్ణ
మామిడి హరికృష్ణ
No comments:
Post a Comment