మాదకద్రవ్యాల కేసులో జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్ అరెస్టు, ప్రముఖులు పెడదారి పడితే యువత చెడిపోతుందని చైనా ప్రభుత్వ వాదన
బీజింగ్, ఆగస్టు 19 : సుప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ నటుడు జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్‌ను చైనా పోలీసులు అరెస్టు చేశారు. జేసీ చాన్ మాదక ద్రవ్యాలకు అలవాటుపడడమే ఈ అరెస్టుకు కారణంగా తెలుస్తున్నది. క్రిందటి గురువారంనాడు బీజింగ్ పోలీసులు జేసీని అరెస్టు చేశారు. తైవాన్ నటుడు కైకోను కూడా ఇవే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయాన్ని పోలీసులే అధికారికంగా వెల్లడించారు. జాకీకి ఈ విషయం తెలిసి షూటింగులు రద్దు చేసుకుని వెంటనే హుటాహుటిన బీజింగ్‌కు బయలుదేరాడు. జేపీ చాన్ ఇంట్లో కూడా మాదక ద్రవ్యాలు దొరికాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఆరోపణలు రుజువైతే జేపీ చాన్‌కు కనీసం మూడేళ్లు జైలు శిక్ష తప్పదని భావిస్తున్నారు.
సినీ నటుల ప్రభావం సమాజంపై చాలా ఉంటుందని చైనా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే సమాజంలో ఆదర్శంగా నిలవవలసినవారు ఇలా పెడద్రోవ పడితే ఎలా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు నెలల క్రితం ఈ అంశంపై మాట్లాడుతూ దేశానికి ఆదర్శప్రాయంగా ఉండవలసిన ప్రముఖులు దురలవాట్లకు దూరంగా ఉండడం చైనా సమాజానికి చాలా అవసరమని పిలుపు ఇచ్చారు.
ఇటీవల కాలంలో చైనాలో సుప్రసిద్ధులు పెక్కుమందిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం మాదక ద్రవ్యాలే. ప్రజలను ప్రభావితం చేసే వాణిజ్య ప్రకటనలలో ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన నటీనటులను వినియోగించేది లేదని దాదాపు 40 వాణిజ్య సంస్థలు చైనా ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేశాయి.
చైనాలో అవార్డు చిత్రాల నటుడు అయిన కైకో తాను చేసిన పనికి చింతిస్తున్నానని, సమాజం తనను క్షమించాలని, ఇటువంటిది మరోసారి జరగకుండా చూసుకుంటానని ప్రకటించాడు. జాకీ చాన్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా జాకీ కుమారుడు జేసీ నడవడికను మళ్లీ గాడిలో పెట్టడానికి తాము చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలియజేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

No comments:
Post a Comment