Wednesday 20 August 2014

మార్కెటింగ్‌.. షోకేసింగ్‌కే సింగపూర్‌

మార్కెటింగ్‌.. షోకేసింగ్‌కే సింగపూర్‌

Published at: 20-08-2014 05:45 AM
-   అవినీతిరహిత రాష్ట్రంగా తెలంగాణ
-    ఇక్కడా సింగపూర్‌ సింగిల్‌విండో విధానం
-    కారులో సింగపూర్‌ టూ కౌలాలంపూర్‌
-    మలేషియా నుంచి నేర్చుకోవాల్సింది
     చాలా ఉంది: సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ మార్కెటింగ్‌, షోకేసింగ్‌ కోసమే సింగపూర్‌కు వెళుతున్నా’’  అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెల్లడించారు. సింగపూర్‌లో ఐఐఎం పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరు కావడానికి వెళుతున్న ఆయన తన పర్యటన విశేషాలను వివరించారు. సింగపూర్‌ వెళ్లడానికి ముందు క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కొత్త రాష్ట్రం.. కొత్త కాన్సెప్ట్‌’ పేరిట తనకొక్కరికే ఆహ్వానం అందిందని తెలిపారు. సింగపూర్‌ జీరో గ్రాఫ్ట్‌ (అవినీతి రహిత ప్రాంతం) నగరమని, అవినీతి లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి ఈ పర్యటన ఉపయుక్తంగా ఉంటుందని ఐఐఎం పూర్వ విద్యార్థులు వివరించడం వల్లే అక్కడికి వెళుతున్నానని చెప్పారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల భేటీలో తెలంగాణలో అవకాశాలను వివరిస్తామని తెలిపారు. సింగపూర్‌లో పరిశ్రమల అనుమతులకు సింగిల్‌ విండో విధానం అమల్లో ఉందని, దానిని తెలంగాణలోనూ అమలు చేస్తామని చెప్పారు. సింగపూర్‌ పర్యటన తర్వాత కౌలాలంపూర్‌ దాకా కారులో టూర్‌ ఉంటుందని, దారిలో ప్రాంతాలను చూసుకుంటూ వెళతామని, తెలంగాణలో శాటిలైట్‌ సిటీలను నిర్మించడానికి ఈ టూర్‌ దోహదపడగలదని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలు పరిమితంగానే పని చేయగలవని.. కానీ, మలేషియాలో ప్రజా ప్రభుత్వమే ఉన్నా.. అక్కడ పాలన బాగుందని, మలేషియా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు.

విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్

Published at: 20-08-2014 10:54 AM
హైదరాబాద్,ఆగష్టు 20 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు బయలుదేరివెళ్లారు. నాలుగు రోజుల పాటు కేసీఆర్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. కేసీఆర్ వెంట ఆర్థిక మంత్రి ఈటెల, పారిశ్రామికవేత్తల బృందం ఉన్నారు.

No comments:

Post a Comment