Tuesday 12 August 2014

నెలాఖరుకు తేల్చేస్తాం

నెలాఖరుకు తేల్చేస్తాం

Published at: 11-08-2014 04:46 AM
ఒంగోలు, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఎంపికపై ఈ నెలాఖరులోగా కేంద్రానికి  నివేదిక అందజేస్తామని శివరామకృష్ణన్‌ కమిటీ వెల్లడించింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటుకు సిఫారసు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.  రాజధానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీలో సభ్యులైన ఆరోవర్‌ రవి, తిమ్మారెడ్డి, టి. రవీంద్రన్‌ ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. రాజధాని ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో అభిప్రాయ సేకరణ జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అందుకోసం అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజధాని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని, దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న  చిన్న నగరాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పారు.
దేశంలోని మిగిలిన అన్ని రాషా్ట్రలకన్నా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉందని.. గ్రామీణ జనాభా ఎక్కువ సంఖ్యలో ఉందని తెలిపారు. ఈ దృష్ట్యా జాతీయ రహదారులు, నీటి లభ్యత, విమాన, రైలు మార్గాలు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రాజధానిని తీర ప్రాంతంలో ఏర్పాటు చేయటం అంత శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.  రాజధాని ఏర్పాటు వలన ప్రకృతి వనరులకు ఎలాంటి నష్టం కలగకూడదని చెప్పారు. అదే విధంగా పంట పొలాలను సేకరించి రాజధాని నిర్మించాలనడాన్ని సమర్థింబోమన్నారు. భూసేకరణకు ఎక్కువ మొత్తంలో ఖర్చుచేస్తే ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. చైనాలో సాగు భూములను ఇతర అవ సరాలకు వినియోగించి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాజధానిని పోరంబోకు భూముల్లోనే నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చెప్పారు.
కాగా జిల్లాలో పర్యటించిన శివరామకృష్ణన్‌ కమిటీ సభ్యులు కొత్తపట్నం మండలంలో వాన్‌పిక్‌ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను పరిశీలించారు. 
కాగా.. జిల్లాలో పర్యటించిన శివరామకృష్ణన్‌ కమిటీ సభ్యులకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులనుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. రాజధానికి అవసరమైన వనరులన్నీ ప్రకాశం జిల్లాలో ఉన్నందున రాజధానిని ఇక్కడే ఏర్పాటు చేయాలని పలువురు విన్నవించారు. ప్రకాశం జిల్లా.. అటు రాయలసీమకు ఇటు కోస్తా జిల్లాలకు మధ్యలో ఉన్న విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు. జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని చెప్పారు. ప్రకాశంలో రాజధానిని నిర్మించడం వల్ల రాయలసీమ జిల్లాల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.   వాన్‌పిక్‌ భూముల్లో ఒంగోలు కేంద్రంగా రాజధాని నిర్మాణం చేపట్టాలని కొంతమంది ప్రతిపాదించగా, మరికొందరు దొనకొండలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నందున ఆ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ముందుగా కలెక్టర్‌ విజయకుమార్‌ జిల్లాలో ఉన్న వన రులు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు.
జిల్లాలో వనరులు అపారం : మంత్రి శిద్దా
రాజధాని ఏర్పాటుకు జిల్లాలో అపారమైన వనరులున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు శివరామకృష్ణన్‌ కమిటీ సభ్యులకు తెలిపారు.   దొన కొండ ప్రాంతంలోని వివిధ మండలాల్లో 65 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దొనకొండకు చుట్టుపక్కల ఉన్న కురిచేడు, దర్శి, తాళ్లూరు తదితర మండలాల్లో కూడా భూములున్నాయని చెప్పారు.
 

No comments:

Post a Comment