రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు మార్పు : మంత్రి కామినేని
హైదరాబాద్, ఆగష్టు 19 : రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇకపై ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా కొనసాగనుంది. మంగళవారం అసెంబ్లీలో మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీలో తలెత్తున్న సమస్యలపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఆర్యోగ శ్రీ వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్లక్ష్యానికి గురైన మాట వాస్తవమే అని ఆయన అన్నారు. సమస్యలను అధిగమించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. యూసర్ చార్జీలు వసూలు చేసే అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.
No comments:
Post a Comment