Friday, 1 August 2014

1956 స్థానికత అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం : సుధీర్‌రెడ్డి

1956 స్థానికత అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం : సుధీర్‌రెడ్డి

Published at: 01-08-2014 16:55 PM
హైదరాబాద్, ఆగస్టు 1 : 1956 స్థానికత అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారు. విదేశాల్లో పదేళ్లు ఉంటే అక్కడి పౌరసత్వాన్ని ఇస్తారని తెలంగాణలో స్థానికతకు 60 యేళ్లు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతి విద్యార్థికి ఫీజు రిఇంబర్స్‌మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం సుధీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పుట్టినవారి, సెటిలర్ల పిల్లలకు ఫీజు రిఇంబర్స్‌మెంట్ వర్తించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి విషయానికి స్థానికతనో, తెలంగాణ అనో సెంటిమెంట్‌తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment