Sunday, 29 June 2014

ఇద్దరు గెయిల్ జీఎం స్థాయి అధికారుల సస్పెన్షన్

గ్యాస్ దుర్ఘటనలో ఇద్దరు గెయిల్ జీఎం స్థాయి అధికారుల సస్పెన్షన్

Published at: 29-06-2014 16:04 PM
హైదరాబాద్, జున్ 29 : తూర్పుగోదావరి జిల్లా నగరంలో గ్యాస్‌పేలుడు ఘటనలో ప్రాథమిక బాధ్యులుగా జీఎం స్థాయి అధికారులు పంకజ్‌పటేల్, రాకేష్‌ప్రసాద్‌లను ఉన్నతాధికారులు ఆదివారం సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని గెయిల్ అధికారి అశుతోష్‌కుమార్ తెలిపారు. అలాగే బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని గెయిల్ అధికారులు జిల్లా కలెక్టర్ నీతూకుమారికి అందజేశారు.
ప్రభుత్వ నియమించిన దర్యాప్తు కాకుండా గెయిల్ సంస్థ కూడా అంతర్గతంగా విచారణ జరుపుతుంది. ఇప్పటి వరకు మొత్తం 19 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా వెల్లడించారు. 19 మంది మృతులకు నష్టపరిహారం నిమిత్తం రూ. 3.80 కోట్లు చెక్కు రూపంలో ఇచ్చారు. గాయపడినవారికి చికిత్స నిమిత్తం రూ. 9 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఘటనాస్థలంలో హోంమంత్రి చేతుల మీదుగా నష్టపరిహారాన్ని అందజేయనున్నారు.

No comments:

Post a Comment