స్వరూపానంద పెద్దరికానికి ఇది పద్ధతికాదు..
బాబా వల్ల నా జీవితంలో అద్భుత ఘటనలు
పిస్తా,బాదం పప్పు తినేవాళ్లు స్వామీజీలు కారు
మీ అభిప్రాయాలను మా మీద రుద్దవద్దు
స్వరూపానంద వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందన
బాబా వల్ల నా జీవితంలో అద్భుత ఘటనలు
పిస్తా,బాదం పప్పు తినేవాళ్లు స్వామీజీలు కారు
మీ అభిప్రాయాలను మా మీద రుద్దవద్దు
స్వరూపానంద వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందన
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): షిర్డీ సాయినాథుడు దేవుడు కాడంటూ ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలను 'ఆంధ్రజ్యోతి'లో చూసి షాకయ్యానని నటుడు, నిర్మాత మోహన్‌బాబు చెప్పారు. తన దృష్టిలో షిర్డీ సాయి అంటే ఈశ్వరాంశ అనీ, బాబా వల్ల తన జీవితంలో ఎన్నో అద్భుత సంఘటనలు జరిగాయని తెలిపారు. షిర్డీ సాయి దేవుడు కాడనీ, ఆయనను పూజించకూడదనీ, ఇది విదేశీ సంస్థల కుట్ర అనీ శంకరాచార్య స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు మంగళవారం పత్రికల్లో వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మోహన్‌బాబు ఘాటుగా స్పందించారు. శంకరాచార్యస్వామి ఫొటో చూస్తే దాదాపు ఎనభై సంవత్సరాలు పైబడిన వయో వృద్ధునిలా కనిపిస్తోందని, ఆయన పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తోందని అన్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన వయసుకు, ఆయన పెద్దరికానికి సరికాదని అభిప్రాయపడ్డారు. "ఎవరి కులాన్ని వారు, ఎవరి మతాన్ని వారు పూజించుకోవచ్చు, గౌరవించుకోవచ్చనేది నా అభిమతం. ఎదుటి వాడి కులం తక్కువ, నా కులం ఎక్కువ అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. మానవత్వం ఉన్న వాళ్లెవరూ అలా చెప్పరు. దాదాపు 1985వ సంవత్సరం నుంచి షిర్డీసాయి భక్తునిగా ఆయన మాటలకు నా మనసు ఆవేదన పడి, బాధపడి ఇది చెప్పాల్సి వస్తోంది'' అని మోహన్‌బాబు చెప్పారు. "అల్లుడుగారు సినిమాకి ముందు నాకు సక్సెస్‌లు లేవు. నేను బాబా దగ్గరకెళ్లి, నేనేం తక్కువ? నిర్మాతగా, హీరోగా నాకెందుకు అపజయాలిస్తున్నావు? అని ఆయన్నే ప్రశ్నించాను. ఆ తర్వాత అన్నీ సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలే. ఇది నిజం. 'శ్రీరాములయ్య' సినిమా ఓపెనింగ్‌లో జరిగిన బాంబు పేలుడు దుర్ఘటనలో నా తమ్ముడు పరిటాల రవినీ, నన్నూ కాపాడింది బాబానే. కాకపోతే కొంతమంది మరణించడం బాధాకరం'' అని అన్నారు. "షిర్డీ సాయినాథుడిని ఈశ్వర అంశగా నేను భావిస్తాను, నమ్ముతాను. బాబా గుడికి ఎంతోమంది ముస్లిం, క్రైస్తవ, హిందూ సోదరులు వెళ్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆ పెద్దాయనకు నమస్కారం చేస్తున్నా'' అని ఆయనన్నారు. "నీకిష్టం లేకపోతే పూజించడం మానేసేయ్. అది నీ స్వవిషయం. కానీ దాన్ని మాకు రుద్దొద్దు. నీ శిష్యులకెవరికైనా రుద్దుకో'' అని స్వామీజీకి సూచించారు. తన దృష్టిలో స్వామీజీ అంటే ఆకులూ, అలములూ తింటూ, శుచీ శుభ్రత కావాలని కోరుకోకుండా ఉండే వ్యక్తి అనీ, నిరాండబర, నిస్వార్థ జీవి అనీ చెప్పారు. పట్టు పీతాంబరాలు ధరించేవాళ్లూ, సెంట్లు కొట్టుకొనేవాళ్లూ, పిస్తా, బాదం పప్పు తింటూ, ఆవు పాలే తాగే వ్యక్తులూ స్వామీజీలు కారని ఎద్దేవా చేశారు. నిజమైన స్వామీజీలు వారు హిమాలయాల్లోనే ఉంటారని చెప్పారు.
- See more at: http://telugu.expresstv.in/telugu/top-news-7576.html#sthash.7WPrWMy3.dpuf
షిర్డీ సాయి దేవుడు కాదు - స్వరూపానందAdd To Your Favourites
Posted: 06/23/2014 02:23 PM | Updated:: 06/23/2014 02:23 PM
Google +
సద్గురుసాయి.. సాయినాథుడు, సాయిబాబా.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే ప్రత్యక్ష దైవంగా కోట్లాదిమంది విశ్వసించేది.. షిర్డీ సాయినాథుణ్ణి. కానీ.. ఈ సాయి దైవం కాదట.. ఈ మాట అన్నది ఎవరో కాదు... వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ద్వారాకపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద .. షిర్డీ సాయిబాబా దేవుడు కాదు.. బాబాను పూజించడం తగదు.. షిర్డీ సాయిని పూజించడం తప్పంటున్నారు.. ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద. అవును బాబాను పూజించడం తగదంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన శంకరాచార్య వ్యాఖ్యలపైనే ఇప్పుడు యావత్ దేశం చర్చిస్తోంది. సాయిబాబా ఓ సన్యాసిమాత్రమేనని.. సాయిని పూజించడమంటే.. ఓ పెద్ద కుట్ర అన్నది శంకరాచార్య అభియోగం. ఇది హిందువులను విభజించే కుట్రగా ఆయన అభివర్ణించారు. సాయి కేవలం మానవమాత్రుడని.. దేవుడు కాదని..ఆయనకు దేవాలయాలు కట్టకూడదనికూడా తేల్చిచెప్పేశారు శంకరాచార్య. ఈ కుట్రలక్ష్యం అయోధ్యలో రామమందరిమేనన్నది శంకరాచార్య ఆరోపణ. దేశవ్యాప్తంగా బాబాకు లక్షలాది గుళ్లను కట్టడమంటే.. అయోధ్య రామ మందిర ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇవన్నీ అంటూ.. శంకరాచార్య అంటున్నారు. ्విదేశీ ఏజెన్సీలు ఈ కుట్రకు పాల్పడుతున్నట్టు.. ఇందులో కోట్లాదిరూపాయలు చేతులు మారుతున్నట్టుకూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. హిందువుల ఐక్యతను చూసి కన్నుకుట్టిన విదేశీ ఏజెన్సీలు ఇలాంటి కుట్రకు పాల్పడినట్టు ద్వారకా పీఠాధిపతి సంచలన ఆరోపణలు చేశారు. హిందూ-ముస్లిం ఐక్యతకు చిహ్నంగా బాబాను గుర్తించేందుకుకూడా శంకరాచార్య తిరస్కరించారు. 24 అవతారాల్లో విష్ణుమూర్తి అవతరిస్తారని సనాతన ధర్మం చెబుతోందని..కానీ కలియుగంలోమాత్రం.. కేవలం కల్కి, బుద్ధ అవతారాల్లోనే విష్ణు మూర్తి అవతరిస్తారని చెప్పారని ఆయన మరింత వివరంగా చెప్పారు. అంటే విష్ణుమూర్తి అవతారాల్లో సాయిబాబా అనే అవతారమే లేదని స్వామీజీ తేల్చేశారు.
స్వామి స్వరూపానందపై కేసు నమోదు
Sakshi | Updated: June 25, 2014 08:49 (IST)
No comments:
Post a Comment